'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు | Rashmika Mandanna Praises India Atal Setu In Mumbai Goes Viral | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: 'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు

May 14 2024 7:31 PM | Updated on May 14 2024 8:07 PM

Rashmika Mandanna Praises India Atal Setu In Mumbai Goes Viral

నేషనల్‌ క్రష్‌గా అభిమానుల్లో పేరు సంపాదించుకున్న బ్యూటీ రష్మిక మందన్నా. గతేడాది యానిమల్‌తో హిట్‌ను ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న కన్నడ భామ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముంబయిలో నిర్మించిన అటల్‌ సేతు గురించి మాట్లాడింది. ఇండియాలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రశంసలు కురిపించారు.

రష్మిక మాట్లాడుతూ..' ముంబై-ట్రాన్స్ హార్బర్ లింక్ అటల్ సేతు అద్భుతంగా ఉంది. 2 గంటల జర్నీ కేవలం 20 నిమిషాల్లో చేరుకుంటున్నాం. అసలు మాటలు రావడం లేదు. ముంబయి టూ నవీ ముంబయి, ముంబయి టూ గోవా, ముంబయి టూ బెంగళూరు ప్రయాణించడం చాలా ఈజీ అయిపోయింది.  ప్రస్తుతం ఇండియా చాలా వేగంగా దూసుకెళ్తోంది. మరింత వేగంగా అభివృద్ది చెందుతోంది. ఈ విషయంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరు" అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement