పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ ట్యాగ్ సొంతం చేసుకున్న భామ రష్మిక మందన్నా. ప్రస్తుతం ఆమె పరిస్థితి కాస్తా గందరగోళంగా మారింది. అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి అన్న తరహాలో రష్మిక పరిస్థితి ఉందటున్నారు నెటిజన్స్. అసలు విషయానికొస్తే కన్నడ చిత్రసీమ నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చిన ముద్దుగుమ్మ. అక్కడ ఛలో అనే తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత చిత్రం గీతగోవిందంతో అనుహ్యమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇక అల్లు అర్జున్‌తో పుష్ప చిత్రం ఏకంగా రష్మిక దశనే మార్చేసింది. ఈ చిత్రం ఆమెను బాలీవుడ్ వరకు తీసుకెళ్లింది.
(ఇది చదవండి: Roopa Koduvayur: వరుస సినిమాలతో దూసుకెళ్తున్న తెలుగు బ్యూటీ )
అలా అక్కడ రెండు, మూడు చిత్రాలు చకచకా చేసేసింది భామ. ఆ చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయినా, నటిగా రష్మికకు మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టాయి. దీంతో మరో రెండు, మూడు చిత్రాలు ఈ బ్యూటీని వరించాయి. అలా రణ్‌వీర్ కపూర్ సరసన నటించిన యానిమల్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదేవిధంగా షాహీద్ కపూర్ జత కట్టే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది. ఆ చిత్రం కోసం తెలుగులో టాలీవుడ్ హీరో నితిన్ సరసన నటించే అవకాశాన్ని వదులుకుంది. నిజానికి ఈ జంట భీష్మ చిత్రం సక్సెస్‌తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది.
కాగా ఇప్పుడేమో షాహీద్ కపూర్ సరసన నటించే బాలీవుడ్ చిత్రం బడ్జెట్ కారణంగా ఆగిపోయిందనే విషయం రష్మికకు షాక్ ఇచ్చిందని సమాచారం. దీంతో ఆమె ఊహించింది ఒకటైతే జరిగింది.. మరొకటి అంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ప్రస్తుతం రష్మిక హిందీలో యానిమల్ చిత్రం, తెలుగులో పుష్ప –2 చిత్రాలు పైనే ఆశ పెట్టుకుందని సమాచారం. అదే విధంగా రెయిన్బో అనే మరో ద్విభాషా చిత్రం కూడా ఆమె చేతిలో ఉంది.
(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. తీవ్రమైన వ్యాధితో నటి మృతి!)
Comments
Please login to add a commentAdd a comment