దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఇటీవల అత్యంత పొడవైన సముద్రపు బ్రిడ్జ్ ‘ముంబాయ్ ట్రాన్స్ హార్బర్ లింక్’ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ బ్రిడ్జ్‌కు మరో పేరు ‘అటల్ సేతు’. తాజాగా అటల్ సేతుపై ఆటో రిక్షా వెళ్లటంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. శరావనన్ రాధాకృష్ణన్ అనే ఓ వ్యక్తి ‘ఎక్స్’ ట్విటర్‌లో అటల్ సేతుపై ఆటో రిక్షా వెళ్లుతున్న ఫొటోను పోస్ట్ చేశారు.
ట్రాఫిక్ నిబంధలను ఉల్లఘించి అటల్ సేతుపై ఆటో రిక్షా ఎలా వచ్చిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇటీవల ప్రారంభమైన ఈ వంతనపైకి టూ వీలర్, త్రీవీలర్ అనుమతి లేదని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. కేవలం వేగంగా వెళ్లే ఫోర్ వీలర్ వాహనాలుకు మాత్రమే ఈ బ్రిడ్జ్‌పై అనుమంతి ఉంది. అయితే త్రీ వీలర్ అయిన ఆటో రిక్షా అటల్ సేతుపై ప్రత్యక్షం కావటంతో అసలు టోల్‌బూత్‌లను దాటుకొని అది ఎలా బ్రిడ్జ్‌పై వచ్చిందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
‘వావ్.. మొత్తానికి ఆటో రిక్షాను వేగంగా వెళ్లే వాహనాల కేటగిరీలో చేర్చవచ్చు’, ‘అతని ఫైన్ వేయకండి.. నేను కూడా నా టూ వీలర్ కూడా తీసుకువస్తా’, ‘అటల్ సేతుపై అనుమతి లేదు కాదా..ఇది ఎలా సాధ్యమైంది’ అని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
మరో వైపు అద్భుతంగా నిర్మించిన ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చాలా మంది వాహనదారులు ఆగిమరీ చూస్తున్నారు. దీంతో బ్రిడ్జ్‌పై ఇతర వాహనాలుకు ఇబ్బంది కలుతోందని వారికి ఇబ్బంది కలిగించవద్దని ముంబై ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. అటల్‌సేతు టూరిస్ట్ ప్రదేశం కాదని.. ఇక్కడ ఫొటోలు తీసుకోవద్దని ఆదేశించారు. ఇక..ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని నవా శేవాను కలుపుతుందీ బ్రిడ్జ్. మొత్తం పొడవు 21. 8 కిలోమీటర్లు కాగా..సుమారు 16 కిలో మీటర్లకు పైగా అరేబియా సముద్రపైనే ఉంటుంది.
చదవండి: Lithium Mining: చైనాను బీట్ చేసే భారత్ ప్లాన్ ఇదేనా!
Comments
Please login to add a commentAdd a comment