Auto rickshaw
-
ఆటోకి మూడు చక్రాలే ఎందుకు?.. కారణం తెలుసా!
దశాబ్దాల చరిత్ర ఉన్న.. ఆటో రిక్షా ఎన్ని అప్డేట్స్ పొందినా మూడు చక్రాలతోనే వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా.. పట్టణ ప్రాంతాల్లో కూడా విరివిగా అందుబాటులో ఉన్న ఆటోలకు ఇతర వాహనాలకు మాదిరిగా ఎందుకు నాలుగు చక్రాలు ఉండవు?, మూడు చక్రాలు ఉండటానికి కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.బ్యాలెన్స్ చేయడం సులభంనాలుగు చక్రాల వాహనాల కంటే.. మూడు చక్రాల వాహనాలను బ్యాలెన్స్ చేయడం కొంత సులభం అని ఓ ఐఐటీ ప్రొఫెసర్ వివరించారు. అంతే కాకుండా.. దీనిని రూపొందించడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువని అన్నారు.ఖర్చు మాత్రమే కాకుండా.. ఇంజినీరింగ్ వర్క్ కూడా తక్కువే. నాలుగు చక్రాల వాహనం కన్నా మూడు చక్రాల వాహనం చిన్నదిగా రూపొందుతుంది. అలాంటప్పుడు ఎటువంటి ఇరుకు ప్రాంతంలో ప్రయాణించడానికైనా, కొద్దిపాటి ప్రాంతంలో పార్క్ చేయడానికైనా అనువుగా ఉంటుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే పట్టణాల్లో ఆటోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.మూడు చక్రాల వాహనం వలన ఇంధన వినియోగం కూడా భారీగా అవదు. ఆటోను నడిపించేందుకు ఇంజనుకు తక్కువ శక్తి సరిపోతుంది. కాబట్టి ఆటోలను నడిపేవారు కూడా దీని నిర్వహణకు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మొత్తం మీద ఈ కారణాల వల్లనే ఆటో మూడు చక్రాలను మాత్రమే కలిగి ఉంటుంది. -
కష్టజీవులను కబళించిన మృత్యుశకటం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గార్లదిన్నె: వారంతా వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు. రోజూ మాదిరిగానే ఉదయాన్నే పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యుశకటం కబళించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నెకు సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు గార్లదిన్నె మండలం తిమ్మంపేట వద్ద అరటి తోటలో ఎరువు వేసే పనికోసం ఉదయమే ఆటోలో వచ్చారు. అక్కడ పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి తిరుగు పయనమయ్యారు. తలగాచిపల్లి క్రాస్ వద్ద ఆటో గార్లదిన్నె వైపునకు మలుపు తీసుకుంటుండగా.. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలపెద్దయ్య అలియాస్ తాతయ్య (55), చిన్ననాగమ్మ (48) రామాంజినమ్మ (47), పెద్ద నాగమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో నుంచి రోడ్డు మీద పడి తీవ్రగాయాలతో హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తున్న కూలీలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనాల్లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్ననాగన్న (55), జయరాముడు (48), కొండమ్మ (50), ఈశ్వరయ్య మృతిచెందారు. లక్ష్మీదేవి, పెద్దులమ్మ, రామాంజినమ్మ, గంగాధర్, ఆటో డ్రైవర్ నీలకంఠ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో చిన్ననాగన్న–చిన్ననాగమ్మ, ఈశ్వరయ్య–కొండమ్మ దంపతులు.ఒకేరోజు ఎనిమిది మంది మృతిచెందడం, ఐదుగురు గాయపడడంతో ఎల్లుట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతపురం ప్రభుత్వాస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై గార్లదిన్నె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్, అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి:వైఎస్ జగన్అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించారు. వీరంతా కూలి పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. వారికి అవసరమైన సాయం అందజేయాలని కోరారు. -
UK YouTuber Couple: ఆటోప్రయాణంలో అడుగడుగునా ఆనందమే వైరల్
ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్, జావిన్ దంపతులకు మన దేశం అంటే చాలా ఇష్టం. ‘దోజ్ హ్యాపీ డేస్’ పేరుతో యూట్యూబ్ చానల్ నడుపుతున్న ఈ దంపతులు మన దేశానికి వచ్చారు. వారి స్థాయికి ఏ ఫైవ్‌స్టార్ హోటల్లోనో ఉండవచ్చు. ఖరీదైన కారులో ప్రయాణించవచ్చు. అలా కాకుండా ఈ డైనమిక్ ద్వయం ఒక ఆటోరిక్షాలో అమృత్సర్ నుంచి తమిళనాడు వరకు ఎన్నో ప్రాంతాలు పర్యటించింది. ఆటోకు ‘పీట్’ అని పేరు పెట్టి అందంగా అలంకరించారు. ఆటోడ్రైవింగ్ నేర్చుకున్నారు. చెన్నైలోని ట్రాఫిక్ ప్రాంతాల్లో డ్రైవింగ్ ప్రాక్టీస్ చేశారు. ‘ఫరవాలేదు. ఇక మనం ముందుకు వెళ్లవచ్చు’ అని నమ్మకం వచ్చిన తరువాతే ప్రయాణం ప్రారంభించారు. తమ ఆటో ప్రయాణంలో చెప్పలేనంత సందడి ఉన్న సంతలను, ధ్యానముద్రతో ఉన్న ప్రశాంత దేవాలయాలను, విభిన్న విశ్వాసాలు, ఆచారాల సామరస్య దృశ్యాలను, బాటసారులను, చెట్టుచేమను చూస్తూ ఎంజాయ్ చేశారు. నోరూరించే వంటకాలను ఆస్వాదించారు. -
అటల్ సేతుపై ఆటో రిక్షా.. అదేలా సాధ్యం!
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఇటీవల అత్యంత పొడవైన సముద్రపు బ్రిడ్జ్ ‘ముంబాయ్ ట్రాన్స్ హార్బర్ లింక్’ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ బ్రిడ్జ్‌కు మరో పేరు ‘అటల్ సేతు’. తాజాగా అటల్ సేతుపై ఆటో రిక్షా వెళ్లటంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. శరావనన్ రాధాకృష్ణన్ అనే ఓ వ్యక్తి ‘ఎక్స్’ ట్విటర్లో అటల్ సేతుపై ఆటో రిక్షా వెళ్లుతున్న ఫొటోను పోస్ట్ చేశారు. ట్రాఫిక్ నిబంధలను ఉల్లఘించి అటల్ సేతుపై ఆటో రిక్షా ఎలా వచ్చిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇటీవల ప్రారంభమైన ఈ వంతనపైకి టూ వీలర్, త్రీవీలర్ అనుమతి లేదని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. కేవలం వేగంగా వెళ్లే ఫోర్ వీలర్ వాహనాలుకు మాత్రమే ఈ బ్రిడ్జ్‌పై అనుమంతి ఉంది. అయితే త్రీ వీలర్ అయిన ఆటో రిక్షా అటల్ సేతుపై ప్రత్యక్షం కావటంతో అసలు టోల్‌బూత్‌లను దాటుకొని అది ఎలా బ్రిడ్జ్‌పై వచ్చిందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘వావ్.. మొత్తానికి ఆటో రిక్షాను వేగంగా వెళ్లే వాహనాల కేటగిరీలో చేర్చవచ్చు’, ‘అతని ఫైన్ వేయకండి.. నేను కూడా నా టూ వీలర్ కూడా తీసుకువస్తా’, ‘అటల్ సేతుపై అనుమతి లేదు కాదా..ఇది ఎలా సాధ్యమైంది’ అని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరో వైపు అద్భుతంగా నిర్మించిన ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చాలా మంది వాహనదారులు ఆగిమరీ చూస్తున్నారు. దీంతో బ్రిడ్జ్‌పై ఇతర వాహనాలుకు ఇబ్బంది కలుతోందని వారికి ఇబ్బంది కలిగించవద్దని ముంబై ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. అటల్‌సేతు టూరిస్ట్ ప్రదేశం కాదని.. ఇక్కడ ఫొటోలు తీసుకోవద్దని ఆదేశించారు. ఇక..ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని నవా శేవాను కలుపుతుందీ బ్రిడ్జ్. మొత్తం పొడవు 21. 8 కిలోమీటర్లు కాగా..సుమారు 16 కిలో మీటర్లకు పైగా అరేబియా సముద్రపైనే ఉంటుంది. చదవండి: Lithium Mining: చైనాను బీట్ చేసే భారత్ ప్లాన్ ఇదేనా! -
వృద్ధురాలి హత్య.. పట్టించిన "కింగ్ కోహ్లి"..!
"కింగ్ కోహ్లి" ఓ హత్య కేసును ఛేదించడంలో పోలీసులకు పరోక్షంగా తోడ్పడ్డాడు. వివరాల్లో వెళితే..బెంగళూరులోని మహాలక్ష్మీపురంలో నివసించే కమలమ్మ (82) అనే వృద్ద మహిళను కొందరు దుండగులు నగలు, డబ్బు కోసం హత్య చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించకపోగా.. కింగ్ కోహ్లి పేరు వారికి ఈ కేసును ఛేదించడంలో తోడ్పడింది. మే 27న కమలమ్మ ఇంట్లో ఒంటిరిగా ఉండటాన్ని గమనించిన సిద్దరాజు, అశోక్, అంజనా మూర్తి అనే మగ్గురు వ్యక్తులు ఓ నంబర్ ప్లేట్ లేని ఆటోలో వచ్చి హత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత వారు మహిళ ఒంటిపై ఉన్న నగలు, ఇంట్లో ఉన్న కొంత నగదును దోచుకుని పరారయ్యారు. కేసు దర్యాప్తు చేసే క్రమంలో తొలుత పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే హత్య జరిగిన రోజు ఉదయం కమలమ్మ ఇంటి పరిసరాల్లో "కింగ్ కోహ్లి" పేరు టాప్ వెనక భాగంపై రాసి ఉన్న ఓ నంబర్ ప్లేట్ లేని ఆటో అనుమానాస్పదంగా సంచరించడాన్ని పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలించే క్రమంలో ఓ కీలక ఆధారం దొరికింది. హత్య జరిగిన రోజు కమలమ్మ ఇంటి సమీపంలో అంజనా మూర్తి అనే వ్యక్తి కింగ్ కోహ్లి అనే పేరు రాసి ఉన్న ఆటోకు నంబర్ ప్లేట్ తొలగిస్తూ కనిపించాడు. నంబర్ ప్లేట్‌పై రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకుని, కటకటాల వెనక్కు పంపారు. ఈ రకంగా కింగ్ కోహ్లి ఓ హత్య కేసును ఛేదించడంలో పోలీసులకు తోడ్పడ్డాడు. ఐపీఎల్ బెట్టింగ్‌ల కారణంగా నిందితులు అప్పులపాలై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం విరాట్ కోహ్లి డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి 11 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్ కోసం కోహ్లి కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఐపీఎల్ ఫామ్‌ను ఇక్కడ కూడా కొనసాగించి, తన జట్టుకు ఎలాగైనా ఐసీసీ ట్రోఫీ అందించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. -
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..ప్రయాణికురాలు సజీవదహనం
మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో రిక్షాలో మంటలు చెలరేగడంతో ఓ మహిళ ప్రయాణికురాలు అక్కడికక్కడే సజీవ దహనమైంది. ఈ ఘటన థానేలోని ఘోడ్‌బందర్ రోడ్డులోని గైముఖ్ ప్రాంతంలో జరిగిందని అధికారులు తెలిపారు. ఆటో రిక్షా డివైడర్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన మహిళను గుర్తించాల్సి ఉందన్నారు. ఆమె వాహనంలో ఇరుక్కుపోవడంతోనే సజీవ దహనమైనట్లు తెలిపారు. ఆ ఆటో రిక్షి థానే నగరం నుంచి భయందర్ వైపు వెళ్తుండగా నియంత్రణ కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో డ్రైవర్ రాజేష్ కుమార్‌కు(45) తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: కింగ్ చార్లెస్ పట్టాబిషేకం కోసం ముంబై డబ్బావాలాలు గిఫ్ట్‌లు కొనుగోలు) -
ఢిల్లీలోని ఆటో రిక్షాలో యూఎస్ సెక్రటరీ: వీడియో వైరల్
న్యూఢిల్లీ మార్చి1న జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు జరిగిన సంగతి తెలిసింది. ఆ సదస్సు కోసం అని భారత పర్యటనకు వచ్చిన యూఎస్ సెక్రటరీ ఆంటోని బ్లింకెన్ ఆటో రైడ్ చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని అమెరికా రాయబారి కార్యాలయంలో సుదీర్ఘ కాలం పనిచేస్తున్న స్థానిక సిబ్బంది సాయంతో సమీపంలోని ఓ స్థానిక ఆటోలో సరదాగా కాసేపు చక్కెర్లు కొట్టారు. అందుకు సంబంధించని వీడియోని అమెరికా రాయబారి కార్యాలయం ఇది మా ప్రసిద్ధ ఆటోగ్యాంగ్ అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్వీట్టర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. Who says official motorcades have to be boring? Watch @SecBlinken cruise in style with the longest-serving locally employed staff at the U.S. Embassy in New Delhi. Our famous #AutoGang 🛺 and their signature "autocade" followed close behind. What an entrance! pic.twitter.com/KbhZPybLy8 — U.S. Embassy India (@USAndIndia) March 3, 2023 (చదవండి: చైనా బెదిరింపులు విదేశాంగ మంత్రికి అర్థం కావడం లేదు:: రాహుల్) -
మంగళూరు లో ఆటో రిక్షా బ్లాస్ట్ విజువల్స్
-
డీజిల్ వాహనాలు.. ఇకపై ఎలక్ట్రిక్! ఆటోలకు రూ.15 వేల సబ్సిడీ
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా డీజిల్ వాహనలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ(టీఎస్ రెడ్కో) ప్రణాళికలు సిద్ధం చేసింది. కాలుష్యనియంత్రణ దిశగా రెడ్కో ఈ చర్యలు చేపడుతోంది. 5 వేల ఆటోలకు బ్యాటరీలు బిగించి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించింది. తొలుత జీహెచ్ఎంసీ పరిధిలో 500 ఆటోలకు బ్యాటరీలు అమర్చాలని భావిస్తోంది. ఒక్కో ఆటోకు రూ.15 వేల సబ్సిడీని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు త్వరలో టెండర్లు పిలవాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖలకు నెలవారీ అద్దె కింద ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ వాహనాలే తీసుకునేలా చర్యలు చేపడుతోంది. కొత్తగా 138 చార్జింగ్ కేంద్రాలు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండటంతో రాష్ట్రంలో 138 కొత్త ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు టీఎస్ రెడ్కో కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌లో 118, వరంగల్, కరీంనగర్ నగరాల్లో చెరో 10 చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు తాజాగా టెండర్లు ఆహ్వానించింది. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల స్థలాల్లో రెవెన్యూ షేరింగ్ విధానంతోపాటు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు చేయనుంది. హెచ్ఎండీఏ, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, పర్యాటక, పౌర సరఫరాల, రోడ్డు, రవాణా శాఖలు తమ పరిధిలో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనువైన 979 స్థలాలను గుర్తించి టీఎస్ రెడ్కోకు జాబితాను అందజేశాయి. జీహెచ్ఎంసీ, పర్యాటక శాఖల స్థలాలను ఇప్పటికే అధీనంతోకి తీసుకోగా, మిగిలిన శాఖలతో రెవెన్యూ షేరింగ్ విధానంలో ఒప్పందం చేసుకోవడానికి రెడ్కో చర్యలు తీసుకుంటోంది. చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు 20 మంది ఆపరేటర్లను ఎంప్యానల్ చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీకి రుణాలు ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారులను ప్రోత్సహించేందుకు 18 బ్రాండ్లతో రెడ్కో ఒప్పందం కుదుర్చుకుంది. తయారీదారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంలు, సింగరేణితో కలిసి త్వరలో ఓ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. తయారీదారులకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించేందుకు సహకరించనుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్లకు ప్రాచుర్యం కల్పించేందుకు త్వరలో మొబైల్ యాప్‌ను ఆవిష్కరించనున్నామని టీఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి తెలిపారు. దీని ద్వారా రుణాలతోపాటు చార్జింగ్ కేంద్రాలను మానిటరింగ్ చేసే వీలుంటుందని తెలిపారు. -
ఒంటరి అమ్మ బతుకు పోరు
27 ఏళ్ల చంచల్ శర్మ ఝాన్సీ లక్ష్మీబాయిని గుర్తుకు తెస్తోంది. ఝాన్సీ తన బిడ్డను కట్టుకుని శత్రువుతో యుద్ధం చేస్తే చంచల్ తన బిడ్డను కట్టుకుని బతుకుపోరు చేస్తోంది. గర్భంతో ఉండగా భర్త నుంచి విడిపోయిన చంచల్ బిడ్డ పుట్టాక ఏడుస్తూ కూచోలేదు. బతకాలని బిడ్డను బతికించుకోవాలని సంకల్పించింది. ఆమె కథ ఇప్పడు నెట్లో వైరల్‌గా మారింది. ఢిల్లీ– నోయిడాలో చంచల్ శర్మ నడిపే ఈ ఆటో రిక్షా అందరికీ తెలుసు. దాని డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉండే ఆమెను అందరూ మెచ్చుకోలుగా చూస్తూ ఉంటారు. ఆశ్చర్యంగా చూస్తు ఉంటారు. గౌరవంగా చూస్తూ ఉంటారు. దాని కారణం ‘కంగారు’లాగా ఆమె కూడా తన ఒక సంవత్సరం కొడుకును పొట్టకు దగ్గరగా కట్టుకుని డ్రైవింగ్ చేస్తూ ఉండటమే. పల్లెల్లో బిడ్డను నడుముకు కట్టుకుని కూలి పనులు చేసే తల్లులు మనకు కొత్త కాదు. కాని ఒక ఆటో రిక్షా నడుపుతూ ఇలా నగరంలో ఒక ఒంటరి తల్లి తన బతుకు కోసం సంఘర్షించడం మాత్రం కొత్త. ఇటీవల ఈమె గురించి మీడియాలో వస్తే సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడారు. మెచ్చుకున్నారు. ఎందుకు? జీవితం సవాలు విసిరినప్పుడు చేతనైన జవాబు చెప్పాలని చంచల్ అనుకోవడమే. భర్త నుంచి విడిపోయి... 27 ఏళ్ల చంచల్ శర్మ పెళ్లయ్యి గర్భం వచ్చాక భర్త నుంచి విడిపోవాల్సి వచ్చింది. ఆమెకు తల్లి తప్ప ఎవరూ లేరు. బతుకు తెరువు లేదు. బిడ్డకు జన్మనిచ్చాక ఒకవైపు భర్త తోడు లేకపోవడం, మరోవైపు బిడ్డ బాధ్యత ఆమెను సతమతం చేశాయి. జీవితంలో ఓడిపోవడమా? పోరాడి నిలవడమా? రెండో మార్గమే ఎంచుకుంది. కొడుకు నెలల బిడ్డగా ఉండగా తల్లి దగ్గరే వదిలి ఈ ఆటో రిక్షా నడపడం మొదలెట్టింది. కాని ఇప్పుడు వాడికి సంవత్సరం నిండింది. తల్లి కోసం బెంగటిల్లుతుంటాడు. అదీగాక తల్లి ఆ పిల్లాణ్ణి చూసుకోలేకపోతోంది. క్రష్‌లో వేద్దామంటే అందుకు కట్టాల్సినంత డబ్బు తన వద్ద లేదు. పైగా క్రష్‌లు కూడా బాగా చార్జ్ చేస్తున్నాయి ఢిల్లీలో. అందుకే తనతోపాటే కొడుకును నడుముకు కట్టుకుని డ్యూటీ చేయాలని నిశ్చయించుకుంది చంచల్ శర్మ. 600 సంపాదన... ఉదయం ఆరున్నరకు కొడుకుతో పాటు డ్యూటీ ఎక్కుతుంది చంచల్ శర్మ. మధ్యాహ్నం వరకూ ఆటో నడిపి ఇల్లు చేరుతుంది. కొడుక్కు స్నానం చేయించి, తినిపించుకుని, కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ డ్యూటీ ఎక్కుతుంది కొడుకుతో. రాత్రి ఎనిమిది వరకూ పని చేస్తుంది. మధ్యలో కొడుకు ఆకలికి ఒక పాల సీసా పెట్టుకుంటుంది. ఇంత శ్రమ చేస్తే ఆమెకు రోజుకు 600 మిగులుతున్నాయి. ఒక్కోసారి కొడుకు పొట్ట మీద నిద్రపోతాడు. ఒక్కోసారి మేలుకుని హుషారుగా ఉంటాడు. ఒక్కోసారి మాత్రం ఏడుస్తూనే ఉంటాడు. కాని పాసింజర్లు విసుక్కోరు. ఆమెను సానుభూతితో అర్థం చేసుకుంటారు. మహిళా పాసింజర్లయితే ఈమె ఆటోనే వెతికి ఎక్కుతారు.. సాయం చేసినట్టు ఉంటుందని. ఎండాకాలం వస్తే మాత్రం బిడ్డను తీసుకుని తిరగడం కష్టం అంటుంది చంచల్. ఆ టైమ్‌లో తల్లి మీద ఆధారపడాల్సి వస్తుంది అంటుంది. ‘నా బిడ్డ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటుంది చంచల్ శర్మ. ఒంటరి స్త్రీ... సింగిల్ మదర్‌గా జీవించడంలో బెంబేలెత్తాల్సిన పని లేదు. సమాజంలో ఇప్పుడు సింగిల్ మదర్‌కు అండ దొరుకుతుంది. వారు కష్టపడి పని చేయాలనుకుంటే సాయం చేసే వారూ ఉన్నారు. కావలసిందల్లా ఎదురొడ్డే తెగువే. చంచల్ శర్మను చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతున్నారు. -
పిల్లలను ఇలా పంపించగలమా?...ఏకంగా ఆటోపై కూర్చోబెట్టి..:వీడియో వైరల్
రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందకు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్న నిబంధనలను గాలికొదిలేసి నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్నారు చాలా మంది వాహనదారులు. కళ్లముందే ఘోరమైన రోడ్డుప్రమాదాలు జరుగుతున్న కనువిప్పు కలగకపోవడం దురదృష్టం. ఏయే వాహనాల్లో ఎంతమంది ప్రయాణించాలానే రూల్ కూడా ఉంది. ఐతే డబ్బులకు కక్కుర్తిపడి కొంతమంది వాహనదారులు పరిమితికి మించి జనాలను ఎక్కించుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడొక ఒక ఆటో డ్రైవర్ అలాంటి పనే చేశాడు. విచిత్రమేమిటంటే అతను పోలీస్ కార్యాలయం నుంచి వెళ్లినా చర్యలు తీసుకోకపోవడం. వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక ఆటో డ్రైవర్ చిన్నారులను ఏకంగా ఆటోపైన కూర్చోబెట్టి తీసుకువెళ్లాడు. సుమారు ముగ్గురు చిన్నారులను ఆటో పైన కూర్చొబెట్టాడు. ఆ ముగ్గురు చిన్నారులు సుమారు 11 నుంచి 13 ఏళ్ల వయసు లోపు వాళ్లే. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఒక ట్విట్టర్ వినియోగదారుడు పోస్ట్ చేస్తూ "ఎవరైనా తమ పిల్లలను ఇలా పాఠశాలకు పంపగలారా?" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశాడు. పైగా ఆ ఆటో సమీపలోని ఆర్టీవో ఆఫీస్, నకిటీయా పోలీస్ ఔట్‌పోస్ట్ నుంచి వెళ్లినప్పటికీ ఎవరు చర్యలు తీసుకోకపోవడ విచిత్రం అని పేర్కొన్నాడు. బహుశా అందరూ నిద్రపోతున్నారంటూ... కామెంట్ చేశాడు. దీంతో బరేలీ పోలీసులు ఈ వైరల్ వీడియోను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని, జరిమానా కూడా విధిస్తామని ట్వీట్ చేశారు. ఈ మేరకు పోలీస్ అధికారి రాజీవ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ...పిల్లల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా డ్రైవింగ్ చేసే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని, పైగా ఇలాంటి డ్రైవర్లను అనుమతించకుండా పాఠశాల నిర్వాహకులతో మాట్లాడుతామని చెప్పారు. How can someone send their children to school with such a careless auto driver. Visuals from UP's Bareilly. This auto crossed office of RTO, Nakatia police outpost on Friday but everyone seemed to be sleeping. No action taken with registration no. UP25ET8342 by@Uppolice pic.twitter.com/hcfidtIJFS — Raj Kumar Bhim Army (@Rajkuma79883678) August 28, 2022 (చదవండి: ఆగ్రహంతో ప్రభుత్వాధికారిని స్థంభానికి కట్టేసిన రైతులు: వీడియో వైరల్) -
ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇలా కూడా వాడొచ్చా?
-
అరే ఏంట్రా ఇది.. ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇలా కూడా వాడొచ్చా?
ఫుట్ ఓవర్ బ్రిడ్జి... రద్దీ రోడ్లను దాటేందుకు ఇబ్బంది పడకుండా పాదచారులకోసం చేసే ప్రత్యేక ఏర్పాటు. కానీ.. మనవాళ్లు ఎలా ఉపయోగించారో చూడండి. అవును.. మీరు చూసింది నిజమే! ఆ బ్రిడ్జి మీదుగా ఆటో వెళ్తోంది. ‘ఇండియాలో ఇంతే!’ అనేలాంటి ఈ ఘటన మహారాష్ట్రలోని ఢిల్లీ–చెన్నైలను కలిపే జాతీయరహదారి 48పై పాల్ఘర్ జిల్లాలో జరిగింది. ఎస్‌యూవీలకు కూడా సాధ్యం కానీ ఆ ఫీట్ ఆటో ఎలా చేసింది? స్టెప్స్ ఎలా ఎక్కగలిగిందనే కదా మీ సందేహం. అక్కడ ర్యాంప్ సౌకర్యం ఉంది. రోడ్డు దాటాలనుకున్న డ్రైవర్ ర్యాంప్ ఎక్కించేసి తాపీగా ఫుట్ఓవర్ బ్రిడ్జిపైనుంచి రోడ్డును దాటేశాడు. ట్విట్టర్లో వైరల్ అవుతున్న ఆ వీడియోను రోడ్స్ ఆఫ్ ముంబై పోస్టు చేసింది. ‘బస్ యహీ దేఖ్నా బాకీ తా’ అంటూ కోట్ చేసింది. ‘ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇలా కూడా ఉపయోగిస్తారా?’ అంటూ కొందరు కామెంట్ చేస్తే.. ‘అక్కడ మూడునాలుగు కిలోమీటర్ల వరకు క్రాసింగ్ లేదు. చిన్న చిన్న వాహనాలు అలాగే దాటేస్తుంటాయి’ అంటూ స్పందించాడు ఓ స్థానికుడు. (క్లిక్: అమాంతం కుప్పకూలిన బ్రిడ్జి.. వందల గ్రామాలకు తెగిన సంబంధాలు) -
నిలువు దోపిడీ! కారు ధరలకు చేరువగా ఆటో రిక్షాలు
సాక్షి, హైదరాబాద్: ఆటోరిక్షా ప్రస్తుత షోరూమ్ ధర రూ.2.20 లక్షలు. కానీ అది ఆటోడ్రైవర్ చేతికొచ్చేసరికి రూ.4.25 లక్షలకు చేరుతుంది. అంటే సాధారణ ధరపైన రూ.2 లక్షలు అదనంగా చెల్లించవలసి వస్తుంది. వేల కొద్దీ ఆటో పర్మిట్లను తమ గుప్పెట్లో పెట్టుకొన్న ఫైనాన్షియర్లు నిరుపేద ఆటోడ్రైవర్లపై సాగిస్తున్న నిలువుదోపిడీ ఇది. గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త ఆటో పరి్మట్లపైన ఆర్టీఏ ఆంక్షలు విధించింది. దీంతో పాత ఆటో రిక్షాల స్థానంలో మాత్రమే కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాలం చెల్లిన పాత ఆటోలను తుక్కుగా మార్చి ఆ పర్మిట్పైన కొత్త ఆటో కొనుగోలు చేయవచ్చు. సుమారు 80 వేలకు పైగా పరి్మట్లు ఫైనాన్షియర్ల చేతుల్లోనే ఉన్నాయి. ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తీసుకొని ఆటోలు కొనుగోలు చేసిన డ్రైవర్లు చివరకు ఆ అప్పులు చెల్లించలేకపోతున్నారు. దీంతో వారి నుంచి సదరు ఫైనాన్స్ సంస్థలు ఆటోలను జఫ్తు చేసుకొని ఆ పరి్మట్లను మరో డ్రైవర్‌కు కట్టబెడుతున్నాయి. ఇలా సుమారు 500 మంది చిన్న, పెద్ద ఫైనాన్షియర్లు, ఫైనాన్స్ సంస్థలు నగరంలోని లక్ష మందికిపైగా ఆటోడ్రైవర్లను తమకు శాశ్వత రుణగ్రస్తులుగా మార్చుకొని రూ.వందల కోట్ల మేర వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా నిలిచిపోయిన కార్యకలాపాలు తాజాగా తిరిగి మొదలయ్యాయి. భారీగా పెరిగిన పర్మిట్ ధరలు... కోవిడ్ ఆంక్షలన్నీ తొలగిపోయి ఇంచుమించు సాధారణ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో నగరానికి తిరిగి వలసలు మొదలయ్యాయి. అప్పట్లో కోవిడ్ కారణంగా అప్పులు చెల్లించలేక ఆటోరిక్షాలు, క్యాబ్‌లను ఫైనాన్స్ సంస్థలకు అప్పగించి సొంత ఊళ్లకు వెళ్లిన వేలాది మంది డ్రైవర్లు ఇప్పుడు తిరిగి ఉపాధి కోసం నగరానికి చేరుకుంటున్నారు. ఆటోల కోసం ఫైనాన్షియర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు పాత ఆటో పరి్మట్ల ధరలను అమాంతంగా పెంచేసి డ్రైవర్లకు కట్టబెడుతున్నారు. కోవిడ్‌కు ముందు కేవలం రూ.75 వేలు ఉన్న పాత ఆటో పరి్మట్‌ను ఇప్పుడు ఏకంగా రూ.1.75 లక్షలకు పెంచారు. నిజానికి పర్మిట్లకు ఎలాంటి ధర ఉండదు. నగరంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు అవకాశం లేకపోవడం వల్ల పాతవాటి స్థానంలో కొత్తవి తీసుకొనేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇలాంటి పాత పర్మిట్లపైన కొత్త ఆటో కోసం మరో 2.20 లక్షలు చెల్లించవలసి వస్తుంది. అంటే ఒక ఆటో ధర ఏకంగా రూ.4 లక్షలకు చేరుతుంది. దీనికి మరి కొంత సర్వీసు చార్జీలను కలిపి ఫైనాన్స్ సంస్థలు రూ.4.25 లక్షలకు విక్రయిస్తున్నారు. ‘అప్పు చేసి ఆటోలు కొనుగోలు చేస్తున్న డ్రైవర్లు మరోసారి రుణగ్రస్తులుగా మారాల్సి వస్తుందని.’ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దోపిడీని ఆపేదెవరు... కొత్త పర్మిట్లపైన ఆంక్షలు విధించిన రవాణా శాఖ పాత పర్మిట్ ధరలను మాత్రం నియంత్రించడం లేదు. పర్మిట్ అంటే ఒక డ్రైవర్ ఆటో నడిపేందుకు ఇచ్చే అనుమతి పత్రం (ప్రొసీడింగ్స్). కానీ ఈ పత్రాలే ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఫైనాన్స్ సంస్థల ఈ నిలువు దోపిడీ పోలీసులకు, ఆర్టీఏ అధికారులకు, అన్ని ప్రభుత్వ విభాగాలకు తెలిసిందే. కానీ అది తమ పరిధిలోని అంశం కాదంటూ అందరూ చేతులెత్తేయడం గమనార్హం. అంతిమంగా నిరుపేద ఆటోడ్రైవర్ సమిధగా మారుతున్నాడు. (చదవండి: ఉచిత బియ్యం ఉఫ్! సాక్షాత్తు లబ్ధి దారులే అమ్ముకుంటున్నారు) -
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మద్నూర్ మండల సమీపంలోని మేనూర్ హైవేపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ బలంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునజ్జు అయింది. లారీ కింద ఇరుక్కుపోయిన ఆటోను బయటకు తీసేందుకు అధికారులు, స్థానికులు యత్నిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
ముదిగొండ: బంధువుల ఇంట్లో కర్మకాండలకు ఆటోలో వెళ్లి వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లి సమీపాన గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామానికి చెందిన తమలపాకుల భారతమ్మ(60), ఆమె కుమారుడు ఉపేందర్, మనవడు హర్షవర్ధన్ (6) ఆటోలో ఖమ్మం అర్బన్ మండలం ఏదులాపురంలోని బంధువుల ఇంట్లో జరిగిన కర్మకాండలకు హాజరై తిరుగు పయనమయ్యారు. వీరి ఆటో గోకినేపల్లి సమీపానికి చేరుకోగానే కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న భారతమ్మ, ఆమె మనవడు హర్షవర్ధన్ అక్కడికక్కడే మృతిచెందగా.. ఉపేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో భారతమ్మ తల తెగిపడింది. కాగా, మధ్యలో వీరు ప్రయాణిస్తున్న ఆటోఎక్కిన కారేపల్లి మండలం కొత్త కమలాపురం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి చాగంటి రమేశ్ (36) కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం సింగవరం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బొడ్డు ఉప్పలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం– కోదాడ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. మృతుల కుటుంబీకులు ప్రమాద స్థలానికి చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ, ఎస్సైలు ఆందోళన చేస్తున్న వారికి నచ్చచెప్పి మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆటోవాలాకు ఫిదా అయినా ఆనంద్ మహీంద్రా..! ఎందుకంటే..?
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను నెటిజన్లతో పంచుకుంటారు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. ఇటీవల, చెన్నైకు చెందిన ఆటో-రిక్షా డ్రైవర్ నైపుణ్యానికి ఫిదా అయ్యారు ఆనంద్ మహీంద్రా. ఆటో డ్రైవర్ కాదు..మేనేజ్మెంట్ ప్రొఫెసర్..! అన్నా దురై బిజినెస్ స్కిల్స్‌కు మంత్ర ముగ్దుడైన ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా హ్యాండిల్లో ది బెటర్ ఇండియా కవర్ చేసిన స్టోరీని పంచుకోవడమే కాకుండా అతన్ని మేనేజ్మెంట్ ప్రొఫెసర్ అని పిలిచాడు. మహీంద్రా తన పోస్ట్‌లో, "ఎంబీఐ విద్యార్థులు అతనితో ఒక రోజు గడిపినట్లయితే, అది కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్లో కంప్రెస్డ్ కోర్సు అవుతుంది. ఈ వ్యక్తి ఆటో డ్రైవర్ మాత్రమే కాదు. అతను మేనేజ్మెంట్ ప్రొఫెసర్" అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. అది ఆటో కాదు..అంతకుమించి..! చెన్నైలో పలువురికి ఆటో అన్నాగా పరిచయమైన అన్నాదురై గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. కొన్ని టీవీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. అన్నాదురై తన ప్రయాణికుల కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఐటీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని తన ఆటోలో వైఫై, ల్యాప్ టాప్, ట్యాబ్, అమెజాన్ ఎకో, వార, వార్త పత్రికలు, బిజినెస్ మేగజైన్లతోపాటు తాగేందుకు వాటర్ బాటిల్స్ కూడా సిద్ధంగా ఉంచుకుంటాడు. ఇతని ఆటోలో ఒకసారి ప్రయాణిస్తే చాలు.. మళ్లీ ఇతని కోసమే ఎదురు చూస్తారు. ఐటీ ప్రొఫెషనల్స్ తోపాటు ఎక్కువ మంది అన్నాదురై ఆటోనే ప్రయాణిస్తున్నారు. మోటివేషనల్ స్పీకర్ కూడా..! 12వ తరగతి డ్రాపౌట్ అయిన దురై 2012 నుంచి చెన్నైలో తన విలక్షణమైన ఆటోతో చెన్నైలో భారీ ఆదరణను పొందాడు అన్నాదురై. ఇప్పటికే వెబ్ సంచలనం, మోటివేషనల్ స్పీకర్‌గా మారారు. అతను ఫేస్బుక్లో 10,000 మందికి పైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నాడు. పలు కంపెనీల్లో 40కి పైగా ప్రసంగాలు, ఏడు టెడ్ఎక్స్ టాక్స్ షో ప్రసంగించాడు. కరోనా మహమ్మారి కారణంగా శానిటైజేషన్ సిబ్బంది, నర్సులు, వైద్యులకు ఉచిత రైడ్లను అందజేస్తున్నాడు. If MBA students spent a day with him it would be a compressed course in Customer Experience Management. This man’s not only an auto driver… he’s a Professor of Management. @sumanmishra_1 let’s learn from him… https://t.co/Dgu7LMSa9K — anand mahindra (@anandmahindra) January 22, 2022 చదవండి: రండి.. దయచేయండి.. పారిశ్రామిక వేత్తలకు ‘సోషల్’ ఆహ్వానం -
ఆటో రిక్షా నడిపిన సల్మాన్ ఖాన్.. నెటిజన్ల ట్రోలింగ్..
Salman Khan Drives Autorickshaw At Panwel Video Goes Viral: బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27 సోమవారం 56వ పడిలోకి అడుగుపెట్టాడు. తన పుట్టిన రోజు వేడుకలను తన నివాసంలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసి వార్తల్లో నిలిచాడు భాయిజాన్. హీరోయిన్ జెనీలియాతో డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట గింగిరాలు తిరిగింది. తన ఖాళీ సయమాన్ని ఎంజాయ్ చేస్తున్న సల్లూ భాయి మరొక వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. బుధవారం (డిసెంబర్ 29) ముంబైలోని పన్వెల్‌లో రద్దీగా ఉన్న రోడ్లపై ఆటో రిక్షా నడుపుతూ కనిపించాడు ఈ సల్లూ భాయ్. సిక్స్ ప్యాక్ బాడీని కొనసాగిస్తూ.. సినిమాల్లో పాత్రలకు తగినట్లుగా కష్టపడతాడుతూ.. యాక్షన్ సీన్లు, డ్యాన్లతో అలరించే ఈ భాయిజాన్ ఆటో నడపడం చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆటో రిక్షాను నడిపిన సల్మాన్‌ను చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు మాత్రం సల్మాన్‌ను ట్రోలింగ్‌తో ఏకిపారేశారు. ఇది 'ఒమిక్రాన్ కన్నా డేంజర్' అని ఒక యూజర్ కామెంట్ చేస్తే.. 'తర్వగా అందరూ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోండి' అని సెటైర్ వేశాడు. మరొకరైతే 'ఆటోలో పాము లేదా' అని కామెంట్ పెట్టారు. ఇదిలా ఉంటే సల్మాన్ బర్త్‌డేకు ఒక ముందు రోజు పాము కాటుకు గురైన సంగతి తెలిసిందే. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన సల్మాన్ 6 గంటల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. తర్వాత అది ప్రమాదకరమైన విష సర్పం కాదని సల్లూ భాయ్ తెలిపాడు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
ఆనంద్ మహీంద్రా గారూ.. మీ ఆటో సూపరే! కానీ..
వ్యాపారాల్లో పోటీతత్వం ఉంటుందని(ఉండాల్సిందే!), వ్యాపారుల మధ్య వైరం మాత్రమే ఉంటుందని అనుకోవడం సహజం. కానీ, ఈరోజుల్లో మార్కెట్‌ను పెంచుకోవాలన్నా, ప్రొడక్టులను ప్రమోట్ చేసుకోవాలన్నా ‘ఫ్రెండ్లీ నేచర్’ కచ్చితంగా ఉండాలని నిరూపిస్తున్నారు మన వ్యాపార దిగ్గజాలు. ఇందుకు సోషల్ మీడియానే వేదికగా మార్చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సాప్ట్వేర్ ఐటీ కంపెనీ ‘జోహో కార్పొరేషన్’ సీఈవో శ్రీధర్ వెంబు, వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్లు చేశారు. శ్రీధర్ వెంబు(53).. జోహో కార్పొరేషన్ సీఈవో. తంజావూరు(తమిళనాడు)లో పుట్టిన శ్రీధర్.. జోహోతో పేరు ప్రఖ్యాతులు, పద్మశ్రీ అవార్డు సైతం సంపాదించుకున్నారు. అయితే 2019లో టెంకాశీ పరిధిలోని మాతాలంపరై అనే కుగ్రామంలో సెటిల్ అయ్యారు. అప్పటి నుంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ పోస్ట్‌లన్నింటిని ఆయన ట్విటర్లో షేర్ చేస్తున్నారు. ఈ మధ్య ఆయన మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేయడమే కాదు.. దానిని ఆయనే స్వయంగా ఆ పల్లెటూరిలో నడిపాడట. ఇంకేం ఆ అనుభవాన్ని ఇంటర్నెట్లో పంచుకోవడమే కాదు.. కంపెనీ యాజమాని ఆనంద్ మహీంద్రాకు కొన్ని ఫ్రెండ్లీ సలహాలు కూడా ఇచ్చారు శ్రీధర్. 1/ Yesterday I got my new@MahindraElctrc Treo electric auto. This one is a serious upgrade - capable of 55 km/hour speed and a range of 125 km on a full charge. That makes it a practical commute vehicle and I love driving it around! I have some suggestions @anandmahindra pic.twitter.com/XyWBLJyv8l — Sridhar Vembu (@svembu) December 6, 2021 ‘‘ఫుల్‌ఛార్జీతో 125కి.మీ. రేంజ్, గంటకు 55 కి.మీ.వేగంతో దూసుకుపోయే ఆటో ఇది. దీనిని నడపడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. పల్లెటూరి రోడ్లకు సైతం తగ్గట్లుగా సౌకర్య వంతంగా ఉంది. పైగా సరసమైన ధరలో.. కుటుంబంతో సహా బయటకు వెళ్లడానికి ఎంతో అనుగుణంగా ఉంది ఇది. ఊళ్లో తిరుగుతున్న టైంలో చాలామంది ఇది ఎక్కడ దొరుకుతుందని అడిగారు. అందుకే ఆనంద్ మహీంద్రగారికి కొన్ని సలహాలు ఇవ్వదల్చుకున్నా... 3/ @anandmahindra Please offer a variety of designs and colors on the electric auto line. Offer family and kid friendly options. Come up with a cool marketing campaign to popularize these low-cost electric vehicles. I see great potential for them. I love driving one! 🙏 — Sridhar Vembu (@svembu) December 6, 2021 ఆనంద్ మహీంద్రా గారూ.. Mahindra treoలోనే వెరైటీ డిజైన్లను, కలర్స్‌ను తీసుకు రండి. పిల్లలు, కుటుంబాలకు తగ్గట్లు చిన్న మార్పులు చేయండి. మంచి మార్కెటింగ్‌తో ఈ లోకాస్ట్ ఈవీను ప్రచారం చేస్తే.. కచ్చితంగా వర్కవుట్ అవుతుంది. ఇదే మీకిచ్చే సలహా’ అంటూ ఈ ఉదయం(సోమవారం) ట్వీట్ల ద్వారా సలహాలు ఇచ్చారు శ్రీధర్. అంతేకాదు ఈ ఆటోపై అభ్యంతరాలు వ్యక్తం చేసినవాళ్లకు సమాధానం ఇవ్వడంతో పాటు పలువురి అనుమానాల్ని సైతం ఓపికగా నివృత్తి చేశారాయన. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా, శ్రీధర్ వెంబు ట్వీట్లపై స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ ఈవీ ఆటోరిక్షా పూర్తి స్వదేశీ ఉత్పత్తి. ధర 3.5 లక్షల లోపే ఉంది. ఫీచర్లపై ప్రతికూల రివ్యూలు ఉన్నా.. గతుకు రోడ్లు, ఎత్తుపల్లాలపై దూసుకుపోయే కెపాసిటీ ఉందన్న రివ్యూలు దక్కించుకుంది. కిందటి ఏడాది భారత్‌లో ఐదు వేల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది ఏకైక ఈ-ఆటో కూడా ఇదే!. చదవండి: ఇది మరో ప్యాండెమిక్.. వ్యాక్సిన్ కూడా లేదు-ఆనంద్ మహీంద్రా -
రెండు టైర్ల మీదే ఆటో పరుగు.. చరిత్రాత్మకం అన్న గిన్నీస్
చెన్నై: గిన్నీస్ రికార్డు కోసం ఈ మధ్య జనాలు వింత వింత విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. కొందరు వెరైటీ ప్రోగ్రామలు నిర్వహించి రికార్డు క్రియేట్ చేస్తుండగా.. మరికొందరు ప్రాణాలను సైత పణంగా పెట్టి సాహసోపేతమైన ఫీట్లు చేస్తూ.. ఇటు చూసేవారిని.. అటూ గిన్నీస్ రికార్డు అధికారులను ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన రికార్డు ఒకటి నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇక సదరు వ్యక్తి చేసిన సాహసం చూసే వారు.. భయం, ఎగ్జైట్మెంట్, షాక్ వంటి ఫీలింగ్స్‌ని ఒకే సారి చవి చూస్తున్నారు. ఇంతకు ఏమా విన్యాసం.. ఎలా గిన్నీస్ రికార్డు క్రియేట్ చేసిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే. ఇప్పుడు మనం చూడబోయే వీడియో 2015 నాటిది. దీన్ని కొన్ని గంటల ముందే గిన్నీస్ బుక్ వారు పోస్ట్ చేశారు. ఇందులో తమిళనాడు చెన్నైకి చెందిన ఆటో డ్రైవర్ జగదీష్ మణి ఆటోను రెండు చక్రాలపై నడిపాడు. అలా మొత్తం 2.2 కిలోమీటర్ల దూరం నడిపి... గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించాడు. (చదవండి: Travel: గిన్నిస్ రికార్డు.. జటాయు పార్కు) "చరిత్రాత్మక ఆటో-రిక్షా సైడ్ చక్రాలది. చెన్నైకి చెందిన ఆటో-రిక్షా డ్రైవర్ జగదీష్ ఇలా ఆటోను సైడ్‌కి నడిపి రికార్డ్ సృష్టించాడు" అని క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ సందర్భంగా జగదీష్ మణి మాట్లాడుతూ.. "ఇలాంటి రికార్డ్ సాధిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ గిన్నీస్ వరల్డ్ రికార్డు వారు నా టాలెంట్‌ని గుర్తించినందుకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారికి కృతజ్ఞతలు’’ అన్నారు. (చదవండి: Guinness World Record: బతికే ఛాన్స్ జీరో.. బర్త్ డే వేడుకలు..) ఇప్పటికే ఈ వీడియోని 3 లక్షల మందికి పైగా చూశారు. జగదీష్ మణి టాలెంట్‌ని ప్రశంసిస్తున్నారు నెటిజనులు. "భారతీయులు మాత్రమే ఇలా చెయ్యగలరు" అని ఒకరు కామెంట్ ఇవ్వగా... "నేను అందులో ప్రయాణించాలనుకుంటున్నాను".. "ఇది అద్భుతం అంతే" అని మరొకరు కామెంట్ చేశారు. చదవండి: బాబోయ్.. అసలు ఇంతకాలం నువ్వు ఎలా బతికావ్! View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
హ్యాట్సాఫ్: మన రోడ్లకు తగ్గట్లు సెల్ఫ్ డ్రైవింగ్ బండి!
సెల్ఫ్ డ్రైవింగ్ బండ్లు.. ఈ పేరు వినగానే చాలామందికి టక్కున గుర్తొచ్చే పేరు ఎలన్ మస్క్. అమెరికన్ కంపెనీ టెస్లా ద్వారా ఎలక్ట్రికల్ బండ్లను అందిస్తూ.. సెల్ఫ్ డ్రైవింగ్ సాంకేతికతపై చర్చతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడాయన. అమెరికాలో వరకైతే ఇలా సెల్ఫ్ డ్రైవింగ్ ఓకే. కానీ, ట్రాఫిక్ రద్దీ, ఇతరత్రా సమస్యలుండే మన దేశంలో అది కుదిరే పనేనా?. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది మైనస్ జీరో. ఛండీగఢ్: ఒకదాని వెనుక ఒక వాహనం, గుంతలతో వికారంగా మారిన రోడ్లు, అడ్డదిడ్డంగా దూసుకొచ్చే వాహనాలు.. మన రోడ్ల స్థితికి సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ కష్టతరం అనేది నిపుణుల మాట. కానీ, సాంకేతికతో పని లేకుండా.. కామన్సెన్స్ను ఉపయోగించి వెహికిల్స్‌ను రూపొందించే పనిలో పడింది మైనస్ జీరో స్టార్టప్. జలంధర్(పంజాబ్)కు చెందిన ఈ స్టార్టప్ గత రెండేళ్లుగా మన రోడ్లకు సరిపోయే రీతిలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికిల్ టెక్నాలజీని రూపొందించే పనిలో మునిగింది. అంతేకాదు ప్రయోగాత్మకంగా ఓ ఆటోను డెవలప్ చేసి రోడ్ల మీదకు వదిలింది కూడా. ఎలా పని చేస్తుందంటే.. మైనస్ జీరో తయారు చేసిన బండి ఏఐ టెక్నాలజీపై తక్కువ ఆధారపడుతూ పూర్తి ఆటానమస్ సిస్టమ్‌తో నడుస్తుంది. తద్వారా భద్రతా పరమైన సమస్యలు ఉండవని, ట్రాఫిక్‌కు తగ్గట్లు ప్రయాణం సాఫీగా సాగుతుందని, రోడ్లకు తగ్గట్లు ప్రయాణాన్ని మలుచుకోవచ్చని మైనస్ జీరో సీఈవో, సహ వ్యవస్థాపకుడు గగన్‌దీప్ రీహల్ వెల్లడించాడు. కంట్రోల్ యూనిట్స్‌తో పనిచేసే ఈ ‘ఈ-వెహికిల్ ఆటోరిక్షా’ను గగన్‌దీప్ టీం నెలలు శ్రమించి రూపొందించింది. ‘బిలియన్ల ఖర్చుతో, అత్యాధునిక సాంకేతికతతో వాళ్లు వాహనాలు రూపొందిస్తున్నారు. కానీ, ప్రాక్టీకల్‌గా మన రోడ్లకు ఆ టెక్నాలజీ సరిపోతుందా? అనే ప్రశ్న అందరిలో ఉంది. అయితే హంగుల కన్నా భద్రత, తక్కువ ఖర్చులో పని జరగడం మనకు ముఖ్యం. అందుకే లో-టెక్నాలజీతో ఇలా సెల్ఫ్ డ్రైవింగ్ వెహికిల్స్‌ను రూపొందించింది మా బృందం’ అని గగన్‌దీప్ వెల్లడించాడు. నిజానికి చాలా కాలం క్రితమే వీళ్ల ఆవిష్కరణ వెలుగులోకి వచ్చినప్పటికీ.. లాక్డౌన్ కారణంగా పూర్తిస్థాయి డెవలప్మెంట్ ఆలస్యమవుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఆటోను పవర్ఫుల్ మోటర్ అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు రెంటెడ్ బేస్ మీద కొంత మంది ఆటోవాలాలాకు అప్పగించి.. పరిశీలిస్తోంది. తన సోదరుడు గురుసిమ్రన్ సలహా మేరకు పూర్తిస్థాయి పరీక్షల తర్వాతే వీటిని మార్కెట్లోకి తీసుకొస్తామని గగన్‌దీప్ స్పష్టం చేశాడు కూడా. మైనస్ జీరో ఫౌండర్లు గురుసిమ్రన్, గగన్‌దీప్ -
ఫ్రిజ్, టీవీ, ఐపాడ్, మాస్క్: ఆటోనా.. హైటెక్ హోటలా?
చెన్నై: మనలో అందరికి చాలా ఆశలు, కోరికలుంటాయి. కానీ కొందరు మాత్రమే తన వాటిని తమ కలలను సాకారం చేసుకుంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. సరే వాటిని అధిగమించి.. తాము అనుకున్నది సాధిస్తారు. సాధించాలనే సంకల్పం, గట్టి పట్టుడదల ఉంటే చాలు.. మిగతా సమస్యలన్ని దూది పింజల్లా తేలిపోతాయి. ఈ మాటలకు ఆకారం వస్తే.. అతడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆటోవాలా అన్నా దురైలా ఉంటాడు. పారిశ్రామికవేత్త కావాలనేది అన్నాదురై చిన్ననాటి కోరిక. కానీ దానికి తగ్గ డబ్బు, చదువు అతడి వద్ద లేదు. అయితే ఇవేవి అతడిని అడ్డుకోలేకపోయాయి. తన దగ్గరున్న ఆటోనే ఓ పరిశ్రమలా భావించాడు. దానిలో ఎక్కే కస్టమర్లను ఆకర్షించడం కోసం అతడు ఎంచుకున్న మార్గం.. ఇప్పుడతన్ని ప్రత్యేకంగా, వార్తల్లో నిలిచే వ్యక్తిగా మార్చింది. అన్నాదురైకి సంబంధించిన కథనాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. తమిళనాడు, చెన్నైకి చెందిన అన్నాదురై ఆర్థిక ఇబ్బందులు వల్ల పెద్దగా చదువుకోలేదు. కానీ పారిశ్రామికవేత్త కావాలనేది అతడి కోరిక. అయితే కుటుంబ పరిస్థితులు దృష్ట్యా ఆటో నడపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కానీ పారిశ్రామికవేత్త కావాలనే అతడి కోరిక మాత్రం తనని నిద్రపోనివ్వలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అతడికి తట్టిన ఓ వినూత్న ఐడియా అన్నాదురై జీవితాన్ని మార్చేసింది. తాను నడుపుతున్న ఆటోనే ఓ పరిశ్రమలా భావించాడు అన్నాదురై. ఇక తన ఆటోలోకి ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించాలంటే ఏం చేయాలా అని బాగా ఆలోచించాడు. ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తుంది. కనుక జనాలు ఆటోల్లో తిరగాలంటే భద్రత ముఖ్యం.. ఆ తర్వాత ప్రయాణికులు తమ గమ్యస్థానం చేరేవరకు వారికి ఎంటర్టైన్మెంట్ కల్పించడం ముఖ్యం అనుకున్నాడు. ఈ మేరకు ఓ ప్రణాళిక రచించాడు అన్నాదురై. దాని ప్రకారం తన ఆటోలో మాస్క్, శానిటైజర్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఓ ఐపాడ్, టీవీ, చిన్న ఫ్రిజ్ ఏర్పాటు చేశాడు. ఆటో ఎక్కిన వారికి అందులో ఉన్న సౌకర్యాలు చూస్తే నిజంగానే మతి పోతుంది. తాము ఆటో ఎక్కామా లేక.. ఏదైనా స్టార్ హోటల్లో ఉన్నామా అనే అనుమానం కలగక మానదు. ఈ వినూత్న ఆలోచనే అతడి జీవితాన్ని మార్చేసింది. ఇక అన్నాదురై 9 భాషల్లో తన కస్టమర్లను పలకరిస్తాడు. వారితో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. ఇన్ని హైటెక్ హంగులతోపాటు.. కస్టమర్లను దైవంగా భావిస్తున్న అన్నాదురై ఆటో అంటే ఆ ప్రాంతంలో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఒక్కసారి అతడి ఆటో ఎక్కిన వారు.. మళ్లీ మళ్లీ దానిలోనే ప్రయాణం చేయాలని కోరుకుంటారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబేలో జూల్ 15న పోస్ట్ చేసిన అన్నాదురై స్టోరీ ఎందరినో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే 1.3 మిలియన్ల కన్నా ఎక్కువ మంది దీన్ని వీక్షించారు. అన్నాదురై వినూత్న ఆలోచనపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఎఫైర్; భర్తను జైలుకి పంపాలని స్కెచ్.. ట్విస్ట్ ఏంటంటే!
చండీఘఢ్: భర్తను కటకటాల్లోకి నెట్టాలని భావించి ఓ భార్య చేసిన కుట్ర బెడిసికొట్టింది. తనన మోసం చేస్తున్నాడని భావించి అతడిని ఇరికించేందుకు చేసిన ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో ఆమెకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ షాకింగ్ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివారల్లోకి వెళితే.. ఫరీదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి అతను రోజూ ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు. ఇక ఒక్కోరోజు అసలు ఇంటికే వెళ్లేవాడే కాదు. దీంతో తన భర్త ఎందుకు ఇంటికి రావడం లేదని ఆలోచించిన భార్య అతనిపై క్రమంగా అనుమానం పెంచుకుంది. ఈ నేపథ్యంలో భర్త మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని అపోహ పడింది. మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని అనుమానించి రగిలిపోయింది. ఈ విషయం పలుమార్లు భర్తతో చర్చించగా వీరి మధ్య తరుచూ గొడవలు అయ్యేవి. దీంతో విసిగి పోయిన మహిళ.. ఎలాగైనా అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఢిల్లీ వెళ్లి మరీ ఓ వ్యక్తి వద్ద గంజాయి మొక్కను కొనుక్కొచ్చింది. సుమారు 700 గ్రాముల గంజాయి మొక్కను తన భర్త ఆటోలో పెట్టింది. తరువాత తనకేం సంబంధం లేనట్లు గుర్తు తెలియని మహిళ మాదిరిగా పోలీసులకు ఫోన్ చేసి గంజాయి విషయం చెప్పి భర్తను బుక్ చేయాలని చూసింది. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపడంతో అసలు కిలాడీ భార్యేనని తెలిసి ఆమెకు షాకిచ్చారు. ఆమెను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. చదవండి: వరకట్నం కేసుల నుంచి తప్పించుకుంటున్నారు: హైకోర్టు ఆవేదన యువతితో దిగిన ఫొటోతో స్టేటస్.. భార్య చూడటంతో! -
వైరల్: రైల్వే ప్లాట్‌ఫాం మీదుగా ఆటో..!
ముంబై : మానవత్వం పరిమళించింది. పురిటి నొప్పులతో తల్లడిల్లుతున్న ఓ గర్భిణినీకి సాయమందించేందుకు ఓ ఆటోవాలా సాసహోపేత నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా రైల్వే ఫ్లాట్‌ఫాం మీదుగా ఆటోరిక్షాను తీసుకెళ్లి ఆమెను ఆస్పత్రికి చేర్చాడు. ఈ హృద్యమైన ఘటన ముంబైలోని విరార్ రైల్వే స్టేషన్లో గత ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఏడు నెలల గర్భిణీ, ఆమె భర్త ఓ రైలులోని దివ్యాంగుల కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్నారు. అయితే, భారీ వర్షాల కారణంగా ముంబై జలమయమైన సంగతి తెలిసిందే. దాంతో రైలు సర్వీసులు ఎక్కడికక్కడ రద్దయ్యాయి. దాంతో ఆ దంపతులు ప్రయాణిస్తున్న ట్రెయిన్‌ను విరార్ రైల్వే స్టేషన్లో నిలిపేశారు. అదే సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. గర్భిణీని రోడ్డుపైకి తీసుకొచ్చేందుకు ఆమె భర్త పలువురి సాయం కోరాడు. లాభం లేకపోయింది. స్టేషన్ ఆవరణలో ఉన్న ఆటోవాలా కమలాకర్ గవాడ్‌కు విషయం చెప్పి సాయం అర్థించాడు. దీంతో కమలాకర్ నేరుగా ఫ్లాట్‌ఫాం మీదుగా ఆటోను పోనిచ్చాడు. గర్భిణీని తీసుకెళ్లి సంజీవని ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, నిబంధనల్ని ఉల్లంఘించిన ఆటోవాలాపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో సోమవారం హాజరుపరిచారు. అతన్ని కోర్టు మందలించింది. బెయిల్ మంజూరు చేసింది. కమలాకర్ ఉద్దేశం మంచిదే అయినప్పటీకీ, నిబంధనల అతిక్రమణ నేరమని రైల్వే పోలీస్ అధికారి ప్రవీణ్‌కుమార్ అన్నారు. ప్లాట్‌ఫాం మీదుగా ఆటో వెళ్తున్న క్రమంలో ప్రయాణికులు ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉందని అన్నారు. సెక్షన్ 154 (రాష్ డ్రైవింగ్), రైల్వే నిబంధనల అతిక్రమణ కింద ఆటోడ్రైవర్‌పై కేసులు నమోదయ్యాయి. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాయం చేస్తే శిక్షిస్తారా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
లవర్ తిట్టిందని ఆటోలోనే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రియురాలితో ఫోన్లో గొడవపడి ప్రయాణిస్తున్న ఆటోలోనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు ఓ 24 ఏళ్ల యువకుడు. అతనితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు కూడా ఈ ప్రమాదానికి గురయ్యారు. ప్రసుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉండగా, మిగతా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆదివారం రాత్రి ఉత్తర ఢిల్లీలోని ఘాజియాబాద్‌కు చెందిన శివమ్(24), దగ్గరి బంధువైన అర్జున్‌తో కలిసి ఆటోలో తమ సోదరుడి ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో భగవాన్ సింగ్(60) అనే మరో వ్యక్తి ఆటో ఎక్కాడు. ఆటోలో ప్రయాణిస్తున్న శివమ్, కోల్‌కతాలో ఉన్న తన ప్రియురాలికి ఫోన్ చేశాడు. ఆమెతో మాట్లాడుతూ.. ఇద్దరు గొడవ పడ్డారు. మనస్థాపం చెందిన శివమ్ వెంటనే తన బ్యాగులో ఉన్న పెట్రోల్ బాటిల్‌ను తీసి ఒంటిపై పోసుకొని లైటర్‌తో నిప్పంటించుకున్నాడు. దీంతో ఆటోలో ఉన్న మరో ఇద్దరికి కూడా ఆ మంటలు తాకాయి. అప్రమత్తమైన ఆటో డ్రైవర్ ఆటో నిలిపి బయటకు దూకాడు. మంటలు ఆర్పి స్థానికుల సహాయంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కాగ శివమ్ శరీరం 70 శాతం మేర కాలిపోయిందని, అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. మిగతా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. శివమ్‌పై ఆత్మహత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
ఆటో ఎక్కిన తలైవా.. రహస్యంగా ప్రయాణం!
సాక్షి, చెన్నై: నేను ఆటో వాణ్ణి.. ఆటో వాణ్ణి.. అంటూ రెండున్నర దశాబ్దాల క్రితం బాషా చిత్రంలో ఆటోవాలాగా అలరించిన దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ మళ్లీ ఆటో ఎక్కాడు. అయితే ఈ సారి ఆయన ఆటో ఎక్కింది సినీ ప్రియులను అలరించటానికి కాదు. తన మనవడి కోరిక తీర్చేందుకు. మనవడు వేద్ కోరిక మేరకు ఆయన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని తన నివాసం నుంచి ఆళ్వార్ పేటలోని చిన్న కుమార్తె సౌందర్య ఇంటికి ఆదివారం అత్యంత రహస్యంగా ఆటోలో పయనించారు. -
ఆటో డ్రైవర్ అకౌంట్లో రూ.300 కోట్లు!
కరాచీ : ఆయన ఓ ఆటో డ్రైవర్ కానీ ఆయన బ్యాంకు అకౌంట్లో రూ.300 కోట్ల రూపాయలు ఉన్నాయి. అదేంటీ అన్ని కోట్ల రూపాయలు ఉండి ఆటో తోలాల్సిన అవసమేముంది అనుకుంటున్నారా..? అంత డబ్బు తన దగ్గర ఉందని ఆయనకే తెలియదు పాపం. దర్యాప్తు సంస్థ అధికారులు నుంచి ఫోన్‌కాల్ రావడంతో అసలు విషయం తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు. పాకిస్తాన్‌లోని కరాచీ పట్టణానికి చెందిన ముహమ్మద్ రషీద్ ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల రషీద్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పాకిస్తాన్ దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు. రషీద్‌ను తమ కార్యాలయానికి పిలిపించిన ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్ఐఏ) ఈ విషయంపై ఆరా తీసింది. అయితే, తన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియదని ఆ డ్రైవర్ అంటున్నాడు. విచారణ అనంతరం రషీద్ మీడియాతో మాట్లాడుతూ..‘నన్ను ఎఫ్ఐఏ కార్యాలయానికి రమ్మంటే వెళ్లాను. నేను చాలా భయపడిపోయాను. అధికారులు నా అకౌంట్ వివరాలు చూపెడుతూ దాని ద్వారా రూ.300 కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు.అది విని ఆశ్చర్యానికి గురయ్యాను. నేను 2005లో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేశాను. ఆ సమయంలో బ్యాంకు ఖాతా తెరిచాను. నా జీతం డబ్బులు అందులో వేసేవారు. కొద్ది నెలల తర్వాత నేను ఆ ఉద్యోగం మానేసి ఆటో తోలుకుంటున్నాను. నా జీవితంలో ఇంత వరకు లక్ష రూపాయలు కూడా చూడలేదు. అలాంటిది మూడువందల కోట్ల రూపాయలు నా అకౌంట్లో ఉందనడం నా ఊహకు కూడా అందని విషయం. ఇప్పటికీ నేను అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. నా ఖాతాను ఎవరో ఉపయోగించుకుని లావాదేవీలు జరిపారు. ఈ విషయాలన్నింటినీ అధికారులకు చెప్పాను’ అని రషీద్ తెలిపారు. కాగా, కొన్ని రోజుల క్రితమే పాకిస్తాన్లో ఇటువంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. కరాచీలో ఉన్న ఓటిఫిన్ సెంటర్ యనమానీ అకౌంట్లో ఆయనకు తెలియకుండానే రూ.200 కోట్లు వచ్చి పడ్డాయి. ఈ లావాదేవీలు ఎవరు జరిపారనే అంశంపై ఎఫ్ఐఏ అధికారులు విచారణ చేపట్టారు. -
రెచ్చిపోయిన ఆటోడ్రైవర్లు..
-
రెచ్చిపోయిన ఆటోడ్రైవర్లు.. పోలీసుల ఛేజింగ్
ఆటోడ్రైవర్ల చేష్టలతో వాహనదారులు వణికిపోయారు. హైవేపై రేసులతో రెచ్చిపోయారు. దీంతో వాహనదారులు భయాందోళనలకు గురికాగా, సమాచారం అందుకున్న పోలీసులు వారిని వెంటాడి మరీ అరెస్ట్ చేశారు. తమిళనాడులోని చెన్నై హైవేలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాక్షి, చెన్నై: నగరంలో ఆటోడ్రైవర్లు చెలరేగిపోయారు. చెన్నై హైవే ఔటర్ రింగ్ రోడ్‌పై రేసులు నిర్వహించి అడ్డంగా బుక్కయ్యారు. బైక్‌పై వెళ్తున్న కొందరు వారిని రెచ్చగొట్టంతో వారు మరింత వేగంతో దూసుకెళ్లటంతో వాహనదారులు భీతిల్లిపోయారు. అది గమనించిన పోలీసులు వారిని వెంటాడి మరీ పట్టుకున్నారు. సుమారు ఆరగంటకు పైగానే ఛేజింగ్ కొనసాగింది. మొత్తం ఆరు ఆటోలను, ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. ఇల్లీగల్ రేసులు, ట్రాఫిక్ ఉల్లంఘనతోపాటు వాహనదారులకు భయాందోళనలు గురి చేసినందుకు వారిపై కేసులు నమోదు చేశారు. కాగా, గతంలోనూ తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని అధికారి ఒకరు వెల్లడించారు. -
డివిలియర్స్ షాకింగ్ వీడియో వైరల్..
బెంగుళూరు : దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌కు మన దేశంలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రసుత ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తరుఫున బరిలోకి దిగాడు డివిలియర్స్. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం డివిలియర్స్ తన భార్య, కుమారునితో కలిసి ఆటోలో షికారుకు బయలుదేరాడు. ఆటో రిక్షాలో ఉన్న డివిలియర్‌ను గమనించిన అభిమానులు ‘ఈ సాలా కప్ నమ్డే’ అని నినాదాలు చేస్తూ డివిలియర్ ప్రయాణిస్తున్న ఆటోను వెంబడించారు. ‘ఈ సాలా కప్ నమ్డే’ అనేది ఈ ఐపీఎల్లో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ నినాదం. ఈ ఆదివారం చిన్నస్వామీ స్టేడియంలో జరగునున్న మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. -
డివిలియర్స్ తన భార్య, కుమారునితో ఆటోలో షికారు
-
వైద్యులు లేకపోవడంతో ఆటోలోనే..
సాక్షి, రాయ్‌పూర్ : వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ మహిళ ఆటోలోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఛత్తీస్గర్ రాజధాని రాయ్‌పూర్‌కు 350 కిమీ దూరంలోని కొరియలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిండు గర్భిణిని కొరియ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఆటోలో తరలించగా, అక్కడ వైద్యులెవరూ అందుబాటులో లేరు. వైద్య సిబ్బంది కోసం కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎంతకూ వైద్యులు రాకపోవడంతో ఆటోలోనే ప్రసవించేలా కుటుంబ సభ్యులు సహకరించారు. దేశంలో వైద్య వ్యవస్థ తీరుతెన్నులు ఎంత దయనీయంగా ఉన్నాయో ఈ ఘటన మరోసారి అద్దంపట్టింది. కాగా, భారత్‌లో గంటకు ఐదుగురు మహిళలు ప్రసవించే సమయంలో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. ఏటా 45,000 వరకూ ఈ తరహా మరణాలు సంభవిస్తున్నాయని నివేదిక తెలిపింది. దేశరాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లోనూ ఈ దుస్థితి నెలకొంది. పెద్దసంఖ్యలో రోగులు ఆస్పత్రికి పోటెత్తడం వల్లే వారికి తగిన వైద్య సేవలు అందించలేకపోతున్నామని ఎయిమ్స్ వర్గాలు అశక్తత వ్యక్తం చేస్తున్నాయి. -
ఓవర్ లోడ్.. అతివేగం..
సాక్షి, నిజామాబాద్, బాల్కొండ : ఓ ఆటో.. నలుగురిని మాత్రమే తీసుకెళ్లాల్సిన డ్రైవర్ 19 మందిని కుక్కేశాడు.. డ్రైవర్ సహా 20 మందితో ఆటో బయల్దేరింది.. మరో 2 నిమిషాల్లో వారంతా క్షేమంగా గమ్యస్థానం చేరుకునేవారే.. కానీ అంతలోనే మృత్యువు కాటేసింది.. ఓవర్ లోడ్‌కు మితిమీరిన వేగం తోడవడంతో రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి ఆటో పల్టీ కొట్టింది.. ఈ ఘోర దుర్ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు! మృతుల్లో ఆరుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. డ్రైవర్‌తోపాటు తొమ్మిది మందికి గాయాలయ్యాయి. చనిపోయినవారిలో ఒకే కుటుంబానికి చెందినవారు నలుగురున్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా మెం డోరా మండల కేంద్రం శివారులో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మృతులంతా నిజామాబాద్ జిల్లా వాసులే. ఈ ఘోర ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎలా జరిగింది..?: ముప్కాల్ నుంచి మెండోరాకు 20 మందితో కిక్కిరిసిన ఆటో బయల్దేరింది. డ్రైవర్ సీటుకు కూడా ఇరువైపులా నలుగురు కూర్చున్నారు. రెండు నిమిషాలైతే ఆటో మెండోరాకు చేరుకునేది. కానీ ఇంతలోనే అతివేగం కారణంగా ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. రోడ్డుకు కేవలం రెండు మీటర్ల లోపే ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా ఈ బావి ఉంది. రోడ్డుకు బావికి మధ్య చిన్న పాటి కాలువ కూడా ఉంది. ఈ కాలువ గట్టును ఢీకొనడంతో కొంత ఎత్తు ఎగిరి ఆటో నేరుగా బావిలో పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎడమ వైపు నుంచి పడిపోవడం, ఆటోలో కుడివైపు రాడ్డు ఉండటంతో ప్రయాణికులకు బయటకు రావడానికి వీల్లేకుండా పోయింది. మృతుల సంఖ్య పెరగడానికి ఇదే కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పంటల చుట్టూ కట్టే చీరలను, దగ్గర్లో ఉన్న ఓ తాడును తెచ్చి బావిలోకి వదిలారు. తాడు, బావిలోని మోటారు పైపును పట్టుకుని తొమ్మిది మంది బయటకు వచ్చారు. మిగతా 11 మంది చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆర్మూర్, నిర్మల్ ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ఓవైపు నీటిని తోడేస్తూ మరోవైపు గజ ఈతగాళ్లతో మృతదేహాల గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్రావు, జేసీ రవీందర్‌రెడ్డి, సీపీ కార్తికేయ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. స్థానిక ఎమ్మెల్యే, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. నిర్లక్ష్యంగా ఆటోను నడిపిన డ్రైవర్ శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివేగం, ఓవర్‌లోడ్ ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతుల వివరాలు.. 1. బోప్పారం సాయమ్మ (50), వేంపల్లి 2. మద్దికుంట లక్ష్మి (38), ధర్మోరా 3. గుండం గంగామణి (45) కేశాపూర్ 4. పెద్దోల్ల సంపత్ (14) మోస్రా 5. తెడ్డు రోజ (25), చిట్టాపూర్ 6. తెడ్డు ప్రశంస (7) చిట్టాపూర్ 7. తెడ్డు చిన్ని (2), చిట్టాపూర్ 8. తెడ్డు చక్కాని (5), చిట్టాపూర్ 9. మెట్టు వినయశ్రీ (6), కొడిచర్ల 10. మనస్విని (3), ఆలూరు 11. గుర్తు తెలియని మహిళ క్షతగాత్రులు వీరే.. వర్ని మండలం మోస్రాకు చెందిన పెద్దోల్ల సుమలత, పెద్దోల్ల మల్లవ్వ, ముప్కాల్ మండలం వేంపల్లికి చెందిన బొప్పారం చిన్నరాజు, బొప్పారం విజయ, «సంజయ, ప్రవీణ, సంగీత, రెండు నెలల పసికందు మనీష్, ఆటో డ్రైవర్ గోపి శ్రీనివాస్. ప్రాణాలతో బయటపడ్డ రెండు నెలల చిన్నారి మెండోరాకు చెందిన సంగీతకు ఆర్మూర్ మండలం ఆలూరుకు చెందిన మహేశ్‌తో వివాహమైంది. భర్త వ్యవసాయ కూలీ పనిచేస్తుండగా సంగీత బీడీలు చుడుతోంది. వీరికి మనస్విని (3), రెండు నెలల బాబు ఉన్నారు. ఇటీవలే పుట్టిన మనుమడిని, తన బిడ్డ సంగీతను ఇంటికి తీసుకువచ్చేందుకు మెండోరాకు చెందిన సత్తెమ్మ (45) ఆదివారం ఆలూరు వెళ్లింది. సంగీత, మనుమరాలు మనస్విని, మనవడితో ముప్కాల్ వరకు బస్సులో వచ్చి, అక్కడి నుంచి ఆటోలో మెండోరాకు బయల్దేరింది. ఆటో బావిలో పడడంతో సత్తెమ్మ, మనస్విని మృతి చెందారు. సంగీత కాలు విరిగింది. ఆమెతోపాటు ఆమె రెండు నెలల బాబు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వదినను తీసుకువస్తూ.. కోడలి పొగొట్టుకుని.. మెండోరా మండలం కొడిచెర్లకు చెందిన ప్రవీణకు నిజామాబాద్‌కు చెందిన రాజుతో వివాహమైంది. ప్రవీణ వాళ్ల అన్నకు ముగ్గురు పిలల్లు. ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలు. వదిన, ఆమె పిల్లలు విన్యశ్రీ(6), కొడుకును వెంట తీసుకుని ప్రవీణ తమ గ్రామమైన కొడిచెర్లకు బయల్దేరింది. ముప్కాల్ వరకు బస్సులో వచ్చిన తర్వాత.. వదిన, ఆమె కొడుకు ఇద్దరూ దిగిపోయారు. అక్కడే చదువుకుంటున్న విన్యశ్రీని తీసుకొని ప్రవీణ ఆటోలో బయల్దేరింది. ప్రమాదంలో విన్యశ్రీ మృతిచెందింది. తీవ్రంగా గాయపడ్డ ప్రవీణ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. -
దీని దర్జాయే వేరు.. అదిరేలా టాప్‌పై షికారు
ముంబయి : మనుషులే కాదు.. జంతువులు కూడా దర్జాగా కనిపించగలవు.. సాధారణంగా నడుస్తున్న వాహనాల టాప్‌పై నిల్చొని హుందాగా వస్తుంటే ఆ వ్యక్తిని చూసి డాన్ ఏమో అనుకుంటాం. కానీ, అదే వాహనాలపై ఏ మాత్రం భయం లేకుండా హుందాగా ఓ కుక్క ప్రయాణించడం ఎప్పుడైనా చూశామా.. కానీ, ఇది జరిగింది. ముంబయిలోని రద్దీ రోడ్డులో వేగంగా వెళుతున్న ఓ ఆటోపై ఓ కుక్క తానే బాస్, తానే ఓడాన్ అనే తీరుగా పోజిచ్చి ప్రయాణించడం కనిపించింది. ఇంకేముంటుంది.. ఆ చిత్రాన్ని మలిష్కా అనే ఓ రేడీయో జాకీ ట్విట్టర్లో పంచుకున్నారు. దాంతో ఒక్కసారిగా ఆ ఫొటో, వీడియో తెగ వైరల్ అయింది. కొంతమంది వావ్ అమేజింగ్ అని అనగా.. ఇంకొందరేమో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ దాన్ని కొనయాడారు. మరికొందరు మాత్రం అలాంటి చర్యతో కుక్కకు చాలా ప్రమాదం అని ఆందోళన వ్యక్తం చేశారు. -
క్రికెట్ స్టేడియంలో ఆసక్తికర సన్నివేశం
లాహోర్: ఇటీవల జరిగిన పాకిస్తాన్, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన తొలి ట్వంటీ-20 ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రపంచ ఎలెవన్ జట్టు క్రికెటర్లను రెండు ప్రత్యేక ఆటోలలో లాహోర్ స్డేడియంలోకి ఆహ్వానించారు. అయితే ఆదిలోనే ఓ ఆటో మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆటోలో కూర్చుని ఉన్న క్రికెటర్లే దిగి ఆ ఆటోని తోయాల్సి వచ్చింది. సాధారణంగా ఆర్టీసీ బస్సులు ఆగినప్పుడు ప్రయాణికులు దిగి బస్సును తోస్తుంటారు. ఇదే పరిస్థితి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లకు తలెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది ట్వంటీ20 సిరీస్‌ను 2-1తో పాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే చాలా ఏళ్ల తర్వాత పాక్‌లో నిర్వహించిన అంతర్జాతీయ టోర్నీ ఇది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు తమ దేశానికి వచ్చిన వరల్డ్ ఎలెవన్ ఆటగాళ్లను వినూత్నంగా ఆటోలలో స్డేడియంలోకి తీసుకువచ్చారు. కానీ వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ డారెన్ సామి కూర్చున్న ఆటో మధ్యలో ఆగిపోయింది. దీంతో సామితో పాటు ఉన్న ఇంటర్నేషనల్ క్రికెటర్లు వెంటనే ఆటో నుంచి కిందకి దిగి వాహనాన్ని కొద్ది దూరం తోయడంతో స్టార్ట్ అయింది. క్రికెటర్లు హుషారుగా ఆటోలలో మైదానంలో తిరిగారు. కొందరు దీన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. -
క్రికెట్ స్టేడియంలో ఆసక్తికర సన్నివేశం
-
మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ ఆటో ‘ఈ ఆల్ఫా’
ధర రూ.1.12 లక్షలు న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా గురువారం మార్కెట్లో ఈ ఆల్ఫా పేరుతో ఆటోరిక్షాను విడుదల చేసింది. దీని ధర ఢిల్లీ ఎక్స్ షోరూమ్ రూ.1.12 లక్షలుగా ప్రకటించింది. ఐదుగురు కూర్చునే సామర్థ్యం గల ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 85 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం 25 కిలోమీటర్లు. మహీంద్రా ఇప్పటికే పలు రకాల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. వీటిలో ఈ వెరిటో, ఈ20 ప్లస్ ఉన్నాయి. చివరి మైలు వరకు చేరుకునేందుకు ఈ ఉత్పత్తి దోహదపడుతుందని ఆటో రిక్షా విడుదల సందర్భంగా ఎంఅడ్ఎం ఎండీ పవన్ గోయెంకా మీడియాతో అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్ ఫోలియో విస్తరణపై దృష్టి పెట్టామని, రానున్న రోజుల్లో ఈ విభాగం నుంచి మ రిన్ని ఉత్పత్తులు విడుదల చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ విభాగంపై ఇప్పటికే రూ.500 కోట్లు ఇన్వెస్ట్ చేశామని, మరో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఉత్పత్తిని నెలకు 500 యూనిట్ల నుంచి రానున్న కొన్ని నెలల్లో 1,000 యూనిట్లకు, కొన్నేళ్లలో 5,000 యూనిట్లకు తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. -
ఆటో, సెప్టిక్ ట్యాంక్ ఢీ, ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మాదాపూర్ డీమార్ట్ సమీపంలోని చౌరస్తావద్ద ప్రయాణికులతో వెళుతున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన సెప్టిక్ ట్యాంక్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతిచెందాడు. ఆటో డ్రైవర్ మహేష్ సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మాదాపూర్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
అమ్రేలీ: గుజరాత్లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. లారీ, ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆటోలో మున్నాభాయ్!
పడవ లాంటి కారులో చెమటపట్టకుండా, బట్టలు నలగకుండా, ఎండ కన్నెరగకుండా సౌకర్యవంతంగా ప్రయాణం చేస్తుంటారు సినిమా స్టార్స్. అలాంటివాళ్లు సాదాసీదా ఆటో ఎక్కినా, ట్రైన్లో ప్రయాణం చేసినా కచ్చితంగా అది హాట్ టాపిక్ అవుతుంది. ముంబయ్‌లో రోడ్లు చాలా రద్దీగా ఉంటాయి. ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకుని, విసుగు చెందేవాళ్ల జాబితా చాలానే ఉంటుంది. అప్పుడప్పుడూ సినిమా స్టార్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుని, షూటింగ్‌కి లేటవుతుందనే టెన్షన్‌తో ఆటోలు, లేదంటే లోకల్ ట్రైన్లు ఎక్కేసి సమయానికి చేరుకుంటుంటారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్, హృతిక్‌రోషన్, సోనాక్షీ సిన్హా వంటి స్టార్లు ఇలాంటి ప్రయాణాలు చేశారు. తాజాగా సంజయ్ దత్ చేసిన ఆటో జర్నీ గురించి అందరూ వింతగా చెప్పుకుంటున్నారు. సరదాగా ఓ సాయంత్రం స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ముంబయ్‌లోని బాంద్రాలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు వెళ్లారాయన. డిన్నర్ అయిపోయాక, బయటకు వచ్చి చూస్తే, పికప్ చేసుకోవడానికి ఆయన కారు సకాలంలో అక్కడకు చేరుకోలేదు. దాంతో అక్కడే ఉన్న ఆటోను పిలిచారు మన మున్నాభాయ్. స్నేహితునితో సహా ఈ మూడు చక్రాల వాహనం ఎక్కి, ఎంచక్కా ఇంటికి వెళ్ళిపోయారు. ఓ స్టార్ తన ఆటో ఎక్కడం చూసి డ్రైవర్ స్వీట్ షాక్‌కు గురయ్యాడట. ఇంటి దగ్గర దిగాక, మీటర్ 150 రూపాయలే అయినా, ఆ ఆటోడ్రైవర్ చేతిలో నాలుగొందలు పెట్టారట సంజయ్‌దత్. -
'రోడ్లపైకి వస్తే నిప్పంటించడం ఖాయం'
ముంబయి: రాష్ట్రంలో ఆటోరిక్షాల అనుమతులు మరాఠేతరులకే అధికంగా ఇస్తున్నారని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఆరోపించింది. 70శాతం ఆటో పర్మిట్లు రాష్ట్రేతరులకే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆటోలన్నింటిని గుర్తించి తగులబెడతామంటూ బహిరంగ ప్రకటన చేసింది. తన పార్టీ కార్యకర్తలు అలాంటి ఆటోలు రోడ్లపై కనిపిస్తే నిప్పుపెట్టడం ఖాయం అని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే చెప్పారు. పార్టీ పదో వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 'కొత్త పర్మిట్ తీసుకున్న మహారాష్ట్రేతర ఆటో కనిపిస్తే ఆపేస్తాం. అందులోని ప్రయాణీకులను దించివేసి ఆ ఆటోను కాల్చివేస్తాం.. రాష్ట్ర రవాణాశాఖను చూసుకుంటున్న శివసేన ఈ విషయంలో ఏం చేస్తోంది చెప్పాలి' అని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉన్న అనుమతులు కాకుండా త్వరలోనే మరో 70 వేల మహారాష్ట్రేతరులకు అనుమతులు ఇవ్వబోతున్నారని వాటిని ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
కారు బీభత్సం,నలుగురికి తీవ్రగాయాలు
-
ఆటోలో... స్కూల్‌కు వెళ్లేవాణ్ణి!
మహేశ్‌బాబు మితభాషి. మీడియా ముందు కూడా చాలా తక్కువగా మాట్లాడతారు.సినిమాల గురించి తప్ప, వ్యక్తిగత విషయాల గురించి మాత్రం అస్సలు ప్రస్తావించరు. ఇటీవల ఓ కార్యక్రమంలో మనసు విప్పి మాట్లాడారు. చిన్నప్పటి విషయాలు, తన మనస్తత్వం,పిల్లల గురించి ఇలా ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు... నేను పెరిగింది చెన్నయ్‌లో. చదువుకున్నదీ అక్కడే. అందరి పిల్లల్లా నేనూ సాదాసీదాగానే ఉండేవాణ్ణి. అందరిలానే నేనూ ఆటోరిక్షాలో స్కూల్‌కి వెళ్లేవాణ్ణి. మా నాన్న సూపర్‌స్టార్ కృష్ణ అని చెబితే.. అందరూ ప్రత్యేకంగా చూస్తారేమోనని స్కూల్లో ఎవరికీ చెప్పలేదు. మా నాన్నకు కూడా అదే ఇష్టం. ఓసారి సమ్మర్ హాలిడేస్‌లో మా నాన్న ఓ సినిమాలో యాక్ట్ చేయమంటే చేశాను. అప్పట్నుంచీ వేసవి సెలవుల్లో సినిమాలు చేయడం ఆనవాయితీ అయ్యింది. చెన్నయ్‌లో తెలుగు సినిమాలు చూసేవాళ్లు తక్కువమంది కాబట్టి, నేను ‘చైల్డ్ స్టార్’ అని ఎవరికీ తెలియదు. అలా తెలియకపోవడం నాకు మంచిదైంది. లేకపోతే ప్రత్యేకంగా చూసేవాళ్లు.. నాకు దూరంగా ఉండేవాళ్లు. డేటింగ్ మీద నాకు ఆసక్తి లేదు. ఒకవేళ మూడు గంటలపాటు లాస్ ఏంజిల్స్‌లో ఎవరినైనా డిన్నర్ డేట్‌కి తీసుకెళ్లాల్సి వస్తే.. ఎవరిని తీసుకెళతారని అడిగితే... హాలీవుడ్ స్టార్ డెమీ మూర్ పేరు చెబుతాను. కానీ, మూడు గంటలసేపు డిన్నర్ డేట్ అంటే బోరింగ్‌గా ఉంటుంది కదా. ‘1’ చిత్రంలో నటించిన తర్వాత మా అబ్బాయి గౌతమ్‌కి సినిమాలంటే ఆసక్తి పెరిగింది. కానీ, పెద్దైన తర్వాత తన ఆలోచనలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. సో.. భవిష్యత్తులో తనేమవుతాడో కాలమే చెబుతుంది. ఇప్పుడిప్పుడే గౌతమ్ నా సినిమాలు చూస్తున్నాడు. ఎక్కువ శబ్దం ఉండే సన్నివేశాలు తనకు పెద్దగా నచ్చవు. జీవితం సాఫీగా సాగాలంటే డబ్బు చాలా అవసరం. అందుకే, డబ్బు సంపాదించడానికి కష్టపడాలి. మా నాన్న నాకు చెప్పిన మాటలివి. నా పిల్లలకు కూడా నేనీ మాటలే చెప్పాలనుకుంటున్నా. చీటికీ మాటికీ కోపం తెచ్చుకునే తత్వం కాదు నాది. అరుదుగా వస్తుంది.. అది కూడా ఇంట్లో ఉన్నప్పుడే. ఆ కోపం ఐదు నిమిషాల్లోనే పోతుంది. నాకైతే మా అమ్మాయి సితారను సైంటిస్ట్‌ను చేయాలని ఉంది. మరి.. పెద్దైన తర్వాత తనేం కావాలనుకుంటుందో చూడాలి. స్వతహాగా నేను ఫుడ్ లవర్ని. కానీ, షూటింగ్స్ అప్పుడు డైట్ కంట్రోల్ చేయాలి కదా. అందుకే, హాలిడేస్‌లో డైట్ పాటించను. నచ్చినవన్నీ లాగించేస్తా. నా ఫేవరెట్ హాలిడే స్పాట్ దుబాయ్. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి.
-
రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
-
రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
అనంతపురం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గోరంట్ల మండలం గుమ్మయ్యగారి పల్లె దగ్గర ఆటోను లారీ ఢీ కొట్టింది.ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. పెడబల్లికి చెందిన నాగమ్మ, షరీవమ్మ, సుగుణ, వెంకటమ్మ, నాగమణితో పాటు డ్రైవర్ విజయకుమార్ కూడా మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటకలోని సాగేపల్లికి కూరగాయలు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా పెడపల్లి గ్రామానికి చెందినవారు. మృతులంతా కూలీలని తెలుస్తోంది. పనుల కోసం పొద్దున్నే ఆటోలో బయల్దేరిన కూలీలు.. లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. వాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
అత్యాచారం చేసి.. ఆటోలో నుంచి తోసేసి..
పశ్చిమబెంగాల్లో ఓ వివాహితపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను ఆటో లోంచి కిందకు తోసేశారు. కోల్‌కతా శివారు ప్రాంతం ఆక్రాలో ఓ వివాహిత భర్త నుంచి విడిపోయి తల్లి దగ్గర ఉంటుంది. ఆమెకు షఫిక్ అనే వ్యక్తితో సన్నిహిత సంబంధముంది. షఫిక్ ఆమెకు ఫోన్ చేసి పిలిపించుకుని నెంబర్ ప్లేట్ లేని ఆటోలో తీసుకెళ్లాడు. అతని వెంట మరో నలుగురు ఉన్నారు. ఆమెకు మద్యం ఇచ్చి మత్తులోకి వెళ్లిన తర్వాత ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆటోలో నుంచి బయటకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గమనించిన స్థానికులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం కోల్‌కతా లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఆరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.