సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను నెటిజన్లతో పంచుకుంటారు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. ఇటీవల, చెన్నైకు చెందిన ఆటో-రిక్షా డ్రైవర్ నైపుణ్యానికి ఫిదా అయ్యారు ఆనంద్ మహీంద్రా.
ఆటో డ్రైవర్ కాదు..మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్..!
అన్నా దురై బిజినెస్ స్కిల్స్‌కు మంత్ర ముగ్దుడైన ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ది బెటర్ ఇండియా కవర్ చేసిన స్టోరీని పంచుకోవడమే కాకుండా అతన్ని మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ అని పిలిచాడు. మహీంద్రా తన పోస్ట్‌లో, "ఎంబీఐ విద్యార్థులు అతనితో ఒక రోజు గడిపినట్లయితే, అది కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ మేనేజ్‌మెంట్‌లో కంప్రెస్డ్ కోర్సు అవుతుంది. ఈ వ్యక్తి ఆటో డ్రైవర్ మాత్రమే కాదు. అతను మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్" అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.
అది ఆటో కాదు..అంతకుమించి..!
చెన్నైలో పలువురికి ఆటో అన్నాగా పరిచయమైన అన్నాదురై గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. కొన్ని టీవీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. అన్నాదురై తన ప్రయాణికుల కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఐటీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని తన ఆటోలో వైఫై, ల్యాప్ టాప్, ట్యాబ్, అమెజాన్ ఎకో, వార, వార్త పత్రికలు, బిజినెస్ మేగజైన్లతోపాటు తాగేందుకు వాటర్ బాటిల్స్ కూడా సిద్ధంగా ఉంచుకుంటాడు. ఇతని ఆటోలో ఒకసారి ప్రయాణిస్తే చాలు.. మళ్లీ ఇతని కోసమే ఎదురు చూస్తారు. ఐటీ ప్రొఫెషనల్స్ తోపాటు ఎక్కువ మంది అన్నాదురై ఆటోనే ప్రయాణిస్తున్నారు.
మోటివేషనల్ స్పీకర్ కూడా..!
12వ తరగతి డ్రాపౌట్ అయిన దురై 2012 నుంచి చెన్నైలో తన విలక్షణమైన ఆటోతో చెన్నైలో భారీ ఆదరణను పొందాడు అన్నాదురై. ఇప్పటికే వెబ్ సంచలనం, మోటివేషనల్ స్పీకర్‌గా మారారు. అతను ఫేస్‌బుక్‌లో 10,000 మందికి పైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నాడు. పలు కంపెనీల్లో 40కి పైగా ప్రసంగాలు, ఏడు టెడ్‌ఎక్స్ టాక్స్ షో ప్రసంగించాడు. కరోనా మహమ్మారి కారణంగా శానిటైజేషన్ సిబ్బంది, నర్సులు, వైద్యులకు ఉచిత రైడ్‌లను అందజేస్తున్నాడు.
If MBA students spent a day with him it would be a compressed course in Customer Experience Management. This man’s not only an auto driver… he’s a Professor of Management. @sumanmishra_1 let’s learn from him… https://t.co/Dgu7LMSa9K
— anand mahindra (@anandmahindra) January 22, 2022
చదవండి: రండి.. దయచేయండి.. పారిశ్రామిక వేత్తలకు ‘సోషల్’ ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment