
చెన్నై: గిన్నీస్ రికార్డు కోసం ఈ మధ్య జనాలు వింత వింత విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. కొందరు వెరైటీ ప్రోగ్రామలు నిర్వహించి రికార్డు క్రియేట్ చేస్తుండగా.. మరికొందరు ప్రాణాలను సైత పణంగా పెట్టి సాహసోపేతమైన ఫీట్లు చేస్తూ.. ఇటు చూసేవారిని.. అటూ గిన్నీస్ రికార్డు అధికారులను ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన రికార్డు ఒకటి నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇక సదరు వ్యక్తి చేసిన సాహసం చూసే వారు.. భయం, ఎగ్జైట్‌మెంట్, షాక్ వంటి ఫీలింగ్స్‌ని ఒకే సారి చవి చూస్తున్నారు. ఇంతకు ఏమా విన్యాసం.. ఎలా గిన్నీస్ రికార్డు క్రియేట్ చేసిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఇప్పుడు మనం చూడబోయే వీడియో 2015 నాటిది. దీన్ని కొన్ని గంటల ముందే గిన్నీస్ బుక్ వారు పోస్ట్ చేశారు. ఇందులో తమిళనాడు చెన్నైకి చెందిన ఆటో డ్రైవర్ జగదీష్ మణి ఆటోను రెండు చక్రాలపై నడిపాడు. అలా మొత్తం 2.2 కిలోమీటర్ల దూరం నడిపి... గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించాడు.
(చదవండి: Travel: గిన్నిస్ రికార్డు.. జటాయు పార్కు)
"చరిత్రాత్మక ఆటో-రిక్షా సైడ్ చక్రాలది. చెన్నైకి చెందిన ఆటో-రిక్షా డ్రైవర్ జగదీష్ ఇలా ఆటోను సైడ్‌కి నడిపి రికార్డ్ సృష్టించాడు" అని క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ సందర్భంగా జగదీష్ మణి మాట్లాడుతూ.. "ఇలాంటి రికార్డ్ సాధిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ గిన్నీస్ వరల్డ్ రికార్డు వారు నా టాలెంట్‌ని గుర్తించినందుకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారికి కృతజ్ఞతలు’’ అన్నారు.
(చదవండి: Guinness World Record: బతికే ఛాన్స్ జీరో.. బర్త్ డే వేడుకలు..)
ఇప్పటికే ఈ వీడియోని 3 లక్షల మందికి పైగా చూశారు. జగదీష్ మణి టాలెంట్‌ని ప్రశంసిస్తున్నారు నెటిజనులు. "భారతీయులు మాత్రమే ఇలా చెయ్యగలరు" అని ఒకరు కామెంట్ ఇవ్వగా... "నేను అందులో ప్రయాణించాలనుకుంటున్నాను".. "ఇది అద్భుతం అంతే" అని మరొకరు కామెంట్ చేశారు.
చదవండి: బాబోయ్.. అసలు ఇంతకాలం నువ్వు ఎలా బతికావ్!
Comments
Please login to add a commentAdd a comment