రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి | six people died as truck hits auto rickshaw in anantapur | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి

Oct 22 2014 7:45 AM | Updated on Jul 12 2019 5:45 PM

రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి

అనంతపురం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

అనంతపురం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గోరంట్ల మండలం గుమ్మయ్యగారి పల్లె దగ్గర ఆటోను లారీ ఢీ కొట్టింది.ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.  మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. పెడబల్లికి చెందిన నాగమ్మ, షరీవమ్మ, సుగుణ, వెంకటమ్మ, నాగమణితో పాటు డ్రైవర్ విజయకుమార్ కూడా మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటకలోని సాగేపల్లికి కూరగాయలు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా పెడపల్లి గ్రామానికి చెందినవారు.

మృతులంతా కూలీలని తెలుస్తోంది. పనుల కోసం పొద్దున్నే ఆటోలో బయల్దేరిన కూలీలు.. లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. వాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement