
ముంబయి : మనుషులే కాదు.. జంతువులు కూడా దర్జాగా కనిపించగలవు.. సాధారణంగా నడుస్తున్న వాహనాల టాప్‌పై నిల్చొని హుందాగా వస్తుంటే ఆ వ్యక్తిని చూసి డాన్ ఏమో అనుకుంటాం. కానీ, అదే వాహనాలపై ఏ మాత్రం భయం లేకుండా హుందాగా ఓ కుక్క ప్రయాణించడం ఎప్పుడైనా చూశామా.. కానీ, ఇది జరిగింది.
ముంబయిలోని రద్దీ రోడ్డులో వేగంగా వెళుతున్న ఓ ఆటోపై ఓ కుక్క తానే బాస్, తానే ఓడాన్ అనే తీరుగా పోజిచ్చి ప్రయాణించడం కనిపించింది. ఇంకేముంటుంది.. ఆ చిత్రాన్ని మలిష్కా అనే ఓ రేడీయో జాకీ ట్విట్టర్‌లో పంచుకున్నారు. దాంతో ఒక్కసారిగా ఆ ఫొటో, వీడియో తెగ వైరల్ అయింది. కొంతమంది వావ్ అమేజింగ్ అని అనగా.. ఇంకొందరేమో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ దాన్ని కొనయాడారు. మరికొందరు మాత్రం అలాంటి చర్యతో కుక్కకు చాలా ప్రమాదం అని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment