
Salman Khan Drives Autorickshaw At Panwel Video Goes Viral: బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27 సోమవారం 56వ పడిలోకి అడుగుపెట్టాడు. తన పుట్టిన రోజు వేడుకలను తన నివాసంలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసి వార్తల్లో నిలిచాడు భాయిజాన్. హీరోయిన్ జెనీలియాతో డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట గింగిరాలు తిరిగింది. తన ఖాళీ సయమాన్ని ఎంజాయ్ చేస్తున్న సల్లూ భాయి మరొక వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.
బుధవారం (డిసెంబర్ 29) ముంబైలోని పన్వెల్‌లో రద్దీగా ఉన్న రోడ్లపై ఆటో రిక్షా నడుపుతూ కనిపించాడు ఈ సల్లూ భాయ్. సిక్స్ ప్యాక్ బాడీని కొనసాగిస్తూ.. సినిమాల్లో పాత్రలకు తగినట్లుగా కష్టపడతాడుతూ.. యాక్షన్ సీన్లు, డ్యాన్‌లతో అలరించే ఈ భాయిజాన్ ఆటో నడపడం చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ప‍్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆటో రిక్షాను నడిపిన సల్మాన్‌ను చూసిన అభిమానులు మురిసిపోతున్నారు.
ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు మాత్రం సల్మాన్‌ను ట్రోలింగ్‌తో ఏకిపారేశారు. ఇది 'ఒమిక్రాన్ కన్నా డేంజర్' అని ఒక యూజర్ కామెంట్ చేస్తే.. 'తర్వగా అందరూ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోండి' అని సెటైర్ వేశాడు. మరొకరైతే 'ఆటోలో పాము లేదా' అని కామెంట్ పెట్టారు. ఇదిలా ఉంటే సల్మాన్ బర్త్‌డేకు ఒక ముందు రోజు పాము కాటుకు గురైన సంగతి తెలిసిందే. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన సల్మాన్ 6 గంటల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. తర్వాత అది ప్రమాదకరమైన విష సర్పం కాదని సల్లూ భాయ్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment