సల్మాన్ ఖాన్ 'కిక్' సినిమాలోని 'జుమ్మేకి రాత్ హై..' సాంగ్ చాలా పాపులర్. తాజాగా తన పాటకు తానే స్టెప్పులేశాడు సల్మాన్. అయితే ఈసారి బుట్టబొమ్మ పూజా హెగ్డేతో కలిసి దుబాయ్ ఎక్స్‌పో 2020లో ఓ స్టేజీపై చిందేశాడు. అయితే స్టెప్పులేయడంలో అతడు కొంత తడబడ్డాడు. ఒరిజినల్ సాంగ్‌లో సల్మాన్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చొక్కా కొనను పంటితో పట్టుకుంటే ఆమె అతడి ముందు నడుస్తూ ఉంటుంది. ఈసారి కూడా ఇదే స్టెప్ వేద్దామనుకున్నాడు సల్లూభాయ్. కానీ పూజా ఎలాంటి షర్ట్ వేసుకోకపోవడంతో ఆమె డ్రెస్‌ను ఎలా పంటితో పట్టుకోవాలో అర్థం కాక స్టేజీమీదే సతమతమయ్యాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు హీరోను ట్రోల్ చేస్తున్నారు. 'అక్కడేముందని నోటితో పట్టుకోవాలని చూస్తున్నావ్ సల్లూ భాయ్', 'అయ్యో 'పూజా ఎంత పని చేసింది? పొట్టి డ్రెస్ వేసుకొచ్చి సల్మాన్ డ్యాన్స్ చేయడానికి వీలు లేకుండా అతడి పరువు తీసింది', 'వయసైపోయాక ఇంకా ఆ కుప్పిగంతులెందుకు సల్మాన్?' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సల్మాన్ ప్రస్తుతం కత్రినా కైఫ్‌తో 'టైగర్ 3', పూజా హెగ్డేతో 'భాయ్‌జాన్', 'కిక్ 2' సినిమాలు చేస్తున్నాడు. అలాగే త్వరలో 'భజరంగీ భాయ్‌జాన్' సీక్వెల్ పనులు కూడా మొదలు కానున్నాయి.
When #SalmanKhan Tries to make the impossible Dance Step possible with #PoojaHegde ♡ Da-DanggTheTourReloaded@BeingSalmanKhan @hegdepooja pic.twitter.com/O67PXz9ZyS
— Salman Sajid Bhai Jaan (@SalmanSajidBha6) February 26, 2022
Best Performance By Megastar @BeingSalmanKhan Sir with Disha Patani On Seethi Maar Song At Dabanng The Tour #Expo2020Dubai pic.twitter.com/9Mdl53F5Zh
— 𝙏𝙬𝙞𝙣𝙠 (@BeingHBK10) February 26, 2022
Comments
Please login to add a commentAdd a comment