సల్మాన్ ఖాన్‌తో బుట్టబొమ్మ డేటింగ్.. స్పందించిన హీరోయిన్‌ | Pooja Hegde reacts to dating rumours with Salman Khan | Sakshi
Sakshi News home page

Pooja Hegde: సల్మాన్‌తో డేటింగ్‌ రూమర్స్‌పై స్పందించిన బుట్టబొమ్మ.. ఏమందంటే?

Published Fri, Apr 14 2023 2:57 PM | Last Updated on Fri, Apr 14 2023 3:38 PM

Pooja Hegde reacts to dating rumours with Salman Khan - Sakshi

బుట్టబొమ్మ పూజా హెగ్డే, సల్మాన్ ఖాన్ జంటగా నటించిన తాజా చిత్రం 'కిసీ కా భాయ్.. కిసీ కి జాన్'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 21న థియేటర్లలో విడుదల కానుంది. అయితే గతంలో పూజా హేగ్డేతో సల్మాన్ ఖాన్‌ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. బుట్టబొమ్మతో సల్మాన్‌  ఖాన్‌ మరో రెండు సినిమాల్లోనూ హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. తాజాగా సల్మాన్ ఖాన్‌తో  డేటింగ్ రూమర్స్‌పై బుట్టబొమ్మ స్పందించింది. 

పూజా హెగ్డే మాట్లాడుతూ.. 'దాని గురించి నేనేం చెప్పగలను? నా గురించి వచ్చిన వార్తలు చదివా. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నా. అలా ఉండడమే నాకిష్టం. నా దృష్టి అంతా కెరీర్‌పైనే ఉంది. నేను ఇలాంటి వాటిని పట్టించుకోను. సల్మాన్‌తో కలిసి నటించడం చాలా గొప్ప అనుభవం. సెట్స్‌లో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. తనకు అనిపించింది ముక్కుసూటిగా చెప్పేస్తాడు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ తెలుగు అమ్మాయి పాత్ర. అందుకే నాకు బాగా నచ్చింది' అని అన్నారు. 

మంగళూరులో జరిగిన పూజా హెగ్డే సోదరుడు రిషబ్ హెగ్డే వివాహానికి సల్మాన్‌ హాజరు కాగా.. డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. పూజా తాజా కామెంట్స్‌తో రూమర్స్‌కు చెక్‌ పెట్టినట్లు అయింది. ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్ దగ్గుబాటి, జగపతి బాబు, షెహనాజ్ గిల్, పాలక్ తివారీ, విజేందర్ సింగ్, రాఘవ్ జుయల్, జాస్సీ గిల్, భూమికా చావ్లా, సిద్ధార్థ్ నిగమ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement