
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోయిన్ పూజా హెగ్డేతో ప్రేమాయణం సాగిస్తున్నాడంటూ బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ‘కిసీకా భాయ్ కిసీకి జాన్’ సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న పూజా-సల్మాన్‌లు డేటింగ్ చేస్తున్నారంటూ ఫిల్మ్‌నగర్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది.
అంతేకాకుండా సల్మాన్ తాను చేయనున్న తర్వాత సినిమాల్లో పూజానే హీరోయిన్‌గా రిఫర్ చేస్తున్నాడంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. తాజాగా వాటినే నిజం చేశాడు సల్లూభాయ్. ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటైన ‘భజరంగీ భాయ్ జాన్’ సినిమా సీక్వెల్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
అయితే గతంలో ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కరీనా కపూర్‌ని కాకుండా పూజా హెగ్డేను తీసుకోవడానికి సల్మాన్ డిసిషన్ తీసుకున్నాడు అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీంతో మరోసారి వీరిద్దరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment