బుట్టబొమ్మతో లవ్‌లో పడ్డ సల్మాన్‌ ఖాన్‌! | Kamaal Rashid Khan: Salman Khan Fell In Love With Pooja Hegde | Sakshi
Sakshi News home page

Salman Khan: ప్రేమలో మునిగి తేలుతున్న సల్మాన్‌- పూజా హెగ్డే!

Published Wed, Dec 7 2022 8:02 PM | Last Updated on Wed, Dec 7 2022 9:18 PM

Kamaal Rashid Khan: Salman Khan Fell In Love With Pooja Hegde - Sakshi

బాలీవుడ్‌ భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌ సినిమాల మీద పెట్టిన దృష్టి పెళ్లి మీద పెట్టడం లేదు. తను ప్రేమించిన హీరోయిన్స్‌ అందరికీ పెళ్లి అయిపోతున్నా అతడు మాత్రం చీమ కుట్టనట్లే ఉన్నాడు. అయితే సల్లూ భాయ్‌ మరోసారి లవ్‌లో పడ్డాడంట. ఆ అతిలోక సుందరి ఎవరా? అనుకుంటున్నారా? పూజా హెగ్డేనట!

'సల్మాన్‌ ఖాన్‌, పూజా హెగ్డేతో ప్రేమలో పడ్డాడు. అతడి నెక్స్ట్‌ రెండు సినిమాలకు కూడా పూజా హెగ్డేనే హీరోయిన్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రేమపక్షులు సమయం దొరికితే చాలు కలిసి కాలక్షేపం చేస్తున్నారు. ఈ మాట సల్మాన్‌ సన్నిహితులే చెబుతున్నారు' అంటూ బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌, రివ్యూయర్‌ కమల్‌ రషీద్‌ ఖాన్‌(కేఆర్‌కే) ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అవుతోంది. రేయ్‌, ఏంట్రా ఇది.. మా బుట్టబొమ్మకు సల్మాన్‌ను అంటగడతారేంట్రా అని పూజా ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. 'సల్మాన్‌ ప్రేమిస్తాడు, కానీ పెళ్లి చేసుకోడులే' అని కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తుండగా ఈ యవ్వారం అంతా నమ్మేట్లుగా లేదని మరికొందరు డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: నాదీ శ్రద్ధావాకర్‌ పరిస్థితే, ఆ నిర్మాత చంపాలని చూశాడు
కేజీఎఫ్‌ నటుడు కన్నుమూత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement