Kamaal Rashid Khan
-
బుట్టబొమ్మతో లవ్‌లో పడ్డ సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ సినిమాల మీద పెట్టిన దృష్టి పెళ్లి మీద పెట్టడం లేదు. తను ప్రేమించిన హీరోయిన్స్ అందరికీ పెళ్లి అయిపోతున్నా అతడు మాత్రం చీమ కుట్టనట్లే ఉన్నాడు. అయితే సల్లూ భాయ్ మరోసారి లవ్‌లో పడ్డాడంట. ఆ అతిలోక సుందరి ఎవరా? అనుకుంటున్నారా? పూజా హెగ్డేనట! 'సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేతో ప్రేమలో పడ్డాడు. అతడి నెక్స్ట్ రెండు సినిమాలకు కూడా పూజా హెగ్డేనే హీరోయిన్గా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రేమపక్షులు సమయం దొరికితే చాలు కలిసి కాలక్షేపం చేస్తున్నారు. ఈ మాట సల్మాన్ సన్నిహితులే చెబుతున్నారు' అంటూ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, రివ్యూయర్ కమల్ రషీద్ ఖాన్(కేఆర్కే) ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. రేయ్, ఏంట్రా ఇది.. మా బుట్టబొమ్మకు సల్మాన్‌ను అంటగడతారేంట్రా అని పూజా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 'సల్మాన్ ప్రేమిస్తాడు, కానీ పెళ్లి చేసుకోడులే' అని కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తుండగా ఈ యవ్వారం అంతా నమ్మేట్లుగా లేదని మరికొందరు డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. BREAKING NEWS : New Couple in Town !!! Mega Star #SalmanKhan fell in love with #PoojaHegde !! His production house also signed her for next 2 films !! They are spending time together now a days !! Confirmed by Salman Khan close sources. pic.twitter.com/2lkNIXH3IE — Umair Sandhu (@UmairSandu) December 7, 2022 చదవండి: నాదీ శ్రద్ధావాకర్ పరిస్థితే, ఆ నిర్మాత చంపాలని చూశాడు కేజీఎఫ్ నటుడు కన్నుమూత -
వర్మకి ఆగ్.. అలీ అబ్బాస్‌కు ‘భారత్’!
తనను తాను నంబర్ వన్ మువీ క్రిటిక్‌గా అభివర్ణించుకునే కమల్ రషీద్ ఖాన్ తాజాగా విడుదలైన బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ సినిమా ‘భారత్’ పై విరుచుకుపడ్డాడు. భారత్ సినిమా గురించి వరుస ట్వీట్లు చేసిన కమల్.. ఈ సినిమా చూడటం పెద్ద ‘టార్చర్’ అంటూ కామెంట్ చేశాడు. ఈ సినిమాపై వ్యంగ్య వ్యాఖ్యలు, జోకులు వేసిన ఆయన.. రాంగోపాల్ వర్మకు ఆగ్ సినిమా తరహాలో.. దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ కెరీర్లో ‘భారత్’ చెత్త సినిమాగా నిలిచిపోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. భారత్ సినిమా కన్నా జీరో, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, రేస్, ట్యూబ్‌లైట్ సినిమాలు వందరేట్లు బెటర్ అని, ట్యూబ్‌లైట్ తర్వాత మరోసారి సల్మాన్‌కు గట్టి దెబ్బ పడిందని కమల్ వ్యాఖ్యానించాడు. పెళ్లి అనే సాకుతో ప్రియాంక చోప్రా ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకుందో ఇప్పుడు తనకు అర్థమైందని, దర్శకుడు స్క్రిప్ట్ వినిపించిన తర్వాత ప్రియాంక కోమాలోకి వెళ్లిపోయి ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మరోవైపు రంజాన్ పర్వదినం సందర్భంగా విడుదలైన ‘భారత్’ సినిమాపై భిన్నమైన సమీక్షలు వెలువుడుతన్నాయి. సల్మాన్ అభిమానులను అలరించే సినిమా అని కొందరు అంటుండగా.. కొంచెం బోరింగ్‌గా ఉందని, కొంచెం స్కిప్ట్ మీద దృష్టి పెట్టి ఉంటే.. మరింత బాగుండేదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. -
#మీటూ : భార్యకు బానిసను, అందుకే..
సాక్షి, ముంబై: పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మొదలైన మీటూ ఉద్యమంలో ఒక విచిత్రకర, ప్రమాదకర పరిణామం చోటు చేసుకుంది. మీటూ ఉద్యమం ద్వారా మేకవన్నె పులుల్లాంటి పెద్దమనుషులు అసలు స్వరూపాలు వెలుగులోకి రావడం సంచలనం రేపింది. అయితే ఈ ఉద్యమం ద్వారానైనా కార్యాలయాల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేసుకునే పరిస్థితులు కావాలని, ఒకవైపు మహిళలు కోరుకుంటోంటే మరోవైపు ప్రముఖ వివాదాస్పద సినీ విమర్శకుడు కమాల్ రషీద్ ఖాన్ తీసుకున్న ఇందుకు భిన్నమైన వివాదాస్పద నిర్ణయం వార్తల్లో నిలిచింది. ఏకంగా తన ఆఫీసుల్లో పనిచేసే మొత్తం మహిళా ఉద్యోగులపై వేటు వేశాడు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఒక పోస్ట్ పోట్టాడు. ఇండియా, దుబాయ్‌లలోని తన ఆఫీసుల్లోని మహిళలందరినీ ఉద్యోగాలనుంచి తొలగించినట్టు తెలిపారు. తనకు తాను మహిళల నుండి దూరంగా ఉండాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశాడు. ఇకపై ఏ మహిళతోనూ మాటల్లేవ్.. పార్టీల్లేవ్. థ్యాంక్స్ టూ మీటూ అని ట్వీట్ చేశాడు. పైగా తాను భార్యకు బానిసను, ఇది నూటికి నూరుపాళ్లు నిజం..అందుకే ఆమె ఆర్డర్‌ను పాలో అయ్యానని పేర్కొన్నాడు. దీంతో కేఆర్కే చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు మీటూ ఉద్యమ నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు ఇపుడిపుడే మొదలయ్యాయి. లైంగిక వేధింపుల ఫిర్యాదు కమిటీల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు మహిళలు సమాన అవకాశాలు కావాలని నినదిస్తోంటే. మహిళలను నిరుద్యోగులను చేస్తూ కెఆర్కె బాధ్యతా రాహిత్యమైన నిర్ణయం తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాగా మీడియాలో లైంగిక వేధింపులపై కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మొదలు పెట్టిన మీటూ ఉద్యమం క్రమంగా మిగతా రంగాలకు విస్తరించింది. ముఖ్యంగా సినీ, రాజకీయ రంగాల్లోని పెద్దమనుషుల బండారాన్ని బద్దలు చేసింది. గాయని చిన్మయి శ్రీపాద ట్వీట్ అనంతరం తమిళ సినీ రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపులపై అనేకమంది బాధితుల గోడు, అలాగే కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్‌పై చెలరేగిన ఆరోపణలు విస్తుగొల్పాయి. ఈ నేపథ్యంలో ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు. టాటా మోటార్స్, టాటా సన్స్ సంస్థలు సంబంధిత చర్యలకుపక్రమించిన సంగతి తెలిసిందే. Yes! It’s 100% true “Ki Main Biwi Ka Ghulam Hoon” So I followed her order. And now we don’t have any female staff in any of my office in India or Dubai. No parties! No talking with any girl. Thanks to #MeToo!👏👏👏 pic.twitter.com/X463LtbDUm — KRK (@kamaalrkhan) October 29, 2018 -
టీమిండియాపై, కోహ్లీపై రెచ్చిపోయిన కేఆర్కే
ముంబై: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ (కేఆర్కే) మరో వివాదానికి తెరతీశాడు. శ్రీలంక చేతిలో ఓటమిని విరాట్ కోహ్లీ సేన జీర్ణించుకోలేక ఉన్న నేపథ్యంలో.. పుండు మీద కారం చల్లినట్లుగా కోహ్లీ సహా జట్టు మీద విమర్శలు గుప్పించాడు. శిఖర్ ధావన్ శతకానికి రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీలు హాఫ్ సెంచరీలు జోడించడంతో భారత్ 321 పరుగుల భారీ స్కోరు చేసి ఓడిపోవడాన్ని కేఆర్కే తప్పుపడుతూ వరుస ట్వీట్లతో రెచ్చిపోయాడు. 'కోహ్లీ ఓ మోసగాడు. విజయ్ మాల్యాతో కలిసి పార్టీలు చేసుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. అయినా డకౌట్ అయిన కోహ్లీ.. ఇంకా స్కోరు చేసి ఉంటే బాగుండేది. అందుకోసం మాల్యాను పిలుస్తే బాగుంటుంది. ఇదివరకే దక్షిణాఫ్రికా పాక్ చేతిలో ఓటమితో రగిలిపోతోంది. ఆ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోతుందని భావించను. భారత్ తన తదుపరి మ్యాచ్ సఫారీలతో ఆడాల్సి ఉంటుంది. ఈ రోజు అంతా తేలిపోయింది. టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గదు. ఒకవేళ సఫారీలను ఓడించినా.. సెమీస్‌లో గానీ, లేక చివరి మెట్టు ఫైనల్లోనైనా భారత్ బోల్తా కొట్టడం ఖాయమని శాపనార్థాలు పెడుతూ' వివాదాస్పదుడు కేఆర్కే వరుస ట్వీట్లు చేశాడు. 'రెండు కోట్ల జనాభా ఉన్న లంకలో 11 మంది చాంపియన్లు దొరికారు. కానీ 130 కోట్ల భారత జనాభాలో 11 మంది విన్నర్లను బీసీసీఐ గుర్తించలేక పోయింది. ఇది కలియుగం కనుక రావణులే గెలుస్తారని లంకేయులు నిరూపించారని' కేఆర్కే ట్వీట్ల పర్వం కొనసాగింది. మరోవైపు కేఆర్కే తీరుపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. Bro @imVkohli fraud n wanted @TheVijayMallya Ke Sath party Karoge Toh Result Toh Yahi Hona hai! Gareebon Ki Haai Toh Jeetne Nahi Degi! — KRK (@kamaalrkhan) 8 June 2017 It's tough to believe that South Africa can get defeated twice in a row while #BBCITeam will play next match with South Africa only. Lol