తనను తాను నంబర్ వన్ మువీ క్రిటిక్‌గా అభివర్ణించుకునే కమల్ రషీద్ ఖాన్ తాజాగా విడుదలైన బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ సినిమా ‘భారత్’ పై విరుచుకుపడ్డాడు. భారత్ సినిమా గురించి వరుస ట్వీట్లు చేసిన కమల్.. ఈ సినిమా చూడటం పెద్ద ‘టార్చర్’ అంటూ కామెంట్ చేశాడు. ఈ సినిమాపై వ్యంగ్య వ్యాఖ్యలు, జోకులు వేసిన ఆయన.. రాంగోపాల్ వర్మకు ఆగ్ సినిమా తరహాలో.. దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ కెరీర్‌లో ‘భారత్’ చెత్త సినిమాగా నిలిచిపోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
భారత్ సినిమా కన్నా జీరో, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, రేస్, ట్యూబ్‌లైట్ సినిమాలు వందరేట్లు బెటర్ అని, ట్యూబ్‌లైట్ తర్వాత మరోసారి సల్మాన్‌కు గట్టి దెబ్బ పడిందని కమల్ వ్యాఖ్యానించాడు. పెళ్లి అనే సాకుతో ప్రియాంక చోప్రా ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకుందో ఇప్పుడు తనకు అర్థమైందని, దర్శకుడు స్క్రిప్ట్ వినిపించిన తర్వాత ప్రియాంక కోమాలోకి వెళ్లిపోయి ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
మరోవైపు రంజాన్ పర్వదినం సందర్భంగా విడుదలైన ‘భారత్’ సినిమాపై భిన్నమైన సమీక్షలు వెలువుడుతన్నాయి. సల్మాన్ అభిమానులను అలరించే సినిమా అని కొందరు అంటుండగా.. కొంచెం బోరింగ్‌గా ఉందని, కొంచెం స్కిప్ట్ మీద దృష్టి పెట్టి ఉంటే.. మరింత బాగుండేదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment