సాక్షి, ముంబై: పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మొదలైన మీటూ ఉద‍్యమంలో ఒక విచిత్రకర, ప్రమాదకర పరిణామం చోటు చేసుకుంది. మీటూ ఉద్యమం ద్వారా మేకవన్నె పులుల్లాంటి పెద్దమనుషులు అసలు స్వరూపాలు వెలుగులోకి రావడం సంచలనం రేపింది. అయితే ఈ ఉద్యమం ద్వారానైనా కార్యాలయాల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేసుకునే పరిస్థితులు కావాలని, ఒకవైపు మహిళలు కోరుకుంటోంటే మరోవైపు ప్రముఖ వివాదాస్పద సినీ విమర్శకుడు కమాల్ రషీద్ ఖాన్ తీసుకున్న ఇందుకు భిన్నమైన వివాదాస్పద నిర్ణయం వార్తల్లో నిలిచింది. ఏకంగా తన ఆఫీసుల్లో పనిచేసే మొత్తం మహిళా ఉద్యోగులపై వేటు వేశాడు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఒక పోస్ట్ పోట్టాడు.
ఇండియా, దుబాయ్‌లలోని తన ఆఫీసుల్లోని మహిళలందరినీ ఉద్యోగాలనుంచి తొలగించినట్టు తెలిపారు. తనకు తాను మహిళల నుండి దూరంగా ఉండాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశాడు. ఇకపై ఏ మహిళతోనూ మాటల్లేవ్.. పార్టీల్లేవ్. థ్యాంక్స్ టూ మీటూ అని ట్వీట్ చేశాడు. పైగా తాను భార్యకు బానిసను, ఇది నూటికి నూరుపాళ్లు నిజం..అందుకే ఆమె ఆర‍్డర్‌ను పాలో అయ్యానని పేర్కొన్నాడు. దీంతో కేఆర్‌కే చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకవైపు మీటూ ఉద్యమ నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు ఇపుడిపుడే మొదలయ్యాయి. లైంగిక వేధింపుల ఫిర్యాదు కమిటీల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు మహిళలు సమాన అవకాశాలు కావాలని నినదిస్తోంటే. మహిళలను నిరుద్యోగులను చేస్తూ కెఆర్‌కె బాధ్యతా రాహిత్యమైన నిర్ణయం తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కాగా మీడియాలో లైంగిక వేధింపులపై కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మొదలు పెట్టిన మీటూ ఉద్యమం క్రమంగా మిగతా రంగాలకు విస్తరించింది. ముఖ్యంగా సినీ, రాజకీయ రంగాల్లోని పెద్దమనుషుల బండారాన్ని బద్దలు చేసింది. గాయని చిన్మయి శ్రీపాద ట్వీట్ అనంతరం తమిళ సినీ రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపులపై అనేకమంది బాధితుల గోడు, అలాగే కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్‌పై చెలరేగిన ఆరోపణలు విస్తుగొల్పాయి. ఈ నేపథ్యంలో ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు. టాటా మోటార్స్, టాటా సన్స్ సంస్థలు సంబంధిత చర్యలకుపక్రమించిన సంగతి తెలిసిందే.
Yes! It’s 100% true “Ki Main Biwi Ka Ghulam Hoon” So I followed her order. And now we don’t have any female staff in any of my office in India or Dubai. No parties! No talking with any girl. Thanks to #MeToo!👏👏👏 pic.twitter.com/X463LtbDUm
— KRK (@kamaalrkhan) October 29, 2018
Comments
Please login to add a commentAdd a comment