Salman Khan Friend Addresses Dating Rumours With Pooja Hegde - Sakshi
Sakshi News home page

మీకు కొంచెమైనా సిగ్గుందా.. ఆమె కూతురితో సమానం.. సల్మాన్ ఫ్రెండ్ ఆగ్రహం!

Published Tue, Dec 13 2022 4:55 PM | Last Updated on Tue, Dec 13 2022 6:11 PM

Salman Khan friend addresses dating rumours with Pooja Hegde - Sakshi

బాలీవుడ్‌ భాయ్‌ జాన్‌ సల్మాన్‌ ఖాన్‌, అందాల బుట్టబొమ్మ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఇటీవలే బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌, రివ్యూయర్‌ కమల్‌ రషీద్‌ ఖాన్‌(కేఆర్‌కే) ట్వీట్‌ వైరల్‌గా మారడంతో సల్మాన్ ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. మరికొందరేమో మా బుట్టబొమ్మకు సల్మాన్‌ను అంటగడతారేంట్రా అని పూజా హెగ్డే ఫ్యాన్స్‌ ఫైరయ్యారు. 

(ఇది చదవండి:  బుట్టబొమ్మతో లవ్‌లో పడ్డ సల్మాన్‌ ఖాన్‌!)

ఈ రూమర్లపై తాజాగా సల్మాన్ ఖాన్ స్నేహితుల్లో ఒకరు స్పందించారు. ఈ వార్తలను అతను తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. 'ఇలాంటి బాధ్యతారహితమైన వార్తలు వ్యాప్తి చేసేవారు కాస్త సిగ్గుతో తలదించుకోవాలి. పూజా హెగ్డే.. సల్మాన్ ఖాన్‌కు కూతురి లాంటిది. వాళ్లిద్దరూ కలిసి సినిమాలో నటిస్తే రూమర్లు వ్యాప్తి చేస్తారా? కొంతమంది మూర్ఖులు పబ్లిసిటీ వస్తుందని అనుకోవచ్చు. కానీ ఇది చాలా ఇబ్బందికరమైన విషయం.' అని అన్నారు. సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే ప్రస్తుతం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రానికి ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, భూమికా చావ్లా, షెహనాజ్ గిల్ కూడా నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement