Salman Khan Brutally Trolled After Netizens Notice His Tummy: సోషల్ మీడియాలో నెటిజన్లు చాలా స్మార్ట్ అని ఇప్పటికీ చాలా సార్లు నిరూపించారు. సెలబ్రిటీల రోజువారీ పనులపై నిఘా పెట్టే వీరు టాప్ టు బాటమ్ ప్రతీది గమనిస్తూ ఉంటారు. ఏదైనా చిన్న పొరపాటుతో తారలు దొరికారంటే చాలు ట్రోలింగ్‌తో ఆటాడేసుకుంటారు. ఇటీవలే బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆటో రిక్షా నడిపి ట్రోలింగ్ బారిన పడ్డాడు. తాజాగా మరోసారి నెటిజన్ల కామెంట్లకు చిక్కాడు ఈ చుల్‌బుల్ పాండే. సల్మాన్ సినిమాలోని ఒక పాటపై సల్లు భాయ్ స్టెప్పులేసిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో డ్యాన్స్ చేస్తున్న సల్మాన్ ఖాన్‌పై తెగ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్స్.
సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటి దబాంగ్. ఈ సిరీస్‌లో వచ్చిన దబాంగ్ 2 చిత్రంలోని పాండేజీ సీటి అనే పాటకు సల్మాన్ భాయ్ స్టెప్పులేశాడు. ఇది ఇటీవల ముగిసిన దబాంగ్ టూర్ కోసం బ్యాక్ డ్యాన్సర్‌లతో కలిసి డ్యాన్స్ స్టెప్పులను రిహార్సల్స్ చేస్తున్నట్లుగా ఉంది. ఈ డ్యాన్స్ చేస్తుండగా భాయిజాన్ పొట్ట బయటకు వస్తుండం గమనించారు నెటిజన్లు. దీంతో సోషల్ మీడియాలో సల్మాన్‌కు పొట్ట ఉందని ఎత్తి చూపుతున్నారు. 'ఇటీవలి విడుదలైన అంతిమ్ సినిమాలో సల్మాన్ సిక్స్ ప్యాక్ బాడీ ఫేక్ అని ఈ వీడియో చెబుతుంది' అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు. 'ఓ మై గాడ్ అతనికి పొట్ట' అని ఒక ఫ్యాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. 'భాయ్ సిక్స్ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అయింది' 'అందమైన పొట్ట' 'అరే భాయ్ మీ పొట్ట నా పొట్ట లానే ఉంది' 'వీఎఫ్‌ఎక్స్‌తో భాయ్ సిక్స్ ప్యాక్ చూపిస్తున్నారు' అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇదీ చదవండి: అలియా భట్ నవ్వు.. నెటిజన్ల ట్రోలింగు..
Comments
Please login to add a commentAdd a comment