belly fat
-
అది ఒబెసిటీ కాదట..!15 ఏళ్ల తర్వాత..
ఇన్నాళ్లుగా అనుకున్నట్లుగా ఒబెసిటీ అంటే అది కాదట. దశాబ్దాలు అలానే తప్పుగా భావించమని తేల్చి చెప్పారు వైద్యులు. అసలు ఒబెసిటీ అంటే ఏంటో..అందుకు సంబంధించిన సరికొత్త మార్గదర్శకాలను అందించారు నిపుణులు. మరీ ఒబెసిటీ అంటే ఏంటంటే..దశాబ్దాలుగా వైద్యులు ఊబకాయాన్ని(obesity) కొలవడానికి బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ)(body mass index (BMI))సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ బీఎంఐ అనేది వ్యక్తి బరువును కిలోగ్రాముల్లోనూ, ఎత్తు చదరుపు మీటర్లలో భాగించగా వచ్చిన దాన్ని శరీర కొవ్వు కొలతగా నిర్వచించేవారు. దీంతో బీఎంఐ 30 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయంగా పరిగణించారు. అయితే కొందరిలో మాత్రం అధిక శరీర కొవ్వు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ 30 కంటే ఎక్కువ బీఎం ఉండదు. అలాంటప్పుడూ రాబోయే ఆరోగ్య ప్రమాదాలు గుర్తించలేమని వైద్యులు చెబుతున్నారు. అదీగాక ప్రస్తుత జనాభా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఊబకాయం. అలాంటప్పుడు కాలం చెల్లిన బీఎంఐలతో బరువు, ఎత్తు నిష్పత్తిలతో అంచనా వేస్తే సరిపోదని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ ఒబెసిటీకి సరికొత్త నిర్వచనాన్ని మార్గదర్శకాలను అందించింది. అవేంటంటే..ఊబకాయం అనే అధిక శరీర కొవ్వు. ఇది అనేక వ్యాధులకు కారణమయ్యే దీర్ఘకాలిక వ్యాధి. అలాగే ఇక్కడ బీఎంఐ అనేది శరీర కొవ్వును అతిగా లేదా తక్కువగా అంచనా వేయవచ్చు. అంతే తప్స స్పష్టమైన అంచనా మాత్రం ఇవ్వదు. అందుకని ఈ ఊబకాయాన్ని దీర్ఘకాలిక వ్యాధికి సరిగ్గా సరిపోయేలా అనారోగ్య స్థితిగా నిర్వచించారు. ఇది అవయవాలు, కణజాలల పనితీరుపై నేరుగా ప్రభావం చూపే అధిక కొవ్వుగా పరిగణించారు. దీన్ని బయో ఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ లేదా డీఈఎక్స్ఏ స్కాన్లు వంటి ప్రత్యేక యంత్రాలతో కచ్చితంగా నిర్థారించగలమని అన్నారు. అయితే ఇవి ఖరీదైనవి కావడంతో క్లినిక్‌లలో అందుబాటులో లేవు. ఇక ఊబకాయం ఉన్నవారికి శరీరంలో కొవ్వు ఎక్కడ పేరుకుపోయిందనేది ముఖ్యమట. అంటే బొడ్డు చుట్టూ ఉంటే ఇది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. ప్రస్తుత మార్గదర్శకాలు బెల్లీఫ్యాట్(Belly Fat)ని తీవ్రమైన ఒబెసిటీ పరిగణించమని చెబుతోంది. అలాగే ఆయా వ్యక్తులకు మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనేది కూడా పరిగణలోనికి తీసుకోవాలట. కొత్త మార్గదర్శకాల్లో ఒబెసిటీని రెండు దశల్లో వర్గీకరించారు. దశ1: అవయవ పనితీరుపై లేదా సాధారణ రోజువారీ కార్యకలాపాలపై స్పష్టమైన ప్రభావాలు లేకుండా పెరిగిన కొవ్వు (BMI > 23 kg/m². ఈ దశ ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు చూపించకపోయినా..భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుందట. దశ2: బీఎంఐ 23 కిలోలు/మీ2 కంటే ఎక్కువ ఉండి, పొట్ట చుట్టూ కొవ్వు, అధిక నడుము చుట్టుకొలత ఉంటే దీన్ని ఊబకాయంగా పరిగణిస్తారు. ఇది శారీరక అవయవ విధులను ప్రభావితం చేస్తుంది. టైప్2 డయాబెటిస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఈ మార్గదర్శకాలను అక్టోబర్ 2022 నుంచి జూన్ 2023 వరకు ఐదు సర్వేలు నిర్వహించి మరీ అందిచినట్లు నిపుణుల చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత అందించిన ఈ మార్గదర్శకాలు ఆచరణాత్మకమైనవి, అలాగే ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించి నివారించడానికి ఉపయోగపడతాయని చెప్పారు.(చదవండి: 32 ఏళ్లు ద్వీపంలో ఒంటరిగా బతికాడు! సడెన్‌గా జనాల్లోకి తీసుకురాగానే..) -
పట్టుదలగా చేస్తే.. గుట్టలాంటి బెల్లీ ఫ్యాట్ దెబ్బకి...!
కొండలాంటి పొట్టను కరిగించుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారా? ఎంత కష్టపడినా బెల్లీ ఫ్యాట్ తగ్గడంలేదని ఆందోళనలో ఉన్నారా? మరి అలాంటివారికి చక్కగా ఉపయోగపడే పురాతన యుద్ధ కళలు, ఫిట్‌నెస్‌కు పెట్టింది పేరైన జపాన్‌లో ఆచరించే కొన్ని వర్కౌట్స్ గురించి తెలుసు కుందాం రండి!ఆహార అలవాట్లలో మార్పులతోపాటు కొన్ని జపనీస్ వ్యాయామాలు బెల్లీ ఫ్యాట్‌ను కరిగించు కునేందుకు, బాడీ ఫిట్‌గా ఉండేందుకు ఉపకరిస్తాయి.సుమో స్క్వాట్స్జపనీస్ ప్రొఫెషనల్ రెజ్లర్ల మ్యాచ్‌కు ముందు పొట్ట, తొడలపై భారం పడేలా కొన్ని భంగిమలను ప్రదిర్శిస్తారు. దాదాపు అలాంటివే ఈ సుమో స్క్వాట్స్పాదాలను వెడల్పుగా చాచి,నడుముపై భారం వేసి, భుజాలను స్ట్రెచ్ చేసి, రెండు చేతులను దగ్గరగా చేర్చి నమస్కారం పెడుతున్న ఫోజులో నిలబడాలి. ఇపుడు, పొత్తికడుపు, కాలి కండరాలపై భార పడుతుంది. ఈ భంగిమలో కనీసం 30 సెకన్ల పాటు నిలబడి, తిరిగి యథాస్థితిలోకి రావాలి.తెనుగుయ్ టైడో (టవల్ స్వింగ్స్)అత్యంత ప్రభావవంతమైన, సులభంగా నిర్వహించగల జపనీస్ వ్యాయామాలలో ఒకటి, టవల్ స్వింగ్‌లు కడుపు, పొత్తికడుపు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. కండరాలను బలపరుస్తాయి.పాదాలను వెడల్పుగా ఉంచి, భుజాలు స్ట్రెచ్అయ్యేలా చేతులను వెడల్పుగా చాచి నిల బడాలి. ఇపుడు రెండు చేతలుతో ఒక టవల్‌ను రెండు వైపులా పట్టుకొని స్వింగ్ చేయాలి. కనీసం 2 నిమిషాలు చేయాలి. సౌలభ్యాన్ని ఈ సమయాన్ని పెంచుకోవచ్చు.రేడియో టైసో..కాళ్లు, చేతులు వేగంగా కదిలిస్తూ, శరీరాన్ని ముందుకు, వెనక్కి వంచుతూ వ్యాయామాలు చేస్తారు. ఇవి వివధ శరీర భాగాల్లోనే కాకుండా పొట్ట, నడుము చుట్టు ఉండే కొవ్వును అద్భుతంగా కరిగిస్తాయి. లంగ్ అంట్ టో టచ్కుడి కాలిని మడిచి, ఎడమ కాలిని సాధ్యమైనంత ముందుకు చాపాలి. కుడిచేత్తో కుడి కాలి తొడమీద సపోర్టు తీసుకుని, నడుమును వంచి ఎడమచేతితో ఎడమ కాలి బొటన వేలి తాకాలి. ఇలా విరామం తీసుకుంటూ ఇలా రెండువైపులా చేయాలి.హూలాహూప్నడుము చుట్టూ ఒక పెద్ద రింగ్ ధరించి హూలాహూప్ వర్కౌవుట్ చేస్తారు. పొట్ట భాగంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. కాళ్లు, చేతులు, కోర్ కండరాలు ధృడంగా తయారవుతాయి.నోట్: క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేయడం కాదు. శరీరం సమతుల్యంగా, ఫిట్‌గా ఉండటానికి కూడా దోహదం చేస్తాయి. ఇండోర్ వర్కౌట్స్, ఔట్‌డోర్ వర్కౌట్స్‌తో కొవ్వులను సులభంగా కరిగించుకోవచ్చు. అయితే కొంత మందికి కొన్ని ఆరోగ్య పరిస్థితులు, వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు, జీవనశైలిగా కారణంగా అనుకున్నంత సులువు కాకపోవచ్చు. దీనికి వైద్య నిపుణుల సలహాలను తీసుకోవాల్సి ఉంటుంది. -
నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్‌ని కరిగించే బెడ్‌టైమ్ 'టీ'..!
చాలామంది బానపొట్టతో ఇబ్బంది పడుతుంటారు. ఏ డ్రెస్ వేసుకోవాలన్న ఇబ్బెట్టుగా ఈ పొట్ట కనిపిస్తుంది. దీన్ని తగ్గించుకోవడం కూడా అంత ఈజీ కాదు. కాస్త శారీరక శ్రమతో పట్టుదలతో కష్టపడితే బెల్లీఫ్యాట్ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు జస్ట్ ఈ టీతో నిద్రపోతున్నప్పుడే ఈ ఫ్యాట్‌ని కరిగించేసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు ఖ్యాతీ రూపానీ. రాత్రిపూట చిరుతిళ్లకు బదులుగా ఈ బొడ్డు బస్టింగ్ టీని సేవించడం మేలని అన్నారు. ఇంతకీ ఏంటా 'టీ'? అదెలా తయారు చేస్తారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఈ టీ కోసం..వాము, సొంపు గింజలు: వాము శరీంలోని అధిక నీటి శాతాన్ని తగ్గించి, పొట్ట ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది. ఇక సొంపు జీర్ణక్రియకు, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.పసుపు: ఇది ప్రసిద్ధ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పవర్‌హౌస్. ఇది శరీర కొవ్వుని నియంత్రించడంలో సమర్ధవంతంగా ఉంటుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. పైగా పరోక్షంగా బరువుని కూడా తగ్గిస్తుంది. ధనియాలు: ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి, జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతాయి. ఇది కూడా బరువు నిర్వహణకు ఉపయోగపడుతుంది. తయారీ విధానం: టేబుల్ స్పూన్ వాము, సొంపు తీసుకోవాలి. దీనికి 1/4 టీస్పూన్ తాజా పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర గింజలను జోడించాలి.ఆ తర్వాత 500-600 ml నీరు పోసి స్టవ్‌పై బాగా మరిగించాలి. 15 నిమిషాల తర్వాత వడకట్టి వేడివేడిగా ఆస్వాదించాలి. ప్రయోజనాలు..హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా PCOS, అడెనోమయోసిస్ సమస్యలకు చెక్ పెడుతుంది. జీవక్రియ, ఇన్సులిన్ పనితీరును మెరుగ్గా ఉంచుతుందిబరువు నిర్వహణకు ఉపయోగపడుతుందిమంచి నిద్రను ప్రోత్సహిస్తుందినిద్రవేళల్లో ఈ టీని ఆరోగ్యకరంగా తయారుచేసుకుని తాగితే బెల్లీఫ్యాట్ కరగడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని పోషకాహారనిపుణురాలు ఖ్యాతీ రూపానీ చెబుతున్నారు.(చదవండి: అన్నం సయించనప్పుడు ఇలా తీసుకుంటే మేలు..!) -
ఈ వర్కౌట్లతో బెల్లీ ఫ్యాట్ మాయం..! సన్నజాజి తీగలా నడుము..
చాలామంది మహిళలు బెల్లీఫ్యాట్‌తో ఇబ్బంది పడుతుంటారు. ప్రసవానంతరం లేదా ఒబెసిటీ కారణంగానో బానపొట్టలా నడుము, పొట్ట మధ్య గ్యాప్ లేనివిధంగా కలిసిపోయినట్లుగా ఉంటుంది. దీంతో నలుగురులోకి వచ్చినప్పుడూ కాస్త ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఈ సమస్యను జస్ట్ ఈ నాలుగు వ్యాయమాలతో చెక్ పెట్టొచ్చంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిధి శర్మ ఓ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో తాను ఆ వ్యాయమాలతో సుమారు 20 కిలోల బరువు తగ్గినట్లు పేర్కొంది. ఇంతకీ ఏంటా వర్కౌట్లు అంటే..రిధి శర్మ పొట్టప్రాంతంలో పేరుకునే అధిక కొవ్వు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం అని అంటోంది. ఆ ప్రాంతంలో సెల్యూట్ అనే కొవ్వుని తగ్గించుకోవడానికి ఈ వ్యాయామాలు తప్పక సహాయపడతాయని చెబుతోంది. తాను ఆ వర్కౌట్ల తోనే బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోగలిగానని అంటోంది. అంతేగాదు తన నడుము కొలతల్లో కూడా మంచి మార్పులు చూశానని చెబుతోంది. వారానికి కనీసం నాలుగు నుంచి ఐదు సార్లు చేయడం వల్లే మంచి ఫలితాలను పొందినట్లు పేర్కొంది. కనీసం నాలుగు నుంచి ఐదు వారాలు క్రమంతప్పకుండా చేస్తేనే ఇదంతా సాధ్యమని నమ్మకంగా చెబుతోంది రిధి. చేయాల్సిన యామాలు..అబ్ హోల్డ్: దీన్ని నేలపై వేయాలి. ఇది తల కాళ్లు దగ్గరకు వస్తున్నట్లుగా వంచడం. ప్లాంక్ ట్విస్ట్: ఇది వెన్నెముకకు మద్దతు ఇచ్చేలా కోర్ కండరాలను బలపరుస్తుందివీ సైకిల్స్: నేలపైకూర్చొని కాళ్లను సైకిల్ తొక్కుతున్నట్లుగా కదపాలిలెగ్ డ్రాప్: ఇది నేలపై పడుకుని కాళ్లను సైకిల్ తొక్కుతున్నట్లుగా చెయ్యాలి. దీంతోపాటు రోజుకి ఎనిమిది వేల నుంచి పది వేల వరకు అడుగులు వేసేలా వాకింగ్ చేయాలి. భోజనంలో 20 నుంచి 25 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూడాలిప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటంరాత్రి ఏడు గంటలకు లోపే డిన్నర్ పూర్తి చేయడంసుమారు ఏడు నుంచి 8 గంటల వరకు నిద్ర పోవడంతదితరాలను పాటిస్తే బెల్లీఫ్యాట్ తగ్గడమే గాక ఆరోగ్యంగా ఉంటారని చెబుతోంది రిధి శర్మ. View this post on Instagram A post shared by Ridhi Sharma | Fitness & Lifestyle (@getfitwithrid)గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులను లేదా వైద్యులను సంప్రదించి పాటించటం ఉత్తమం. (చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే : ఒకరు పొడగరి, మరొకరు అత్యంత పొట్టి..) -
కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి!
శరీరం బరువు ఉండాల్సినంతే ఉన్నప్పటికీ పొట్ట పెద్దగా ముందుకు వచ్చి కనిపిస్తుంటే అది కాస్తంత ప్రమాదకరమైన కండిషన్ అని గుర్తుంచుకోవాలి. ఇదెంత ప్రమాదకరం, పొట్టను ఏ మేరకు తగ్గించుకోవాలి అనే విషయాలు ఓ టేప్ సహాయంతో తెలుసుకోవచ్చు. ఇలా కొలిచే సమయంలో పొట్టను బొడ్డుకు ఒక అంగుళంపైనే కొలవాలి. ఆ కొలతకూ, పిరుదుల కొలతకు నిష్పత్తిని లెక్కగట్టాలి. అంటే నడుము కొలతని హిప్ కొలతతో భాగించాలి. అదెప్పుడూ ఒకటి కంటే తక్కువగానే (అంటే జీరో పాయింట్ డెసిమల్స్‌లో) వస్తుంది. సాధారణంగా నడుము కొలత, హిప్స్ భాగం కొలత కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. సాధారణంగా మహిళల్లో ఈ కొలత విలువ 0.85 కంటే తక్కువగా ఉండాలి. పురుషులకు ఇది 0.9 కంటే తక్కువగా రావాలి. ఈ నిష్పత్తినే డబ్ల్యూహెచ్ఆర్ (వేయిస్ట్ బై హిప్ రేషియో) అంటారు. పైన పేర్కొన్న ప్రామాణిక కొలతల కంటే ఎక్కువగా వస్తే ... అంటే... ఈ రేషియో విలువ... మహిళల్లో 0.86 కంటే ఎక్కువగానూ, పురుషులలో 0.95 కంటే ఎక్కువగా ఉంటే అది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తుంచుకోవాలి. అలా కొలతలు ఎక్కువగా ఉన్నాయంటే వారికి ‘అబ్డామినల్ ఒబేసిటీ’ ఉందనడానికి అదో సూచన. దీన్నే సెంట్రల్ ఒబేసిటీ అని కూడా అంటారు. (స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!)ఇలా అబ్డామినల్ ఒబేసిటీ లేదా సెంట్రల్ ఒబేసిటీ ఉన్నవారికి గుండెసమస్యలు / గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ నిష్పత్తి (వేయిస్ట్ బై హిప్ రేషియో) ఉండాల్సిన ప్రామాణిక విలువల కన్నా ఎక్కువగా ఉన్నవారు వాకింగ్ లేదా శరీరానికి మరీ ఎక్కువ శ్రమ కలిగించని వ్యాయామాలతో పొట్ట చుట్టుకొలతను (పొట్టని) తగ్గించుకోవడమన్నది గుండెకూ, ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. ఇదీ చదవండి: పెళ్లైన ఇన్నాళ్లకు, ఇంటిపేరు మార్చుకున్న అలియా -
బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఉరుగుల పరుగుల జీవితం. ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో కూడా పట్టించుకోని పరిస్థితి. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనకు తోడు, పొట్ట, పిరుదుల్లో బాగా కొవ్వు చేరడం, ఊబకాయం వెరసి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అన్నింటికంటే బెల్లీ ఫ్యాట్ అనేది తీవ్ర సమస్యగా పరిణమిస్తోంది. అధిక బరువు లేదా పొట్ట పెరగడానికి గల కారణాలను తెలుసుకుందాం!పౌష్టికాహారం లోపించడం, సమయానికి భోజనం చేయకపోవడం, ఒకేచోట గంటలతరబడి కూర్చోడం, ఆఫీసులో ఎక్కువసేపు కూర్చోని పని చేయడం వంటి అలవాట్లు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. హార్మోన్లు, ఆహారం, వివిధ కారకాలు పొత్తికడుపు కొవ్వును ప్రభావితం చేస్తాయి. ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా లభించే ఆహారాలు కాకుండా కొవ్వు, సుగర్ ఎక్కువగా పదార్థాలను తీసుకోవడం. వీటన్నింటితోపాటు జీవనశైలి విషయంలో కొన్ని తప్పులు కూడా బరువు పెరిగేందుకు కారణం అవుతున్నాయి.రోజులో అతి కీలకమైన అల్పాహారం మానేయడం ఒక కారణం. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మీ జీవక్రియ దెబ్బతింటుంది. మీ బరువు తగ్గాలంటే అల్పాహారం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. అల్పాహారం రాజులా , మధ్యాహ్న భోజనం యువరాజులా , రాత్రి భోజనం పేదలా తినాలి అనేది పెద్దల మాట.సమయానికి తినకపోవడం పెద్ద తప్పు అయితే, ఇష్టం వచ్చినట్టు ఉపవాసాలు ఉండటం మరో తప్పు. సమయం ప్రకారం తినడంతోపాటు ప్రొటీన్, ఫైబర్‌తో నిండిన ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. భోజనానికి, భోజనానికి మధ్యలో పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి భోజనంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు కాకుండా, ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి. దీంతో జీర్ణక్రియ సులభమవుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. రాత్రి భోజనం చేసిన నిద్రకు ఉపక్రమించడం కూడా పొత్తికడుపు కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. రాత్రి భోజనం తరువాత కనీసం 10-20 నిమిషాల నడక అటు జీర్ణక్రియకు, ఇటు బరువు నియంత్రణకు సాయపడుతుంది.వీటన్నింటి కంటే ప్రధానమైంది. తగినంత నిద్ర పోవడం ఆరోగ్యానికి కీలకం. మనిషి రోజుకు 6-7 గంటల నిద్ర అవసరం. తగినంత నిద్ర పోనివారు రోజువారీ ఎక్కువ కేలరీలు తీసుకుంటారని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. సరిపడినన్ని నీళ్లు తాగడం కూడా చాలా కీలకం. అలాగే ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. వాకింగ్, జాకింగ్, యోగా లాంటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే బెల్లీ ఫ్యాట్‌కు దూరంగా ఉండటమేకాకుండా, మంచి ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది.నోట్: ఇవి కేవలం అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. వేరే ఇతర అనారోగ్య కారణాలతో కూడా పొట్ట పెరిగే అవకాశం ఉంది. ఈ తేడాను గమనించి సరైన వైద్య పరీక్షలు చేయించుకొని, చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
పొట్ట తగ్గాలంటే.. జిమ్‌కే వెళ్లాలా? ఏంటి?
నేటి ఆధునిక శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. దీనికితోడు జీవనశైలిలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి కారణంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవడానికి ఉపవాసాలున్నా, జిమ్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతున్న వారిని చూస్తూ ఉంటాం. అలాగే ఏం తిన్నా ఇక్కడికే.. అంటూ హీరోయిన్ సమంతా తరహాలో అద్దముందు నిలబడి డైలాగులుకొట్టే అమ్మాయిలు కూడా చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో జిమ్‌కెళ్లకుండానే, ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో, ఊబకాయం, బెల్లీ ఫ్యాట్, ఫ్యాటీ బటక్స్ సమస్యకు చెప్పవచ్చు.గంటల తరబడి ఒకే చోట కూర్చుంటే గండమే!గంటల తరబడి టీవీలకు అతుక్కు పోకూడదు. పనిలో పడి అలాగే 8 నుంచి 10 గంటల పాటు కూర్చుని పని చేయకూడదు. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకుపోతోంది. అలాగే కడుపు ఉబ్బరం వస్తుంది. కాబట్టి ప్రతి గంటకు 5 నిమిషాలు విరామం తీసుకోవాలి. మెట్లు ఎక్కడం, గుంజీలు తీయడం లాంటివి చేయాలి. దీంతో అవయవాలకు రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది క్రమం తప్పకుండా వ్యాయామంఉదయం, సాయంత్రం లేదా మీకు వీలైన సమయంలో వేగంగా నడవడం, జాగింగ్, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ తప్పకుండా చేయాలి. స్నేహితులతో కలిసి మీకు నచ్చిన గేమ్స్ (క్రికెట్, టెన్నిస్, కబడ్డీ,ఇ తర) అవయవాలు పూర్తిగా కదిలేలా ఆడండి. శరీరమంతా చెమట పట్టేదాకా శ్రమిస్తే బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటికి పోతాయి.ఎముకలు, కండరాలు బలతంతా తయారవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అతి ముఖ్యమైన డీ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.తగినన్ని నీళ్లు, కంటినిండా నిద్ర: వ్యాయామం చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. ఇది ఆకలిని తగ్గిస్తుంది , బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. నీటిని తాగడం వల్ల పొట్ట, పొత్తికడుపు కొవ్వు తగ్గుతుంది. చక్కటి నిద్ర కూడా మన బరువును ప్రభావితం చేస్తుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం.ఫైబర్ రిచ్ ఫుడ్స్: శరీర బరువు నియంత్రణలో ఉండాలంటే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. బరువు పెరగడం గురించి ఆందోళన మానేసి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి, ఈ రకమైన ఆహారాన్ని తినడం వల్ల మీ కడుపు చాలా సేపు నిండుగా ఉంటుంది. అలాగే రాత్రి 7 గంటల లోపు డిన్నర్ కంప్లీట్ చేయాలి. బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.ఇంకా: ఒకేసారి కడుపు నిండా.. ఇక చాలురా బాబూ అనేంతగా తినవద్దు. అలాగే మైదాతో తయారుచేసిన పదార్థాలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మద్యం, ధూమమానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. పొట్ట, పిరుదులు, పిక్కలు, భుజాలు లాంటి ప్రదేశాల్లో కొవ్వును కరిగించుకునేందుకు నిపుణుల సలహా మేరకు కొన్ని స్పాట్ రిడక్షన్ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. యోగాలో కూడా ఇందుకోసం మంచి ఆసనాలు ఉన్నాయి. వాటినా ప్రాక్టీస్ చేయవచ్చు. నిజంగా వీటిని చిత్తశుద్ధిగా ఆచరిస్తే వారంలో బరువు తగ్గడం ఖాయం.నోట్: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే అని గమనించగలరు. ఏదైనా అనారోగ్య సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
దాల్చిన చెక్కతో ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ నిజంగా తగ్గుతుందా?
సకల రోగాలకు మూలం ఒబెసిటీ. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువుంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే అధిక బరువును తగ్గించుకునేందుకు చాలామంది నానా కష్టాలు పడుతూ ఉంటారు. జీవనశైలి మార్పులు, ఆహారఅలవాట్లుమార్చుకోవడంతోపాటు, కొన్ని ప్రత్యేక పదార్థాలను కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో బాగా వినిపిస్తున్నది దాల్చిన చెక్క. శరీరంలో కొవ్వును కరిగించడానికి దాల్చిన చెక్క నీరు, కషాయం, టీ బాగా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుందని నమ్ముతారు. దాల్చిన చెక్క ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఇన్సులిన్కుసరిగ్గా పనిచేసేలా చేస్తుంది. కొన్ని అధ్యయనాలు దాల్చినచెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కూడా సూచిస్తున్నాయి.దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ముఖ్యంగా దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీంలోని మలినాలను బయటకు పంపుతాయి. దాల్చిన నీరు తాగడం వల్ల శరీరం మెటబాలిజం పెరుగుతుంది. దీంతో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కగా పని చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం దాల్చిన చెక్క నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గొచ్చు.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ త్వరగా కరుతుంది. ఫలితంగా స్థూలకాయం, అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఈ వాటర్ తాగడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.దాల్చిన చెక్కలో అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు వాపు తగ్గించడం ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ, వార్మ్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఇన్ఫెక్షన్లను నిర్వహించడంలోసహాయపడుతుంది. గవద జ్వరం వంటి అలర్జీ సమస్యల నివారణలో దాల్చిన చెక్క ఉపయోగ పడుతుంది. పురుషులలో అంగస్తంభన సమస్యతోపాటు, స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు పని చేస్తుంది. నోట్: అందరికీ ఈ చిట్కా మనచేస్తుందని చెప్పలేం. కానీ కచ్చితంగా కొన్ని ప్రయోజనాలు న్నాయి. అయితే ఆరోగ్యకరమైన జీవన శైలి, క్రమం తప్పని, వ్యాయామం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయిని మాత్రం మర్చిపోకూడదు. -
ఈ చైర్లో కూర్చొంటే..దెబ్బకు బెల్లీ ఫ్యాట్ మాయం!
శరీరంలో ఏ భాగం పెరిగినా.. తగ్గినా పెద్దగా తేడా ఉండదు కానీ పొట్ట, నడుము దగ్గర కొవ్వు చేరితే మాత్రం మొత్తం శరీరాకృతే మారిపోతుంది. అందుకే మొదట పొట్ట తగ్గించుకోవాలి అనుకునేవారు.. ఇలాంటి బ్యాలెన్స్ చైర్‌ని ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ వ్యాయామ పరికరం.. నడుము, తొడభాగాలను తగ్గించడంతో పాటు ఉదర కండరాలను దృఢంగా మారుస్తుంది. దీనిపై కూర్చున్నప్పుడు అటూ ఇటూ ఒరిగేందుకు వీలుగా రూపొందింది ఇది. దీని కింద అమర్చుకోవడానికి ఒక గుండ్రటి రింగ్ కూడా లభిస్తుంది. అలాగే ఇరువైపులా సపోర్టింగ్ కోసం హ్యాండిల్స్ ఉంటాయి. నిజానికి ఆ హ్యాండిల్స్ లేకుండా కూడా ఇందులో కూర్చుని బాలెన్స్ చేసుకోవచ్చు. ఈ చైర్లో కూర్చుని.. ప్రతిరోజూ వ్యాయామం చేసినట్లయితే.. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. శరీర సౌష్టవాన్ని సంరక్షించుకోవచ్చు. ఈ చైర్స్ మార్కెట్లో రెడ్, బ్లాక్, బ్లూ, పింక్, ఆరెంజ్ వంటి రంగుల్లో దొరుకుతున్నాయి. ధర 152 డాలర్లు. అంటే 12,647 రూపాయలు. (చదవండి: ఇంట్లోనే ఈజీగా మసాజ్ చేయించుకోవచ్చు ఇలా..!) -
సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో వైరల్.. సిక్స్ ప్యాక్ ఫేక్ అని ట్రోలింగ్
Salman Khan Brutally Trolled After Netizens Notice His Tummy: సోషల్ మీడియాలో నెటిజన్లు చాలా స్మార్ట్ అని ఇప్పటికీ చాలా సార్లు నిరూపించారు. సెలబ్రిటీల రోజువారీ పనులపై నిఘా పెట్టే వీరు టాప్ టు బాటమ్ ప్రతీది గమనిస్తూ ఉంటారు. ఏదైనా చిన్న పొరపాటుతో తారలు దొరికారంటే చాలు ట్రోలింగ్‌తో ఆటాడేసుకుంటారు. ఇటీవలే బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆటో రిక్షా నడిపి ట్రోలింగ్ బారిన పడ్డాడు. తాజాగా మరోసారి నెటిజన్ల కామెంట్లకు చిక్కాడు ఈ చుల్బుల్ పాండే. సల్మాన్ సినిమాలోని ఒక పాటపై సల్లు భాయ్ స్టెప్పులేసిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో డ్యాన్స్ చేస్తున్న సల్మాన్ ఖాన్‌పై తెగ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్స్. సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటి దబాంగ్. ఈ సిరీస్‌లో వచ్చిన దబాంగ్ 2 చిత్రంలోని పాండేజీ సీటి అనే పాటకు సల్మాన్ భాయ్ స్టెప్పులేశాడు. ఇది ఇటీవల ముగిసిన దబాంగ్ టూర్ కోసం బ్యాక్ డ్యాన్సర్లతో కలిసి డ్యాన్స్ స్టెప్పులను రిహార్సల్స్ చేస్తున్నట్లుగా ఉంది. ఈ డ్యాన్స్ చేస్తుండగా భాయిజాన్ పొట్ట బయటకు వస్తుండం గమనించారు నెటిజన్లు. దీంతో సోషల్ మీడియాలో సల్మాన్‌కు పొట్ట ఉందని ఎత్తి చూపుతున్నారు. 'ఇటీవలి విడుదలైన అంతిమ్ సినిమాలో సల్మాన్ సిక్స్ ప్యాక్ బాడీ ఫేక్ అని ఈ వీడియో చెబుతుంది' అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు. 'ఓ మై గాడ్ అతనికి పొట్ట' అని ఒక ఫ్యాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. 'భాయ్ సిక్స్ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అయింది' 'అందమైన పొట్ట' 'అరే భాయ్ మీ పొట్ట నా పొట్ట లానే ఉంది' 'వీఎఫ్ఎక్స్తో భాయ్ సిక్స్ ప్యాక్ చూపిస్తున్నారు' అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) ఇదీ చదవండి: అలియా భట్ నవ్వు.. నెటిజన్ల ట్రోలింగు.. -
Belly Fat: క్యారెట్, మెంతులు, జామ, బెర్రీస్.. కొవ్వు, బరువు రెండూ తగ్గుతాయి!
Belly Fat: పొట్ట, బరువు తగ్గి, చక్కగా స్లిమ్‌గా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అలా తగ్గేవారు మాత్రం తక్కువే. కారణం... తగ్గడానికి సరైన ఆహారాన్ని ఎంచుకోకపోవడం, ఒకవేళ ఎంచుకున్నా, ఆ నియమాలను పాటించకపోవడం. కొన్ని వ్యాయామాలు పొట్టలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి, కానీ కేవలం వ్యాయామం మాత్రమే చేయడం వల్ల లేదా కేవలం ఆహార నియమాలు మాత్రమే పాటించడం వల్ల పొట్ట తగ్గదు. ఆహార నియమాలతోపాటు వ్యాయామాలు కూడా చేయాలి. అప్పుడే ప్రయత్నంలో సఫలమవుతాం. ఆ మార్గాలేమిటో చూద్దాం. చలికాలంలో మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతాం. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి. కఠిన వ్యాయామాలతో శరీరాన్ని శిక్షించడానికి మనసు ఒప్పుకోదు. అలాగే ఈ శీతాకాలంలో ఫ్రైలు, మసాలాలు, కరకరలాడే చిరుతిళ్లు తినాలని మనసు తహతహలాడుతుంది. అయితే బరువు తగ్గాలన్నా, పొట్ట తగ్గి ఫిట్‌గా కనిపించాలన్నా వీటికి బదులుగా పోషకాలు ఉండే తాజా ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. ఉదయానే నిద్రలేవడం: కొన్ని అధ్యయనాల ప్రకారం తేలిందేమంటే ఆలస్యంగా నిద్ర లేవడం బరువు పెరిగేందుకు దోహదం చేస్తుంది. అందువల్ల వీలైనంత వరకు తొందరగా నిద్ర లేవడం మంచిది. రన్నింగ్ : రోజూ ఉదయమే రన్నింగ్ చేయడం చాలా మంచిది. దీని వల్ల త్వరగా ఫలితాలు వస్తాయి. త్వరగా కొవ్వు తగ్గడానికి రన్నింగ్ బాగా ఉపయోగపడుతుంది. రన్నింగ్ చేయలేకపోతే కనీసం వేగంగా నడవడం మంచిది. దీనివల్ల త్వరగా బరువు తగ్గుతారు. క్యారెట్: క్యారెట్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. కాబట్టి వాటిని స్మూతీ, సలాడ్, జ్యూస్‌గా తినవచ్చు. మీ డైట్ చార్ట్‌లో క్యారెట్లను చేర్చండి, ఇది మీ బరువును సమర్థవంతంగా తగ్గిస్తుంది. మెంతులు: సహజంగా రక్తంలో చక్కెర స్థాయులను మెరుగుపరచడంలో మెంతులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మధుమేహం ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఔషధం. ఈ ప్రత్యేక ఔషధ గుణాలు మీ జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఆహార పానీయాలలో మొలకెత్తిన మెంతులను ఉపయోగించడం మంచి ఫలితాలనిస్తుంది. జామ: పేదల యాపిల్‌గా పేరుగాంచిన జామకాయకు అనేక వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. ఇది చలికాలంలో పుష్కలంగా లభించే పండు. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు జీర్ణవ్యవస్థను సమర్థవంతంగా మెరుగుపరుస్తుంది. అలాగే, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బెర్రీస్: బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచివి. బెర్రీలు తినడం ద్వారా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోతుంది. బెర్రీల్లో చాలా రకాలుంటాయి. అన్నిరకాల బెర్రీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ వంటి వాటిని ఉదయం లేచిన వెంటనే తినడం మంచిది. వేపుళ్లు, పాక్డ్ ఫుడ్ వద్దు: ఆయిల్‌తో డీప్ ఫ్రై చేసి తయారు చేసే ఆహారపదార్థాలను తినకండి. ఆయిల్‌తో తయారు చేసే పదార్థాలను తినడం వల్ల కొవ్వు పేరుకు పోతుంది. అలాగే గుండె జబ్బులకు గురవుతారు. అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల ఆయిల్స్‌తో తయారు చేసిన ఆహారపదార్థాలను తినకండి. వివిధ ధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్: మనకు మార్కెట్లో తెల్లగా నిగనిగలాడే బ్రెడ్ దొరుకుతూ ఉంటుంది. అయితే దాన్ని తినకపోవడం మంచిది. కొన్ని రకాల బ్రెడ్ లు గోధుమ రంగులో ఉంటాయి. అలాంటి బ్రెడ్ తినడం మంచిది. వీటిలో న్యూట్రిషన్ ఎక్కువగా ఉంటుంది. మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడానికి, అసలు కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు ఈ బ్రెడ్ ఉపయోగపడుతుంది. చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే.. -
కందిరీగ నడుము కావాలా.. ఫ్యాటీ బెల్లీకి చెక్ చెప్పండిలా
సాక్షి, హైదరాబాద్: ఓవర్ వెయిట్, ఫ్యాటీ బెల్లీ ఇపుడివే చాలామందిని వేధిస్తున్నపెద్ద తలనొప్పి. మారుతున్న జీవన శైలి, కనీస వ్యాయామం లేకపోవడం, కంప్యూటర్‌కు అతుక్కుపోయే ఉద్యోగాలతో ఊబకాయానికి తోడు పొట్ట, నడుం చుట్టూ కొవ్వు పేరకుపోయి పెద్ద సమస్యగా మారిపోతోంది. దీంతో వయసుతో నిమిత్తంలేకుండా కుండలాగాపెరిగిన పొట్ట ముందుకొచ్చి మరీ వెక్కిరిస్తోంది. అంతేనా నచ్చిన డ్రెస్ వేసుకోవడానికి లేదు. బాడీషేప్ మారిపోయి అందవికారంగా ఉన్నామనే ఇన్ఫీరియారిటి. మరి ఈ సమస్యల్నింటికి పరిష్కారం ఏమిటో తెలియాలంటే.. స్లిమ్ అండ్ ట్రిమ్గా ఉండాలంటే ఈ వీడియో చూడాల్సిందే.. -
Weight Loss Tips: కందిరీగ నడుము కావాలా.. ఫ్యాటీ బెల్లికీ చెక్ చెప్పండిలా
-
కూరగాయలతోనే పొట్ట తగ్గించుకోండి
► కొంతమందికి పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోయి చూడటానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అయితే కూరగాయలతోనే ఈ కొవ్వును తగ్గించుకోవచ్చు. ► కొవ్వును కరిగించేందుకు గుమ్మడి కాయ తీసుకోవడం మంచిది. మంచి గుమ్మడితో కూర చేసుకుని తినడం, బూడిద గుమ్మడి జ్యూస్ చేసుకుని తాగడం మంచి ఫలితాలనిస్తుంది. ► ఆహారంలో పచ్చి మిరపకాయలను విరివిగా వాడటం ద్వారా కూడా కొవ్వు కరుగుతుందని నిపుణుల మాట. ► కాలీఫ్లవర్, క్యాబేజీలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వీటిలో ఉండే పీచు పదార్థాలు పొట్ట పెరగడాన్ని ఆరోగ్యంగా అరికడతాయి. ► అదేవిధంగా వారానికి రెండు మూడు సార్లు పుట్టగొడుగులు తీసుకోవడం కూడా కొవ్వు కరిగించడానికి తోడ్పడుతుంది. పుట్టగొడుగుల్లో ఉన్న ప్రోటీన్లు మన శరీరంలో మెటబాలిజంను బాగా పెంచుతాయి. దీంతో కొవ్వు బాగా కరుగుతుంది. ► ఎక్కువ మోతాదులో ఆకుకూరలు తీసుకోవడమూ శరీరంలోని అదనపు కొవ్వు ను కరిగించడానికి తోడ్పడుతుంది. ఇక్కడ చదవండి: ఫోడ్మ్యాప్ ఆహారం అంటే..? ఈ ఆహారంతో అస్తమాకు చెక్! -
ఈ బెల్ట్ వేస్తే బెల్లీ ఫ్యాట్ మాయం!
‘చక్కనమ్మ చిక్కినా అందమే’ అనేది పాత సామెత. ‘చిక్కినమ్మే చక్కనమ్మ’ ఇది లేటెస్ట్ ట్రెండ్. నిజానికి ఎవరైనా సరే.. సన్నగా, సరైన కొలతలతో ఉంటే.. మిగతాదంతా మేకప్‌తో, క్రేజీ డ్రెస్‌లతో కవర్ చేసేసుకోవచ్చు. అందుకే లావుగా, బొద్దుగా కనిపించే కంటే.. స్లిమ్‌గా, జీరో సైజ్ మెయిన్టైన్ చెయ్యడానికే ఇష్టపడుతుంటారు అమ్మాయిలు. అలాంటి వారి కోసమే ఈ స్లిమ్మింగ్ బెల్ట్. ఇది ఆకర్షణీయమైన ఆకృతిని అందిస్తుంది. ఈ ఫిట్నెస్ బెల్ట్ కొవ్వు ఉన్న శరీరభాగాలకు చుట్టుకుంటే.. అధిక ఫ్రీక్వెన్సీ మసాజ్ వైబ్రేషన్‌తో, తేలికపాటి హీట్‌తో.. కొవ్వును సమర్థవంతంగా తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా పొట్ట, నడుము భాగాల్లో కొవ్వుని పూర్తిగా కరిగిస్తుంది. లేటెస్ట్ ఎలిప్టికల్ స్వింగింగ్ మసాజ్ టెక్నాలజీతో రూపొందిన ఈ ప్రొడక్ట్.. బరువు తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. శారీరక వ్యాయామంలానే.. భుజం, తొడలు, వీపు భాగం, చేతులు ఇలా కొవ్వు పేరుకున్న ప్రదేశాల్లో ఈ బెల్ట్‌ను చుట్టుకుని రోజుకు పది నిమిషాలు ఉంచితే చాలు. బెల్ట్ ముందు భాగంలో రెడ్, గ్రీన్ బటన్స్ ఉంటాయి. బెల్ట్‌ని బాడీకి కావాల్సిన విధంగా అడ్జెస్ట్ చేసుకునే వీలుంటుంది. దీనికి కనెక్ట్ చేసుకునేందుకు హైక్వాలిటీ రిమోట్ ఉంటుంది. దానిలో ఆన్/ఆఫ్ బటన్‌తో పాటు టైమర్ బటన్, ఆటో 1,2,3 అనే మోడ్స్, మాన్యువల్ బటన్ వేర్వేరుగా ఉంటాయి. 5 నిమిషాలు, 8 నిమిషాలు, 10 నిమిషాలు, 12 నిమిషాలు అని నాలుగు టైమింగ్ బటన్స్ ఉంటాయి. ఫంక్షన్, స్ట్రాంగ్, వీక్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఈ బెల్ట్‌కి ప్రత్యేకమైన చార్జర్ లభిస్తుంది. ఈ న్యూ టెక్నాలజీ బెల్ట్ ధర 52 డాలర్లు. అంటే 3,787 రూపాయలు. ఇలాంటి మోడల్స్ అదనపు సౌకర్యాలతో మార్కెట్లో చాలానే అమ్ముడుపోతున్నాయి. -
కీర్తి సురేశ్ కన్నా నేను అందంగా ఉన్నానట!
అధిక బరువు అనేది శారీరక సమస్యగా కనిపిస్తుంది. కానీ అది మనసును అనుక్షణం తొలిచివేస్తూ మానసిక రుగ్మతకు కూడా దారి తీస్తుంది. అయితే సినిమా వాళ్లు మాత్రం పాత్రకు తగ్గట్లు బరువు పెరుగుతుంటారు, తగ్గుతుంటారు. మహానటి కీర్తి సురేశ్ కూడా మిస్ ఇండియా చిత్రం కోసం బరువు తగ్గిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ అధిక బరువుతో బాధపడ్డ ఆమె సోదరి రేవతి సురేశ్ కోసం చెప్పుకుని తీరాల్సిందే. రేవతి కాస్త లావుగా ఉండటం వల్ల అందరూ ఆమెను అదోలా చూసేవారు. తల్లి, చెల్లి ఎలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావంటూ వెటకారంగా మాట్లాడేవారు. వాటన్నింటినీ మౌనంగా భరిస్తూ వచ్చిన రేవతి చివరకు బరువు తగ్గి సమాధానం చెప్పింది. "నా బరువు వల్ల ఎన్నో బాధలు అనుభవించాను. అమ్మ, చెల్లితో నన్ను పోలుస్తూ ఎగతాళి చేసేవారు. దానివల్ల నామీద నాకు నమ్మకం పోయింది. నేను వాళ్లలా అందంగా లేనని, నాలో ఏదో లోపముందని ఫీలయ్యేదాన్ని. జనాలు కూడా దాన్ని నేను బలంగా నమ్మేలా చేశారు. ఎంతలా అంటే, నా భర్త ప్రపోజ్ చేసినప్పుడు కూడా నాలో ఏముందని నన్ను ప్రేమించాడు అని భావించేంతలా.." View this post on Instagram A post shared by Revathy Sureshkumar (@revathysureshofficial) "ఒకావిడైతే మీ అమ్మ, చెల్లి అంత బాగున్నారు, నీకేమైంది ఇలా ఉన్నావు అని ముఖం పట్టుకుని అనేసింది. అద్దం ముందు నిలబడి నాలో ఏం లోపం ఉందని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఎందుకు నేను అందంగా లేనని అంతరంగాన్ని నిలదీశాను. ఒకానొక సమయంలో నన్ను నేను అసహ్యించుకున్నాను కూడా. సంతోషం అనేది నా దరిదాపుల్లోకి కూడా రాదనుకున్నాను. కానీ నా సోదరి నాకు అండగా నిలబడి నా బరువు గురించి ఎవరేం మాట్లాడినా తిప్పి కొట్టేది. తన కంటే నేనే అందంగా ఉన్నానని కీర్తి స్నేహితులు అన్నారని చెప్పగానే ఆ జోక్‌కు పెద్దగా నవ్వేశాను" అని చెప్పుకొచ్చింది. బరువు తగ్గడానికి ముందు, తర్వాత ఫొటోలను ఈ పోస్ట్‌కు జత చేసింది. ఈ ఫొటో చూసిన కీర్తి అభిమానులు రెండింటిలోనూ అందంగానే ఉన్నారంటున్నారు. చదవండి: దర్శకుడి వెంటపడి చితకబాదిన హీరోయిన్ సీఎం కేసీఆర్‌కు ఇచ్చే గిఫ్ట్ ఇదే : చిరంజీవి రఘుబాబు కూతురి ఎంగేజ్మెంట్లో స్టార్ల సందడి -
బెల్లీ ఫ్యాట్‌కు ఇలా చెక్ పెట్టండి..
అమ్మాయిలను ఎక్కువగా బాధించే విషయం బరువు, బెల్లీ ఫ్యాట్ (పొట్ట చూట్టు కొవ్వు పేరుకుపోవడం). దీంతో అధిక బరువుతో పాటు పొట్టను తగ్గించుకోవడానికి అమ్మాయిలు జిమ్‌లో గంటలు గంటలు కుస్తీ పడుతుంటారు. అయినప్పటికీ మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల పొట్ట చూట్టూ మళ్లీ కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీంతో ఎక్కువ సేపు కసరత్తులు చేయడం లేదా స్ట్రిక్ట్ డైట్‌తో నోరు కట్టేసుకుంటుంటారు అమ్మాయిలు. అయితే అలా చేయడం కూడా ఆరోగ్యానికి హానికరమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల జీవక్రియ, శరీరంలోని సమతుల్యతతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చిరిస్తున్నారు. అందుకని వర్కవుట్స్ చేయకుండానే మనకు వంటింట్లో అందుబాటులో ఉన్న సుగంధ ద్రవ్యాలతో మీ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇవి కొవ్వును తగ్గించమే కాకుండా జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయి. అంతేకాదు శరీరంలో ఇన్సులిన్‌ను సమతుల్యం చేసి ఆరోగ్యంగా ఉంచడంతో పాటు పొట్ట చూట్టూ పేరుకున్న చెడు కొవ్వును కరిగిస్తాయి. ఇక అవేంటో చుద్దాం రండి . (పదే పదే శానిటైజర్ వాడుతున్నారా?) మిరియాలు: ఇది శరీరంలో థర్మోజెనిక్ ప్రభావాలను పెంచుతుందని పరిశోధనలో తెలినట్లు ప్రముఖ పోషకాహార నిపుణులు సుమయ డాల్మియా తెలిపాడు. అంటే ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచడంతో పాటు కొవ్వును కూడా కరిగించడంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతేగాక జీవక్రియ రేటును కూడా వేగవంతం చేస్తుంది. మీ ఆహారంలో మిరియాలతో పాటు నిమ్మకాయను కూడా చేర్చండి. ఎందుకంటే నిమ్మకాయలోని సిట్రస్ మీ సిస్టమ్‌ను ఆల్కలీన్గా చేస్తుంది. శరీరంపై కారపు థర్మోజెనిక్ ప్రభావాలను సమతుల్యం చేస్తుంది. సోంపు గింజలు: ఇవి జీర్ణక్రియకు సహాయపడతంతో పాటు ఉబ్బుసం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దాల్చిన చెక్క: ఇది మీ ఇన్సులిన్, చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల పేరుకుపోయిన కొవ్వును విచ్చిన్నం చేస్తుంది. ఇంగువ: ఇది శరీరంలో అపానవాయువును తగ్గిస్తుంది. అపానవాయువును సృష్టించే ఆహారాన్ని జీర్ణం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీనిని తరచూ మీ ఆహారపు అలవాట్లలో దీనిని చేర్చుకోండని నిపుణులు సూచిస్తున్నారు. . ఆవ పిండి(గింజలు): ఇవి మీ ఆహారానికి సుగంధాన్ని ఇవ్వడమే కాకుండా కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. మెంతులు: ఇది ఆకలిని నియంత్రిస్తుంది. జంక్ ఫుండ్ తినాలన్న మీ ఆహార కోరికలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే మీ ఆహారంలో మెంతులను జోడించండి. పసుపు: ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో సహయపడుతుంది. కొవ్వును కరిగించడంలో సహయపడే హార్మోన్ లెప్టిన్‌ను మరింత విడుదల చేయడానికి జీవక్రియ ప్రక్రియలో అనుమతిస్తుంది. యాలకులు: ఇది ఉబ్బరం, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేసే మెలటోనిన్‌ను కూడా ప్రాసెస్ చేస్తుంది. యాలకులు శరీరంలో పేరుకుపోయిన చెడును కొవ్వును మూత్రవిసర్జన ద్వారా బయటకు పంపిస్తుంది. -
బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఈ ఒక్కటి చేస్తే చాలు
ఈ కాలం అమ్మాయిలను వేధిస్తోన్న ముఖ్యమైన సమస్య "బెల్లీ ఫ్యాట్". దీన్ని తగ్గించుకోవడానికన్నా కవర్ చేసుకోడానికే ఎక్కువ తంటాలు పడుతూ ఉంటారు. ఎక్కువగా తినడం లేదా ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అయితే పైసా ఖర్చు లేకుండా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును సులువుగా కరిగించేయొచ్చు. ఇంట్లోనే ఎంతో సులువైన "పవనముక్తాసనం" వేశారంటే సరిపోతుంది. పవనం అంటే గాలి, ముక్త అంటే తొలగించడం. పేగుల్లో పేరుకుపోయిన అపాన వాయువును తొలగిస్తుంది. కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయవచ్చు. ఎలా వేయాలి? ► ముందుగా నేలపై వెల్లకిలా పడుకోవాలి. ► దీర్ఘంగా శ్వాస పీల్చుకోవాలి. ► మోకాళ్లను రెండు చేతులతో పట్టుకుని చాతీ వరకు తీసుకురావాలి. మోకాలితో పొట్టను అదుముతూ శ్వాసను వదులుతూ చుబుకాన్ని మోకాళ్లకు తాకించాలి. ► ఈ స్థితిలో కొద్దిసేపటి వరకు ఉంటూ గాఢ ఉఛ్వాస, నిఛ్వాసలను తీసుకోవాలి. ► అనంతరం తిరిగి యధాస్థితికి వచ్చేయాలి. ► దీన్ని రెండు, మూడు సార్లు చేయాలి. ఉపయోగాలు: ⇒ కండరాలను బలపర్చడంతో పాటు బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది. ⇒ జీర్ణక్రియను మెరుగుపరుస్తూ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ⇒ పేగులు, ఇతర ఉదర అవయవాలకు మసాజ్ చేస్తుంది. ⇒ కీళ్లలో రక్తప్రసరణను మెరుగుపర్చుతుంది. ⇒ అధిక బరువును తగ్గిస్తుంది. ⇒ గ్యాస్ బయటకు వెళ్లిపోతుంది. నోట్: మహిళలు రుతుస్రావం, గర్భధారణ సమయంలో ఈ ఆసనం చేయరాదు. -
బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే ఇలా చేయండి
బెల్లి ఫ్యాట్.. ప్రతి ఒక్కరిలో కనిపించే సాధారణ సమస్య. పొట్ట చుట్టూ కొవ్వు బాగా పేరుకుపోవడం వల్ల ఇది ఏర్పడుతుంది. సమయానికి భోజనం చేయకపోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం, ఒత్తిళ్లతో కూడిన జీవితం, జంక్‌ఫుడ్ ఎక్కువగా తినడం. వ్యాయామం చేయకపోవడం ఇలాంటి కారణలతో ఈ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఓ వ్యక్తి, మహిళ చూడటానికి ఎంత అందంగా ఉన్నా తనకున్న బెల్లి ఫ్యాట్ ఆ అందాన్ని తగ్గిస్తుంది. లేదా ఆ అభిప్రాయాన్ని వెంటనే మార్చుతుంది. దీని నుంచి విముక్తి పొందాలనుకుంటే మాత్రం కొంచెం ఒళ్లు వంచి కాలరీలు కరిగించాల్సిందే. రోజూ ఉదయం అయిదు నిమిషాలు చేసే వ్యాయామం ద్వారా మనం బరువు తగ్గించవచ్చు అన్న విషయం మీకు తెలుసా.. లేదా కేవలం రెండు నిమిషాల పాటు చేసే వ్యాయామం మనలోని కొవ్వును అంతం చేస్తుందన్న విషయం తెలుసా.. అవునండి వాస్తవాలే. అలసటను తగ్గిస్తుంది. ఉదయం పూట చేసే వ్యాయామం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది నిద్రను మెరుగుపరుస్తుందని పరిశోధనలో రుజువైంది. దీనివల్ల బరువు, బెల్లి ఫ్యాట్ కూడా తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలసటను తగ్గించి రోజంతా మనకు ఉల్లాసాన్ని, శక్తిని అందిస్తుంది. అదే విధంగా మానసిక స్థితి మెరుగుదలకు దోహదపడి ఏకాగ్రతను పెంచుతుంది. ఈ వేళలో ప్రసరించే అల్ట్రా వయోలెట్ కిరణాలు ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికడతాయి. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నందునే ఉదయం వేళలో వ్యాయామం చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తారు. అయితే ఉదయం చేసే వ్యాయామం తమ ఫిట్నెస్ దినచర్యకు అనుగుణంగా ఉంటాలని నిపుణులు సూచిస్తున్నారు. (కరోనా: వర్క్ ఫ్రం హోం వాళ్లు ఇలా చేయండి!) బరువు తగ్గడానికి ఉదయం చేసే ఉత్తమ వ్యాయామాలు బెల్లి ఫ్యాట్, బరువు తగ్గేందుకు అయిదు నిమిషాలు రోజూవారి వ్యాయామం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇది నేర్చుకోవడం కూడా ఎంతో సులభం. ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఎక్కడైన చేయవచ్చు. దీన్ని సులభంగా దినచర్యలో భాగం చేయవచ్చు. ఇది బెల్లి ఫ్యాట్‌ను తగ్గించి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. 1.. పవర్ పుష్-అప్స్ జీవక్రియను పునరుద్ధరించడానికి, బరువు తగ్గడానికి అలాగే కండరాలను బలోపేతం చేయడానికి పుష్అప్స్ సహాయపడతాయి. ఉదయం పూట మీరు చేయగలిగే వ్యాయామాలలో ఇది ఉత్తమైనది. పవర్ పుష్-అప్స్ చేయడం వలన మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. బలమైన ఉదర కండరాలను నిర్మించడంలో ఇది సహాయపడుతుంది. పవర్ పుష్-అప్స్ ఎలా చేయాలి: ► తలక్రిందులుగా ఉన్న ‘V’ భంగిమలో ఉండి, మోకాళ్ళతో వంగి, నడుము వెనక భాగాన్ని పైకి ఉంచి ప్రారంభించండి. ► మీ చేతులను భుజం-వెడల్పు కంటే కొంచెం వెడల్పుగా ఉంచి ఫోటోలో చూపించినట్లు ఉంచండి. ► మీ మోకాళ్ళను వంచి, మీ మోచేతులను పూర్తి పుష్-అప్ స్థానంలో వంచినప్పుడు బరువును ముందుకు ఉంచడి. ► V భంగిమను కొనసాగిస్తూ, మొదట ప్రారంభించినట్లు నడుము వెనక భాగాన్ని పైకి అనండి. ► రెండు భంగిమల మధ్య ముందుకు వెనుకకు బౌన్స్ అవుతూ సుమారు 5 నిమిషాలు వీటిని చేయండి. జంపింగ్ జాక్స్ ఇతర కార్డియో వర్కౌట్ల మాదిరిగా, ఉదయపు వ్యాయామంలో దీని చేర్చడం వల్ల మంచి ఆరోగ్య ఫలితాను ఇస్తుంఇ. ఇది ఆరోగ్యకరమైన గుండెకు ఉపయోగపడుతుంది. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జంపింగ్ జాక్స్ ఎలా చేయాలి: ► మీ పాదాలతో నిటారుగా నిలబడండి. ►ఫోటోలో చూపించినట్టుగా ఒక్కసారిగా పైకి ఎగిరి మీ కాళ్లను కొంచెం దూరంగా విస్తరించడండి. మీ చేతులను మీ తలపైకి తీసుకువచ్చేటప్పుడు భుజం కంటే పైకి తీసుకురండి. ►మళ్లీ మీ చేతులను యధాస్థితికి తీసుకు వచ్చి, మీ కాళ్లను ఒకచోట చేర్చండి. ►ఒకవేళ మీకు ఈ వ్యాయామంలో అనుభవం ఉంటే తక్కువ వేగంతో చేయండి. ఇలా పదిసార్లు కొద్ది కొద్ది సమయం గ్యాప్‌తో చేయండి. ►దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి ప్రతిరోజూ ఈ వ్యాయామం కోసం నిర్ధిష్ట సమయాన్ని కేటాయించండి. కేవలం 10 నిమిషాలు అయినా సరిపోతుంది. ► ఒకవేళ ఉదయం ఈ వ్యాయామం చేయలేకపోతే ఫర్వాలేదు. సాయంత్రం అయినా మీరు ఈ దినచర్యను కొనసాగించండి. -
పొట్ట తగ్గాలా.. అయితే బంకమట్టి తింటే సరి..!
వేల ఏళ్లుగా మానవుడు ఏదో ఓ రూపంలో మట్టి తింటున్నాడు. అందుకే నాటికాలం మనుషులు ఆరోగ్యంగా ఉన్నారని శాస్త్రవేత్తలు అంటున్నారు. టెక్నాలజీ, తెలివీ పెరిగాక చేతులకు సబ్బులూ, వాష్‌లతో కడిగి మట్టికి బదులు రసాయనాలు తింటూ జబ్బు పడుతున్నారు. మట్టి తినడమే శరీరానికి మేలని, బంకమట్టి తింటే పొట్ట తగ్గుతుందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. మరీ.. పొట్ట తగ్గుతుందని వెంటనే బంకమట్టిని తినకండోయ్! అది వాళ్లు స్పెషల్‌గా ప్రాసెస్ చేసిన బంకమన్నట! ఎలుకలపై చేసిన ఈ పరిశోధనలో.. తొలుత కొన్ని ఎలుకలకు ఒబేసిటీ మెడిసిన్, కొన్ని ఎలుకలకు ప్రాసెస్డ్ బంక మన్నూ ఇచ్చారు. ఇలా రెండు వారాలపాటు వారు అధ్యయనం కొనసాగించారు. డ్రగ్ తీసుకున్న ఎలు కల్లో కంటే మట్టి తిన్న ఎలుకల్లో వెయిట్‌లాస్ స్పష్టంగా కనపడినట్లు గుర్తించారు. రెండు గ్రూపులను పోల్చి చూడగా.. మట్టి తిన్న ఎలుకల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనబడలేదని, అవి ఆరోగ్యంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ బంకమట్టిలోని సన్నటి మురికి లాంటి పదార్థం పేగుల్లోని కొవ్వును పీల్చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీన్ని మనుషులపై ప్రయోగించడానికి తమ అధ్యయనం ఇంకా కొనసాగిస్తున్నామని వారు చెప్పారు. -
కనబడని కొవ్వుతో మరణం!
ఢిల్లీ: మనకు పైకి కనిపించడానికి లావుగా ఉండే వారిలోనే కాకుండా అంతర్గతంగా ఏర్పడేటువంటి కొవ్వుతో చాలా ప్రమాదం పొంచి ఉందనీ, ఒక రకంగా ఇది మరణానికి దగ్గరవుతున్నట్లే అని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదర భాగంలో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం వలన ప్రమాదం మరింత పెరుగుతుందంటున్నారు. చర్మం కింది భాగాలలో అంతర్గతంగా తయారయిన కొవ్వు మూలాన అనేక వ్యాధుల బారిన పడటానికి అవకాశం ఉంటుంది. హృద్రోగులలో ఈ తరహా కొలెస్ట్రాల్ ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా మనదేశంలోని స్థూలకాయుల్లో హైపర్‌టెన్షన్, థైరాయిడ్, డయాబెటిస్ తదితర వ్యాధుల బారిన పడిన వారికి ఆ వ్యాధుల మీద అవగాహన లేకపోవడం వలన తప్పకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సైతం తీసుకోలేకపోతున్నారు. ఇది ఎక్కువ నష్టం జరగడానికి దోహదం చేస్తుందని ఒబెసిటీ రంగంలో కృషి చేస్తున్న ఇండియా కంపెనీ వీఎల్సీసీ స్థాపకురాలు వందనా మిశ్రా తెలిపారు. ప్రతి యేటా నవంబర్ 26 ను యాంటీ ఒబెసిటీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో అస్తవ్యస్తమైన జీవన విధానం, అహారపు అలవాట్ల మూలంగా పెరుగుతున్న స్థూలకాయులు తప్పకుండా తమ బరువును తగ్గించుకోవడం దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.