చాలామంది మహిళలు బెల్లీఫ్యాట్‌తో ఇబ్బంది పడుతుంటారు. ప్రసవానంతరం లేదా ఒబెసిటీ కారణంగానో బానపొట్టలా నడుము, పొట్ట మధ్య గ్యాప్ లేనివిధంగా కలిసిపోయినట్లుగా ఉంటుంది. దీంతో నలుగురులోకి వచ్చినప్పుడూ కాస్త ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఈ సమస్యను జస్ట్ ఈ నాలుగు వ్యాయమాలతో చెక్ పెట్టొచ్చంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిధి శర్మ ఓ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో తాను ఆ వ్యాయమాలతో సుమారు 20 కిలోల బరువు తగ్గినట్లు పేర్కొంది. ఇంతకీ ఏంటా వర్కౌట్లు అంటే..
రిధి శర్మ పొట్టప్రాంతంలో పేరుకునే అధిక కొవ్వు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం అని అంటోంది. ఆ ప్రాంతంలో సెల్యూట్ అనే కొవ్వుని తగ్గించుకోవడానికి ఈ వ్యాయామాలు తప్పక సహాయపడతాయని చెబుతోంది. తాను ఆ వర్కౌట్ల తోనే బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోగలిగానని అంటోంది. అంతేగాదు తన నడుము కొలతల్లో కూడా మంచి మార్పులు చూశానని చెబుతోంది.
వారానికి కనీసం నాలుగు నుంచి ఐదు సార్లు చేయడం వల్లే మంచి ఫలితాలను పొందినట్లు పేర్కొంది. కనీసం నాలుగు నుంచి ఐదు వారాలు క్రమంతప్పకుండా చేస్తేనే ఇదంతా సాధ్యమని నమ్మకంగా చెబుతోంది రిధి.
చేయాల్సిన యామాలు..
అబ్ హోల్డ్: దీన్ని నేలపై వేయాలి. ఇది తల కాళ్లు దగ్గరకు వస్తున్నట్లుగా వంచడం.
ప్లాంక్ ట్విస్ట్: ఇది వెన్నెముకకు మద్దతు ఇచ్చేలా కోర్ కండరాలను బలపరుస్తుంది
వీ సైకిల్స్: నేలపైకూర్చొని కాళ్లను సైకిల్ తొక్కుతున్నట్లుగా కదపాలి
లెగ్ డ్రాప్: ఇది నేలపై పడుకుని కాళ్లను సైకిల్ తొక్కుతున్నట్లుగా చెయ్యాలి.
దీంతోపాటు రోజుకి ఎనిమిది వేల నుంచి పది వేల వరకు అడుగులు వేసేలా వాకింగ్ చేయాలి.
భోజనంలో 20 నుంచి 25 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూడాలి
ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం
రాత్రి ఏడు గంటలకు లోపే డిన్నర్ పూర్తి చేయడం
సుమారు ఏడు నుంచి 8 గంటల వరకు నిద్ర పోవడం
తదితరాలను పాటిస్తే బెల్లీఫ్యాట్ తగ్గడమే గాక ఆరోగ్యంగా ఉంటారని చెబుతోంది రిధి శర్మ.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులను లేదా వైద్యులను సంప్రదించి పాటించటం ఉత్తమం.
(చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే : ఒకరు పొడగరి, మరొకరు అత్యంత పొట్టి..)
Comments
Please login to add a commentAdd a comment