Slim Look
-
ఈ వర్కౌట్లతో బెల్లీ ఫ్యాట్ మాయం..! సన్నజాజి తీగలా నడుము..
చాలామంది మహిళలు బెల్లీఫ్యాట్‌తో ఇబ్బంది పడుతుంటారు. ప్రసవానంతరం లేదా ఒబెసిటీ కారణంగానో బానపొట్టలా నడుము, పొట్ట మధ్య గ్యాప్ లేనివిధంగా కలిసిపోయినట్లుగా ఉంటుంది. దీంతో నలుగురులోకి వచ్చినప్పుడూ కాస్త ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఈ సమస్యను జస్ట్ ఈ నాలుగు వ్యాయమాలతో చెక్ పెట్టొచ్చంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిధి శర్మ ఓ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో తాను ఆ వ్యాయమాలతో సుమారు 20 కిలోల బరువు తగ్గినట్లు పేర్కొంది. ఇంతకీ ఏంటా వర్కౌట్లు అంటే..రిధి శర్మ పొట్టప్రాంతంలో పేరుకునే అధిక కొవ్వు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం అని అంటోంది. ఆ ప్రాంతంలో సెల్యూట్ అనే కొవ్వుని తగ్గించుకోవడానికి ఈ వ్యాయామాలు తప్పక సహాయపడతాయని చెబుతోంది. తాను ఆ వర్కౌట్ల తోనే బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోగలిగానని అంటోంది. అంతేగాదు తన నడుము కొలతల్లో కూడా మంచి మార్పులు చూశానని చెబుతోంది. వారానికి కనీసం నాలుగు నుంచి ఐదు సార్లు చేయడం వల్లే మంచి ఫలితాలను పొందినట్లు పేర్కొంది. కనీసం నాలుగు నుంచి ఐదు వారాలు క్రమంతప్పకుండా చేస్తేనే ఇదంతా సాధ్యమని నమ్మకంగా చెబుతోంది రిధి. చేయాల్సిన యామాలు..అబ్ హోల్డ్: దీన్ని నేలపై వేయాలి. ఇది తల కాళ్లు దగ్గరకు వస్తున్నట్లుగా వంచడం. ప్లాంక్ ట్విస్ట్: ఇది వెన్నెముకకు మద్దతు ఇచ్చేలా కోర్ కండరాలను బలపరుస్తుందివీ సైకిల్స్: నేలపైకూర్చొని కాళ్లను సైకిల్ తొక్కుతున్నట్లుగా కదపాలిలెగ్ డ్రాప్: ఇది నేలపై పడుకుని కాళ్లను సైకిల్ తొక్కుతున్నట్లుగా చెయ్యాలి. దీంతోపాటు రోజుకి ఎనిమిది వేల నుంచి పది వేల వరకు అడుగులు వేసేలా వాకింగ్ చేయాలి. భోజనంలో 20 నుంచి 25 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూడాలిప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటంరాత్రి ఏడు గంటలకు లోపే డిన్నర్ పూర్తి చేయడంసుమారు ఏడు నుంచి 8 గంటల వరకు నిద్ర పోవడంతదితరాలను పాటిస్తే బెల్లీఫ్యాట్ తగ్గడమే గాక ఆరోగ్యంగా ఉంటారని చెబుతోంది రిధి శర్మ. View this post on Instagram A post shared by Ridhi Sharma | Fitness & Lifestyle (@getfitwithrid)గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులను లేదా వైద్యులను సంప్రదించి పాటించటం ఉత్తమం. (చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే : ఒకరు పొడగరి, మరొకరు అత్యంత పొట్టి..) -
Beauty Tips: వుడ్ థెరపీ.. స్లిమ్‌గా మార్చేస్తుంది! ముడతలు తొలగిస్తుంది!
Beauty Tips In Telugu: ఉన్న అందాన్ని సంరక్షించుకోవడమే అసలైన సౌందర్య సాధన. వయసు పెరిగేకొద్ది.. ఒంటిమీద శ్రద్ధ తగ్గి.. శరీర ఆకృతి మారిపోతుంటుంది. బరువు పెరిగి పొట్ట, నడుము చుట్టుకొలతలు మారిపోవడం.. చర్మం పటుత్వాన్ని కోల్పోవడం.. వాటికి తోడు పని ఒత్తిడి, తీవ్ర అలసటతో మొహంలో కాంతి తగ్గడం.. ఇలా పలు కారణాలతో ఉన్న ఆకృతిని పోగొట్టుకుంటుంటారు చాలామంది. అలాంటి వారికి అసలైన థెరపీని అందిస్తుంది ఈ వుడ్ రోలర్. మనిషిని స్లిమ్‌గా మార్చేస్తుంది. ముడతలు తొలగించి యవ్వనాన్ని తిరిగి ఇస్తుంది. ఈ టూల్‌ని వినియోగించడం చాలా సులభం. ఇది చాలా వేగంగా కండరాల నొప్పిని తగ్గించి.. టెన్షన్‌ను మాయం చేసి.. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తప్రసరణను పెంచుతుంది. కొవ్వు తగ్గించి.. శరీరాన్ని ఫిట్‌గా మారుస్తుంది. చపాతీ కర్ర అంత స్టిఫ్‌గా ఉండదు! ఈ మల్టీఫంక్షనల్ రోలర్.. సహజమైన చెక్కతో తయారైంది. ఈ టూల్‌ని చపాతీ కర్ర పట్టుకున్నట్లుగా పట్టుకుని.. శరీరంలో ఏ భాగం తగ్గాలో, ఏ భాగంలో ఇబ్బంది ఉందో అక్కడ నొక్కుతూ అటు ఇటు జరుపుతూ ఉండాలి. అయితే ఇది చపాతీ కర్ర అంత స్టిఫ్‌గా ఉండదు. టూల్ మొత్తం గుండ్రటి చిన్నచిన్న చెక్క రింగ్స్ పేర్చినట్లుంటుంది. నాన్ స్లిప్ అండ్ ఎక్స్టెండెడ్ హ్యాండిల్ చక్కటి గ్రిప్‌ని కలిగి ఉంటుంది. మెడ, పొట్ట, నడుము, తొడలు, కాళ్లు ఇలా వేటినైనా సులభంగా మసాజ్ చేసుకోవచ్చు. అయితే చేతుల లావు తగ్గాలన్నా.. ముడతలు పోవాలన్నా మరొకరి సాయం తీసుకోవాలి. ఎవరికి వారు చేతులపై ఈ వుడ్ థెరపీని చేసుకోవడం కష్టమే. దీని ధర సుమారు 21 డాలర్లు. అంటే 1,672 రూపాయలు. చదవండి: Beauty Tips: బీట్రూట్ అలోవెరా జెల్‌తో ముఖం మీది మచ్చలు మాయం! అయితే.. Health Tips: పిల్లలు, వృద్ధులు ఖర్జూరాలు తరచుగా తింటే! -
వాట్ ఏ ట్రాన్స్ఫర్మేమషన్.. ఈ హీరోయిన్స్ ఎంతలా మారిపోయారో
న్యూ ప్రాజెక్ట్స్ కోసం కొందరు హీరోయిన్స్ కొత్త చాలెంజ్‌లు తీసుకున్నారు. న్యూ మేకోవర్ కోసం పర్ఫెక్ట్ డైట్, వర్కౌట్స్‌తో క్యారెక్టర్స్‌కు తగ్గట్లు మౌల్డ్ అవుతున్నారు. అలాంటి వారిలో సమంత, కీర్తీ సురేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి వారు ఉన్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. ► ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్, వర్కౌట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు సమంత. ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్‌సిరీస్ తర్వాత దర్శక–ద్వయం రాజ్ అండ్ డీకేలతో సమంత మరో వెబ్‌సిరీస్ చేయనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసందే. ఇందులో బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ మరో లీడ్ యాక్టర్. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత పాత్ర చాలా పవర్ఫుల్ అండ్ యాక్షన్‌తో ఉంటుందట. అందుకే సమంత ఈ ప్రాజెక్ట్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారని టాక్. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత లుక్ కూడా కొత్తగా ఉంటుందనీ, ఆల్రెడీ వర్క్‌షాప్స్ మొదలయ్యాయని, త్వరలోనే ఈ వెబ్‌సిరీస్‌పై అధికారిక ప్రకటన రానుందని బాలీవుడ్ టాక్. ► హీరోయిన్ కీర్తీ సురేశ్ మరోసారి లాఠీ పట్టనున్నారట. రీసెంట్ వచ్చిన తమిళ చిత్రం ‘సానికాయిదమ్’(తెలుగులో ‘చిన్ని’)లో పోలీస్ కానిస్టేబుల్‌గా నటించారామె. తాజాగా మరోసారి పోలీసాఫీసర్‌గా(ఎస్ఐ) నటించనున్నారు. తమిళ చిత్రాలు ‘హీరో’, ‘విశ్వాసం’, ‘అన్నాత్తే’లకు కథా రచయితగా పని చేసిన ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫిల్మ్ రూపొందనుంది. ఈ చిత్రంలో ‘జయం’ రవి హీరోగా నటిస్తారు. ఈ మూవీలోనే కీర్తీ సురేశ్ పోలీసాఫీసర్‌గా నటించనున్నారని కోలీవుడ్ టాక్. ఈ పాత్ర కోసమే ఆమె కాస్త బరువు పెరిగి, ఫిట్‌గా ఉండేలా వర్కౌట్స్ చేస్తున్నారని తెలిసింది. ► కాగా ఈ చిత్రంలో కీర్తితో పాటు మరో హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహనన్ కూడా నటిస్తారట. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా... ఇలా డిఫరెంట్ రోల్స్ చేస్తూ విలక్షణ నటిగా పేరు తెచ్చు కున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ఓ కొత్త సినిమా కోసం ఆమె బాగా బరువు తగ్గి, స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘నువ్వు ఏం చేయాలో, చేయకూడదో ఇతరులు నీకు చెప్పేలా ఉండకూడదు. ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా తీసుకుని ముందడుగు వేయాలి. నా కొత్త లుక్ కోసం దాదాపు నాలుగు నెలలు కష్టపడ్డాను’ అంటూ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ఓ కొత్త ప్రాజెక్ట్ కోసమే ఆమె ఇలా స్లిమ్ లుక్‌లోకి మారిపోయారని కోలీవుడ్ టాక్. అయితే సమంత, కీర్తీ సురేశ్, వరలక్ష్మి.. వీరే కాదు.. మరికొంతమంది హీరోయిన్స్ కూడా న్యూ ప్రాజెక్ట్స్ కోసం కొత్త మేకోవర్‌కు రెడీ అవుతున్నారు. -
ఎత్తుగా కనపడాలంటే...
నడుము దగ్గర బిగుతుగా ఉండే దుస్తులను ధరించటం వలన చూసే వారికి మీరు పొడవుగా స్లిమ్‌గా ఉన్నట్టు కనపడటానికి అవకాశం ఉంది. ముఖ్యంగా డార్క్ లేదా నలుపు రంగు జీన్స్’ని చాలా బిగుతుగా కుట్టిన దుస్తులను వేసుకోవటం వలన మీరు చాలా స్లిమ్’గా ఉన్నట్టు కనపడతారు. వీటిని మీ శరీర కదలికలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. -
లుక్ మార్చేస్తున్న యంగ్ హీరో
హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న యంగ్ హీరో మంచు మనోజ్. మంచు వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ యువ కథానాయకుడు స్టార్ ఇమేజ్ అందుకోవటంలో ఫెయిల్ అవుతున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్లతో పాటు ప్రయోగాత్మక చిత్రాలతో కూడా ఫెయిల్ అయిన మనోజ్, త్వరలో ఓ రొమాంటిక్ లవ్ స్టోరితో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొత్త దర్శకుడు చందు డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. ఎక్కువ భాగం న్యూయార్క్ లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో మనోజ్ స్లిమ్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే వెయిట్ తగ్గేందుకు మనోజ్ జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడట. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ లవ్ స్టోరీ అయినా మనోజ్‌కు సక్సెస్ ఇస్తుందేమో చూడాలి. -
ఎన్టీఆర్ న్యూ లుక్
-
న్యూ లుక్‌లో ఎన్టీఆర్
జై లవ కుశ సినిమాతో ఘనవిజయం సాధించిన ఎన్టీఆర్, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ న్యూ లుక్ లో కనిపించబోతున్నాడు. అందుకు తగ్గట్టుగా స్లిమ్ లుక్ లోకి మారిపోయేందుకు హాలీవుడ్ ఫిజికల్ ట్రైనర్ పర్యవేక్షణలో కసరత్తులు చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో కన్నా ఫిట్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. తాజాగా ఎన్టీఆర్ న్యూ లుక్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ స్లిమ్‌గా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శ్రద్ధా కపూర్, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా నటించే అవకాశం ఉంది. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధకృష్ణ నిర్మిస్తున్నారు. -
శస్త్రచికిత్సతో స్లిమ్‌గా..
తమిళ సినిమా: కాస్త బొద్దుగా ఉన్న కథానాయికలు బరువు తగ్గి, మరింత నాజూగ్గా తయారవడానికి నోరు కుట్టుకుని, కసరత్తుతో నానా తంటాలు పడుతున్నారు. కోట్లు గడిస్తున్నా ఆహారపు కట్టుబాట్లంటూ డైట్ చేస్తున్నారు. అదీ మీరి కొందరు శస్త్ర చికిత్సకు వెనుకాడడం లేదు. తాజాగా నటి లక్ష్మీమీనన్ ఇదే బాట పట్టిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కుంకీ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ఆ చిత్రం హిట్‌తో ఇక్కడ సెటిల్ అయిపోయింది, వరుసగా అవకావాలు అందిపుచ్చుకుంది. దీంతో కాస్త బొద్దుగా ఉన్నా ఆ విషయం గురించి పట్టించుకోలేదు. పైగా నేనిలానే ఉంటాను అని స్టెట్మెంట్ కూడా ఇచ్చేసింది. అయితే అనూహ్యంగా అవకాశాలు తగ్గడంతో అమ్మడికి అందం గురించి గుర్తొచ్చినట్లుంది. కొత్తవారు దూసుకురావడంతో లక్ష్మీమీనన్‌ను కోలీవుడ్ దాదాపూ పక్కన పెట్టేసింది. ఆ మధ్య నటించిన రెక్క చిత్రంలో మరీ లావుగా కనిపించింది. ఇటీవల బరువు తగ్గే ప్రయత్నాలు మొదలెట్టిందట. వ్యాయామం, యోగా లాంటి కసరత్తులతో కాస్త బరువు తగ్గించుకున్న లక్ష్మీమీనన్‌కు ఫలితంగా ప్రభుదేవాతో యంగ్ మంగ్ ఛంగ్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. అయితే ఇంకా స్లిమ్‌గా తయారవ్వాలన్న తలంపుతో బరువు తగ్గడానికి, కొవ్వు కరిగించడానికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మొత్తం మీద లక్ష్మీమీనన్ సోషల్ మీడియాకు విడుదల చేసిన ఫొటోల్లో చాలా స్లిమ్‌గా, గ్లామర్‌గా కనిపించింది. అదేవిధంగా ఇప్పటి వరకు సంప్రదాయబద్ధంగా నటించిన లక్ష్మీమీనన్ ఇకపై గ్లామర్ పాత్రలకు సై అనేవిధంగా దర్శక నిర్మాతలకు హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. -
అనుష్క స్లిమ్ లుక్ గ్రాఫిక్సేనా..!
సైజ్ జీరో సినిమా కోసం లుక్ విషయంలో రిస్క్ చేసిన అనుష్క, కెరీర్ ను కష్టాల్లో పడేసుకుంది. ఈ సినిమా కోసం బొద్దుగా తయారైన స్వీటీ తరువాత స్లిమ్ అయ్యేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో సింగం 3, ఓం నమో వేంకటేశాయ సినిమాల్లో అనుష్క లుక్‌పై విమర్శలు వచ్చాయి. ఇక ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి 2లో అనుష్క స్లిమ్‌గా చూపించేందుకు గ్రాఫిక్స్ వినియోగించారన్న ప్రచారం జరిగింది. బాహుబలి 2 తరువాత భాగమతి షూటింగ్ లో బిజీ అయ్యింది అనుష్క. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్లో అనుష్క స్లిమ్‌గా దర్శనమిచ్చింది. దీంతో అనుష్క తిరిగి స్లిమ్ లుక్ లోకి వచ్చేసిందంటూ స్వీటీ ఫ్యాన్స్ సంబరపడిపోయారు. అదే సమయంలో భాగమతి ఫస్ట్ లుక్‌లో అనుష్కను స్లిమ్ గా చూపించేందుకు గ్రాఫిక్స్ వినియోగించారన్న ప్రచారం జరిగింది. తాజాగా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న కొన్ని ఫొటోలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. అనుష్క పుట్టిన రోజు సందర్భంగా భాగమతి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న హాస్యనటి విధ్యుల్లేక రామన్ ఆన్‌లోకేషన్ ఫొటోలను ట్వీట్ చేసింది. ఈ ఫొటోలలో అనుష్క కాస్త బొద్దుగానే కనిపిస్తోంది. దీంతో ఫస్ట్ లుక్‌లో అనుష్క స్లిమ్ గా కనిపించటం గ్రాఫిక్స్ వల్లే సాధ్యమయ్యిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Happiest birthday to a lovely friend, human being and fellow scorpion! Much love to you Sweety! #Bhaagamathie #HBDAnushkaShetty pic.twitter.com/uSu2EAFOw4 — Vidyu (@VidyuRaman) 7 November 2017 -
స్లిమ్‌గా స్వీటీ!
తమిళసినిమా: చేతిలో సొమ్ముంటే కొండపైన కోతి కూడా దిగివస్తుందనే నానుడి ఉంది. అలాంటిది నటి అనుష్కలాంటి టాప్ కథానాయికకు జిమ్ ఒక లెక్కా. ఏమిటీ అసందర్భ మాటలంటారా? నటనలో వైవిధ్యం కోసం తారలు ఆయా పాత్రలకు జీవం పోయడానికి సాధ్యమైనంత వరకూ కృషి చేస్తుంటారు. హీరోలైతే బరువు తగ్గడానికి, పెరగడానికి, సిక్స్ ప్యాక్ బాడీకి తయారవ్వడానికి శ్రమిస్తారు. హీరోయిన్లు మాత్రం అంతలా సాహసం చేయలేరు. ముఖ్యంగా బరువు పెరగడానికి సమ్మతించరు. ఎందుకంటే అందం వారికి చాలా ముఖ్యం. అలాంటిది నటి అనుష్క ఇంజిఇడప్పళగి(సైజ్ జీరో) చిత్రం కోసం మ్యాగ్జిమమ్ బరువు పెరిగి నటించారు. ఆ తరువాత తను బరువు తగ్గడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. అనుష్క బరువు బాహుబలి 2 చిత్రానికి కూడా చాలా భారమైంది. ఆ చిత్రం తరువాత వచ్చిన కొన్ని అవకాశాలను అనుష్క తిరష్కరించిందట. కారణం తాను మళ్లీ మునుపటి అనుష్కలా అందంగా తయారైన తరువాత కొత్త చిత్రాలను అంగీకరిస్తానని చెప్పి బరువు తగ్గడానికి శారీరక కసరత్తులు చేయడం మొదలెట్టారు. అందుకు ఇంట్లోనే అధునాతనమైన జిమ్‌తో పాటు, ఒక శిక్షకుడిని నియమించుకున్నారు. రోజుకు 8 గంటల పాటు జిమ్‌లోనే గడుపుతూ శారీరక శ్రమతో పూర్వ అందాలతో చాలా స్లిమ్‌గా తయారయ్యారట. అంతకు ముందు తనతో చిత్రాలు చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాతల్లో ఒకరిని ఇటీవల ఇంటికి రప్పించుకుని కథ చెప్పమని, ఆ కథ నచ్చడంతో నటించడానికి పచ్చజెండా ఊపారట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల టాక్. సో చిన్న విరామం తరువాత అనుష్క విజృంబణను చూడవచ్చునన్నమాట. అనుష్క ప్రస్తుతం నటిస్తున్న టాలీవుడ్ చిత్రం భాగమతి నిర్మాణాంతక కార్యక్రమాల్లో బిజీగా ఉందని సమాచారం. -
పవన్ లుక్కు సూపర్ రెస్పాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్‌ను సారథి స్టూడియోస్‌లో వేసిన సెట్లో చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ షూటింగ్ సందర్భంగా లీక్ అయిన పవన్ స్టిల్స్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. సర్థార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాల్లో కాస్త బొద్దుగా కనిపించిన పవన్ లుక్‌పై విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రమ్ సినిమాలో మరోసారి యూత్ ఫుల్ లుక్‌లో కనిపించేందుకు పవన్ స్లిమ్ లుక్‌లో మారిపోయాడు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్‌లు పవన్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.