సైజ్ జీరో సినిమా కోసం లుక్ విషయంలో రిస్క్ చేసిన అనుష్క, కెరీర్ ను కష్టాల్లో పడేసుకుంది. ఈ సినిమా కోసం బొద్దుగా తయారైన స్వీటీ తరువాత స్లిమ్ అయ్యేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో సింగం 3, ఓం నమో వేంకటేశాయ సినిమాల్లో అనుష్క లుక్‌పై విమర్శలు వచ్చాయి. ఇక ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి 2లో అనుష్క స్లిమ్‌గా చూపించేందుకు గ్రాఫిక్స్ వినియోగించారన్న ప్రచారం జరిగింది. బాహుబలి 2 తరువాత భాగమతి షూటింగ్ లో బిజీ అయ్యింది అనుష్క. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో అనుష్క స్లిమ్‌గా దర‍్శనమిచ్చింది.
దీంతో అనుష్క తిరిగి స్లిమ్ లుక్ లోకి వచ్చేసిందంటూ స్వీటీ ఫ్యాన్స్ సంబరపడిపోయారు. అదే సమయంలో భాగమతి ఫస్ట్ లుక్‌లో అనుష్కను స్లిమ్ గా చూపించేందుకు గ్రాఫిక్స్ వినియోగించారన్న ప్రచారం జరిగింది. తాజాగా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న కొన్ని ఫొటోలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. అనుష్క పుట్టిన రోజు సందర్భంగా భాగమతి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న హాస్యనటి విధ్యుల్లేక రామన్ ఆన్‌లోకేషన్ ఫొటోలను ట్వీట్ చేసింది. ఈ ఫొటోలలో అనుష్క కాస్త బొద్దుగానే కనిపిస్తోంది. దీంతో ఫస్ట్ లుక్‌లో అనుష్క స్లిమ్ గా కనిపించటం గ్రాఫిక్స్ వల్లే సాధ్యమయ్యిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Happiest birthday to a lovely friend, human being and fellow scorpion! Much love to you Sweety! #Bhaagamathie #HBDAnushkaShetty pic.twitter.com/uSu2EAFOw4
— Vidyu (@VidyuRaman) 7 November 2017
Comments
Please login to add a commentAdd a comment