
అందంతో, అభినయంతో అందరినీ అబ్బురపరిచే బ్యూటీ అనుష్క శెట్టి. అరుంధతి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం లిఖించుకున్న ఈమె దేవసేన, రుద్రమదేవి, భాగమతి వంటి పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందులో భాగమతి సినిమా 2016లో వచ్చింది. ఈ మూవీకి సీక్వెల్ రాబోతుందని కొన్నేళ్లుగా రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి తప్ప ఏదీ కార్యరూపం దాల్చలేదు.
భాగమతి సీక్వెల్..
ఇన్నాళ్లకు భాగమతి సీక్వెల్‌పై దర్శకుడు అశోక్ స్పందించాడు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. భాగమతి సీక్వెల్‌లో అనుష్క మరింత పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుందని చెప్పాడు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్నాడు. 2025లో సీక్వెల్ సెట్స్‌పైకి వెళ్తుందన్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమా నిర్మిస్తుందని తెలిపాడు. ఈ విషయం తెలిసి స్వీటీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
చేతిలో రెండు చిత్రాలు
గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో అలరించిన అనుష్క ప్రస్తుతం ఘాటి సినిమా చేస్తోంది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. అలాగే మలయాళంలో తొలిసారిగా కథనార్- ద వైల్డ్ సోర్సరర్ అనే చిత్రంలో నటిస్తోంది.
చదవండి: జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నా, కోలుకోవడానికి..
Comments
Please login to add a commentAdd a comment