సినిమా బాగుందంటే జనాలు నెత్తినపెట్టుకుంటారు. అదే తేడా వచ్చిందంటే మాత్రం తీవ్రంగా విమర్శిస్తారు. ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో ఇది నిరూపితమైంది కూడా! ఈ సినిమాలోని క్యారెక్టర్ల లుక్స్‌పై, దాన్ని డిజైన్ చేసినవారిపై, డైరెక్టర్‌పై, రచయితపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు.
ఏదీ శాశ్వతం కాదు
అలా ఈ ట్రోలింగ్ నుంచి కోలుకోవడానికి చాలా సమయమే పట్టిందంటున్నాడు గేయ, సంభాషణల రచయిత మనోజ్ ముంతషీర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నాను. ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. అలాగే ఈరోజు మంచి అనిపించింది కాస్తా రేపటికి చెడుగా అనిపించవచ్చు. లేదా ఈరోజు చెడు అనుకుందే రేపు మంచిగా అనిపించనూవచ్చు.
ట్రోలింగ్ చూసి ఏడ్చా..
ఆదిపురుష్ సమయంలో వచ్చిన ట్రోలింగ్ చూసి ఏడ్చాను. కానీ కుంగిపోలేదు. తిరిగి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇందుకోసం పగలూరాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నాను. బాలీవుడ్ విషయానికి వస్తే ఇదొక మార్కెట్. ఇక్కడ ఎలాంటి నియమనిబంధనలు ఉండవు. కేవలం లాభం ఒక్కటే ఆశిస్తారు. నాతో వారికేదైనా లాభం ఉందనిపిస్తే నాదగ్గరకు వస్తారు. అలా ఇప్పుడు నన్ను మళ్లీ సంప్రదిస్తున్నారు అని మనోజ్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment