
చెలి, సఖి లాంటి సూపర్ హిట్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మాధవన్ ఇంతవరకు తెలుగులో ఒక్క స్ట్రయిట్ సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమాతో తొలిసారిగా ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు.
తాజాగా మాధవన్ మరో తెలుగు సినిమా అంగీకరించారన్న టాక్ వినిపిస్తోంది. భాగమతి సినిమా తరువాత అనుష్క ఇంతవరకు మరో సినిమా మొదలు పెట్టలేదు. సరైన కథ కోసం ఎదురుచూస్తున్న స్వీటీ మరో లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పారట. థ్రిల్లర్ జానర్‌తో తెరకెక్కనున్న ఈసినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్నారు.ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.