Hemanth Madhukar
-
నిశ్శబ్దంగా రెండు సినిమాలు
అనుష్క, మాధవన్‌తో ‘నిశ్శబ్దం’ చిత్రం తెరకెక్కించిన దర్శకుడు హేమంత్ మధుకర్ చాలా సైలెంట్‌గా రెండు సినిమాలు ప్లాన్ చేశారు. ఒకటి తెలుగు చిత్రం. ఇంకోటి హిందీ సినిమా. తెలుగు చిత్రానికి రచయిత గోపీమోహన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని రూపొందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే ఈ సినిమాని నిర్మించనుందని టాక్. హిందీలో తెరకెక్కించనున్నది మల్టీస్టారర్ మూవీ. బాలీవుడ్లో ‘ఏ ఫ్లాట్’ అనే చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్నారు హేమంత్ మధుకర్. తాజా చిత్రానికి ‘బాతే’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘కహానీ, పింక్’ చిత్రాల రచయిత రితేష్ షా స్క్రీన్‌ప్లే అందించనున్నారని, 70 శాతం షూటింగ్ లండన్‌లో జరగనుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రానున్నాయి. -
నిశ్శబ్దం ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది
అనుష్క, మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడ్సన్, షాలినీ పాండే ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా చిత్రదర్శకుడు హేమంత్ మధుకర్ మీడియాతో చెప్పిన విశేషాలు. ► కమల్‌హాసన్ నటించిన ‘పుష్పక విమానం’ సినిమాలా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రయోగాత్మక సినిమాగా చేద్దామనుకుని కోన వెంకట్‌గారికి ఈ కథ చెప్పాను. కోనగారికి కథ నచ్చటంతో ఆయన ద్వారా అనుష్కగారికి, మిగతా నటీనటులకు ఈ కథ చెప్పి, ఒప్పించాను. ప్రయోగాత్మక చిత్రం అంటే నిర్మాతలు ముందుకు రారేమోనని కోన వెంకట్‌గారి సలహా మేరకు మూకీ సినిమాని కాస్తా డైలాగ్స్‌తో నింపి మెయిన్ పాత్ర అనుష్క క్యారెక్టర్‌ను మాత్రం మూకీగా ఉంచాను. అప్పుడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌గారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై సినిమాను నిర్మించటానికి ముందుకు వచ్చారు. ఆయనతో పాటు కోన ఫిల్మ్ కార్పోరేషన్ నిర్మాణ భాగస్వామిగా చేరటంతో మా ‘నిశ్శబ్దం’ తెరకెక్కింది. ► విజువల్‌గా గ్రాండ్‌గా కనిపించటంతో పాటు ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ రావటం కోసం, కథానుగుణంగా సినిమాను అమెరికాలో చిత్రీకరించాం. అమెరికాలో పుట్టిన ఇండియన్ అమ్మాయి పాత్ర అనుష్కది. అలాగే అన్ని ముఖ్యపాత్రలు అమెరికా నేపథ్యంలో ఉంటాయి. ఒరిజినాలిటీ మిస్ కాకూడదనే ఉద్దేశంతో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ను పూర్తి నిడివి ఉన్న పాత్రకోసం తీసుకున్నాం. ఒక హాలీవుడ్ నటుడు పూర్తి స్థాయిలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’ అని అనుకుంటున్నాను. ► ఈ సినిమాను కేవలం 55రోజుల్లో తీయగలిగానంటే దానికి కారణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలే. అమెరికాలో షూటింగ్ అంటే వీసాలు, లొకేషన్లు అని ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. నేను చెప్పిన కథను నమ్మి టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గార్లు ఏ లోటు లేకుండా చేయటం వల్లే ఈ సినిమా సాధ్యమయింది. ఈ సినిమాలోని సౌండ్, షానిల్ డియో కెమెరా వర్క్ గురించి సినిమా చూసిన తర్వాత అందరూ మాట్లాడతారని నమ్ముతున్నాను. సంగీత దర్శకుడు గిరీష్, గోపీసుందర్ నేపథ్య సంగీతం పోటాపోటీగా ఉంటాయి. -
ఫలితాన్ని దాచలేం: కోన వెంకట్
‘‘ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూడటం ఒక కిక్. అలా కుదరకపోతే టీవీలో చూస్తాం. కరెంట్ పోతే ఫోన్లో చూస్తాం. కానీ ఉత్కంఠ ఒక్కటే. ఎమోషన్ కనెక్ట్ అయితే ఏ స్క్రీన్ అయినా ఒక్కటే. సినిమా కూడా అంతే’’ అన్నారు రచయిత కోన వెంకట్. అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించాయి. ఈ సినిమా అక్టోబర్ 2న అమేజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రచయితగా, నిర్మాతగా వ్యవహరించిన కోన వెంకట్ ‘సాక్షి’కి చెప్పిన విశేషాలు. మూకీ టు టాకీ ‘నిశ్శబ్దం’ని ముందు మూకీ సినిమాగా అనుకున్నాం. స్క్రీన్ ప్లే కూడా పకడ్బందీగా ప్లాన్ చేశాం. కానీ అనుష్క పాత్ర ఒక్కటే వినలేదు... మాట్లాడలేదు.. మిగతా పాత్రలు ఎందుకు సైలెంట్‌గా ఉండాలి? అనే లాజికల్ క్వశ్చన్‌తో మూకీ సినిమాను టాకీ సినిమాగా మార్చాం. రచయితగా నాకూ సవాల్ దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ కథ ఐడియా చెప్పగానే నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఐడియాను కథగా మలిచి స్క్రీన్ ప్లే చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. మేమిద్దరం మంచి మిత్రులం కావడంతో వాదోపవాదనలు చేసుకుంటూ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచాం. షూటింగ్ ఓ పెద్ద ఛాలెంజ్ ఈ సినిమా మొత్తాన్ని అమెరికాలోనే పూర్తి చేశాం. అది కూడా కేవలం 60 రోజుల్లోనే. కానీ అలా చేయడానికి చాలా ఇబ్బందులుపడ్డాం. థ్రిల్లర్ సినిమా షూట్ చేయడానికి వాతావరణం కీలకం. అమెరికాలో శీతాకాలంలో తీయాలనుకున్నాం. మా అందరికీ వీసాలు వచ్చేసరికి అక్కడ వేసవికాలం వచ్చేసింది. రోజూ ఉదయాన్నే రెండుమూడు గంటలు ప్రయాణం చేసి లొకేషన్స్‌కి వెళ్లి షూట్ చేశాం. వేరే దారిలేకే ఓటీటీ ‘నిశ్శబ్దం’ చిత్రం రిలీజ్ ఫి్ర» వరి నుంచి వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో అయోమయం. మరీ ఆలస్యం చేస్తే కొత్త సినిమా చుట్టూ ఉండే హీట్ పోతుంది. అది జరగకూడదని ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఓటీటీకి వెళ్లకూడదని చాలా విధాలుగా ప్రయత్నించాం. ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇలా చేస్తున్నాం. కచ్చితంగా థియేటర్ అనుభూతి ఉండదు. కానీ సినిమా తీసిందే ప్రేక్షకుల కోసం. వాళ్లకు ఎలా అయినా చూపించాలి కదా. ఓటీటీలో ‘నిశ్శబ్దం’ మొదటి బ్లాక్‌బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. ఫలితాన్ని దాచలేం థియేట్రికల్ రిలీజ్ అయితే కలెక్షన్స్‌ని బట్టి సినిమా హిట్, ఫ్లాప్ చెప్పొచ్చు. ఓటీటీలో అలా ఉండదు. ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని చెప్పేస్తారు. బావుంటే అభినందనలు ఉంటాయి. లేదంటే చీల్చి చండాడేస్తారు. ఈ లాక్‌డౌన్‌ను నేను ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఉపయోగించుకున్నాను. లాక్డౌన్ తర్వాత మనం చెప్పే కథల్లో చాలా మార్పు ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. కచ్చితంగా కొత్త ఐడియాలు మన తెలుగులోనూ వస్తాయి. ‘నిశ్శబ్దం’ కూడా అలాంటి సినిమాయే అని నా నమ్మకం. కోన 2.0 వస్తాడు ► లాక్డౌన్లో కొన్ని కథలు తయారు చేశాను ► లాక్డౌన్ తర్వాత అందరిలోనూ కొత్త వెర్షన్ బయటకి వస్తుంది అనుకుంటున్నాను. అలానే కోన వెంకట్ 2.0 కూడా వస్తాడు ► కరణం మల్లీశ్వరి బయోపిక్ సినిమా బాగా ముస్తాబవుతోంది ► దేశం మొత్తం ఆశ్చర్యపడే కాంబినేషన్ ఒకటి ఓకే అయింది. ఆ వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను ► సంక్రాంతికి థియేటర్స్ ఓపెన్ అయి, ప్రేక్షకులందరూ తండోపతండాలుగా థియేటర్లకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. -
నిశ్శబ్దంగా పూర్తయింది
ఈ మధ్య కాలంలో సినిమా పూర్తి కావాలంటే తక్కువలో తక్కువ ఆరునెలలు టైమ్ పడుతుంది. కానీ ‘నిశ్శబ్దం’ చిత్రబృందం సైలెంట్‌గా రెండు నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేయడం విశేషం. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే ముఖ్య పాత్రల్లో హేమంత్ మధుకర్ తెరకెక్కించిన చిత్రం ‘నిశ్శబ్దం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. సినిమా మొత్తం షూటింగ్‌ని అమెరికాలోని సీటెల్‌లో జరిపారు. సైలెంట్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కొందరు హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించారు. ‘‘షూటింగ్ పూర్తయింది. ఈ థ్రిల్లర్‌ను మీ అందరికీ త్వరగా చూపించేయాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. -
హాలీవుడ్ టచ్
హారర్ చిత్రం ‘భాగమతి’ తర్వాత ‘సైలెంట్’ అనే మూకీ థ్రిల్లర్‌లో కనిపించనున్నారు అనుష్క. మాధవన్ హీరోగా ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కోన వెంకట్ నిర్మాణంతో పాటు రచయితగానూ వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి. క్రాస్ఓవర్ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. అంటే కేవలం కొంతమంది మన భాష నటులు మిగతా అంతా వేరే భాష నటులు కనిపిస్తారు. ఇందులో హాలీవుడ్ నటుల టచ్ ఎక్కువగానే కనిపించనుంది. ‘కిల్‌బిల్’లాంటి క్లాసిక్ హిట్ చిత్రంలో నటించిన మైఖెల్ మేడ్సన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారట. ‘కిల్ బిల్ ఫస్ట్ పార్ట్’తోపాటు ‘ఫారెస్ట్ ఆఫ్ లివింగ్ డెడ్, ఫ్రీ విల్లీ 2’ చిత్రాల్లో కనిపించారు మైఖెల్. మార్చి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ అమెరికాలోనే జరుపుకోనుంది. ఈ చిత్రం కోసం అనుష్క బరువు తగ్గి, కొత్త లుక్‌లో కనిపించనున్నారని కోన వెంకట్ పేర్కొన్నారు. -
మరో తెలుగు సినిమాలో మాధవన్
చెలి, సఖి లాంటి సూపర్ హిట్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మాధవన్ ఇంతవరకు తెలుగులో ఒక్క స్ట్రయిట్ సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమాతో తొలిసారిగా ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. తాజాగా మాధవన్ మరో తెలుగు సినిమా అంగీకరించారన్న టాక్ వినిపిస్తోంది. భాగమతి సినిమా తరువాత అనుష్క ఇంతవరకు మరో సినిమా మొదలు పెట్టలేదు. సరైన కథ కోసం ఎదురుచూస్తున్న స్వీటీ మరో లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పారట. థ్రిల్లర్ జానర్‌తో తెరకెక్కనున్న ఈసినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్నారు.ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
మణిశర్మ నిర్మాతగా త్రీడీ సినిమా
సంగీత దర్శకుడు మణిశర్మ నిర్మాతగా మారారు. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆయన నిర్మించిన చిత్రం ‘ముంబాయి 125 కి.మీ’. కరణ్వీర్ బోరా, విదిత ప్రతాప్‌సింగ్, వీణామాలిక్, అపర్ణా బాజ్‌పాయ్ ఇందులో ముఖ్యతారలు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘త్రీడీ హారర్ చిత్రమిది. మొత్తం తలకోన, ముంబై అడవుల్లో చిత్రీకరించాం. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలైట్. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో పాటలు విడుదల చేయబోతున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ షా.