అనుష్క, మాధవన్‌తో ‘నిశ్శబ్దం’ చిత్రం తెరకెక్కించిన దర్శకుడు హేమంత్ మధుకర్ చాలా సైలెంట్‌గా రెండు సినిమాలు ప్లాన్ చేశారు. ఒకటి తెలుగు చిత్రం. ఇంకోటి హిందీ సినిమా. తెలుగు చిత్రానికి రచయిత గోపీమోహన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని రూపొందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే ఈ సినిమాని నిర్మించనుందని టాక్. హిందీలో తెరకెక్కించనున్నది మల్టీస్టారర్ మూవీ. బాలీవుడ్‌లో ‘ఏ ఫ్లాట్’ అనే చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్నారు హేమంత్ మధుకర్. తాజా చిత్రానికి ‘బాతే’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘కహానీ, పింక్’ చిత్రాల రచయిత రితేష్ షా స్క్రీన్‌ప్లే అందించనున్నారని, 70 శాతం షూటింగ్ లండన్‌లో జరగనుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment