
తెలుగుతో పాటు దాదాపు అన్ని సౌతిండియా ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ తాప్సీ పన్ను. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. తాను త్వరలోనే పగ తీర్చుకుంటానని ఓ ఇంటర్వూలో తెలిపింది. ఎవరిపై అనుకుంటున్నారా సినిమా అవార్డులు ఇచ్చేవారిపై.
ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘రష్మి రాకెట్’ అనే మూవీలో లీడ్‌రోల్ నటిస్తోంది. అయితే ఇటీవల ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వూలో మాట్లాడింది. అందులో ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా అని అడగగా..‘నాకో అవార్డు ఇవ్వండని ఎవరిని అడగాలి. ఏం చేయాలో నాకు తెలీదు. నేను నటనలో నా బెస్ట్ చూపిస్తూ వెళ్లడం మాత్రమే నా చేతుల్లో ఉంది. అయినా రెగ్యులర్ అవార్డే ఇంత వరకు రాలేదు. నేషనల్ అవార్డు కోసం ఎలా లాబియింగ్ చేయగలను’ అని తెలిపింది.
నిజానికి ‘పింక్’ సినిమాలో తన నటనకి గుర్తింపుతో పాటు అవార్డు వస్తుందని తాప్పీ అనుకుంది. కానీ అలాంటిదేమి జరగలేదు. కొన్నింట్లో నామినేషన్ కూడా రాలేదు. ఈ తరుణంలో తన పర్మామెన్స్‌కి పదును పెట్టుకుంటూ.. ప్రతిభ ఉన్న వారికి కాకుండా కాకా పట్టేవారికి అవార్డులు ఇచ్చే వారిపై పగ తీర్చుకుంటానని ఈ బ్యూటీ చెప్పింది.
అయితే తాప్సీ నటించిన తాజా చిత్రం ‘రష్మీ రాకెట్’ అక్టోబర్ 15న ఓటీటీ విడుదల కానుంది. కాగా ఈ భామ ప్రస్తుతం ఇండియన్ మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ బయోపిక్‌గా వస్తున్న ‘శభాష్ మిథు’తోపాటు ‘లూప్ లపేటా’, ‘దోబారా’ వంటి వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతుంది.
చదవండి: ఇలాంటి శరీరం తాప్సీకి మాత్రమే ఉంటుంది.. నటి ఘాటు రిప్లై
Comments
Please login to add a commentAdd a comment