PM Modi Congratulates The Kashmir Files Movie Team, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

The Kashmir Files Movie: ఆ సినిమాకు ప్రధాని మోదీ ప్రశంసలు..

Published Sun, Mar 13 2022 11:19 AM | Last Updated on Sun, Mar 13 2022 11:51 AM

Prime Minister Narendra Modi Appriciates The Kashmir Files Movie Team - Sakshi

Prime Minister Narendra Modi Appriciates The Kashmir Files Movie Team: సామాజిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించే దర్శకులలో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఇదివరకు ఆయన తెరకెక్కించిన 'ది తాష్కెంట్‌ ఫైల్స్‌' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా 90వ దశకంలో కశ్మీర్​ పండిట్​లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో డైరెక్టర్‌ వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్‌'. ఈ సినిమాలో బాలీవుడ్‌ పాపులర్‌ నటులైన అనుపమ్​ ఖేర్, మిథున్​ చక్రవర్తి, దర్శన్​ కుమార్, పల్లవి జోషి కీలకపాత్రల్లో నటించారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టగా.. విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఇటీవలే హర్యానా, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు ఈ సినిమాకు పన్ను మినహాయింపును కూడా ప్రకటించాయి. 

చదవండి:  డైరెక్టర్‌ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ

అయితే తాజాగా 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' చిత్రబృందం శనివారం (మార్చి 12) ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆ సినిమాను, మూవీ యూనిట్‌ను అభినందించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేస్తూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాను ఆయ ప్రశంసించడం, దాని గొప్పతనం గురించి చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రత్యేకం. మేము ఆ చిత్రాన్ని నిర్మించడంలో ఎప్పుడూ గర్వపడలేదు. ధన్యవాదాలు మోదీజీ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ ప్రేక్షకులతో పంచుకున్నారు డైరెక్టర్‌ వివేక్ అగ్నిహోత్రి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement