Abhishek Agarwal
-
నేషనల్ అవార్డ్.. మా బాధ్యత పెంచింది: కార్తికేయ 2 నిర్మాత
70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. రెండవసారి(గతేడాది కశ్మీర్ ఫైల్స్ ఉత్తమ చిత్రంగా నిలిచింది)నేషనల్ అవార్డు రావడం తమ బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. అవార్డు ప్రకటన వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరుసగా రెండు సార్లు నేషనల్ అవార్డులు రావడం గర్వగా ఉందన్నారు. కార్తీకేయ 2లో నటించిన నటీనటులతో పాటు పాటు టెక్నీషియన్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, అందరి కష్టానికి ప్రతిఫలమే ఈ అవార్డు’అని అన్నారు.(చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)సంతోషంగా ఉంది: నిఖిల్కార్తికేయ 2కి నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉందని అన్నారు హీరో నిఖిల్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ‘మన ‘కార్తికేయ 2’ జాతీయ అవార్డుకు ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలనిపించింది. ఈ సినిమా విజయాన్ని అందుకోవడానికి, జాతీయ పురస్కారానికి ఎంపికవ్వడానికి కారణం చిత్ర బృందం. నిర్మాతలు, దర్శకుడు చందూ, హీరోయిన్ అనుపమ, డీవోపీ కార్తిక్ ఘట్టమనేని.. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని నిఖిల్ అన్నారు. తమ చిత్రానికి జాతీయ పురస్కారం రావడం పట్ల కార్తికేయ2 చిత్ర బృందం ఆనందాన్ని వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో కార్తికేయ మంచి వసూళ్లు సాధించడమే కాకుండా అవార్డులు కూడా రావడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. హైదరాబాద్ లోని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కార్యాలయం వద్ద దర్శకుడు చందు మొండేటి, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్ , టీజీ విశ్వప్రసాద్ లు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. కార్తికేయ2 తాము ఆశించిన దానికంటే ఎక్కువే ఇచ్చిందని... జాతీయ పురస్కారానికి తమ చిత్రాన్ని ఎంపిక చేసిన ప్రధాని నరేంద్రమోదీ, నేషనల్ అవార్డు జ్యూరీ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్తికేయ3పై ప్రాథమిక ప్రకటన చేసిన దర్శకుడు చందు... స్క్రిప్ట్ వరకు తుది దశకు చేరిందన్నారు. -
అభిషేక్ అగర్వాల్ నుంచి ‘ది ఢిల్లీ ఫైల్స్ ’ .. రిలీజ్ ఎప్పుడంటే?
‘ది కశ్మీర్ ఫైల్స్’(2022) సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించారు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై రూపొందిన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. తాజాగా వివేక్ రంజన్ అగ్నిహోత్రి డైరెక్షన్లోనే ‘ది ఢిల్లీ ఫైల్స్’ సినిమా చేయనున్నట్లు అభిషేక్ అగర్వాల్ చెప్పారు.తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్– ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్‌పై అభిషేక్ అగర్వాల్, అర్చన అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి నిర్మించనున్నారు. ‘‘షెడ్యూల్ ప్రకారం ‘ది ఢిల్లీ ఫైల్స్’ షూటింగ్ ఈ ఏడాదిలో ప్రారంభం అవుతుంది.. వచ్చే ఏడాది విడుదలవుతుంది. ఇందులో బిగ్ స్టార్లు లేరు.. బిగ్ కంటెంట్ మాత్రమే ఉంది’’ అని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. -
తప్పని పరిస్థితిలో నేడు మీడియా ముందుకు హీరో రవితేజ
టాలీవుడ్ హీరో రవితేజ నేడు మీడియా ముందుకు రానున్నారు. తాజాగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు చిత్రం విడుదలైన మొదటిరోజు నుంచే ఒక విమర్శ ఉంది. సినిమా రన్‌టైమ్ 3గంటలు ఉండటం టైగర్ నాగేశ్వరరావుకు పెద్ద మైనస్ అయింది. కొన్ని అవసరం లేని సీన్లతో ప్రేక్షకులను బోర్ కొట్టించారని విమర్శలు రావడంతో మేకర్స్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. 3గంటల నిడివి కాస్త 2 గంటల 37 నిమిషాలకు కుదించారు. ఈ విషయాన్ని తాజాగా టైగర్ నాగేశ్వరరావు మేకర్స్ ప్రకటించారు. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) ఇదే విషయంపై నేడు హీరో రవితేజ మీడియా సమావేశం పెట్టనున్నారు. సినిమా విడుదల సమయంలో కూడా ఆయన తెలుగు మీడియాకు పెద్దగా ఇంటర్వ్యూలు ఏమీ ఇవ్వలేదు. టాలీవుడ్లో రవితేజను ఎలాగూ ఆదరిస్తారు కాబట్టి 'టైగర్ నాగేశ్వరరావు' మార్కెట్‌ను పెంచుకునేందుకు ఎక్కువగా బాలీవుడ్, కోలీవుడ్‌లోనే పలు మీడియా సమావేశాలు నిర్వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను కూడా ముంబైలోనే ఆయన లాంచ్ చేశారు. ఇన్ సైడ్ వర్గాల కథనం ప్రకారం రవితేజకు తెలుగు మీడియా మీద పెద్దగా ఆసక్తి లేదని సమాచారం. ప్రముఖ మీడియా సంస్థల నుంచి కాకుండా యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించే వారు సరైన ప్రశ్నలు అడగరని ఆయనలో ఒక అపనమ్మకం ఉందట. దీంతో టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం టాలీవుడ్ మీడియాకు నో చెప్పి బాలీవుడ్ మీడియాకు ఎడా పెడా ఇంటర్వ్యూలు ఇచ్చారు రవితేజ. కానీ సినిమా విడుదలకు ముందు పరిస్థితి ఇలా ఉన్నా.. అనంతరం మూవీపై నెగటివిటీ రావడంతో టైగర్ నాగేశ్వరరావు టీమ్‌లో మార్పు వచ్చింది. ఎలాగైనా సినిమాను నిలబెట్టుకోవాలని యూనిట్ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే తాజాగా సినిమా నిడివి తగ్గించారు. ఇదే విషయంపై హీరో రవితేజ టైగర్ నాగేశ్వరరావు గురించి పలు విషయాలను నేడు మీడియా ముందు తెలపనున్నారు. టాలీవుడ్లో తన సినిమాను మీడియా ద్వారా ప్రమోట్ చేయాలని రవితేజ ఆలోచించినట్లు సమాచారం. సినిమా రన్‌టైమ్ తగ్గించడంతో కొత్తగా చూసేవారు తప్పకుండా టైగర్ నాగేశ్వరరావును ఆదరిస్తారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. -
అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి
రవితేజ టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇందులో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరో యిన్లుగా నటించారు. వంశీకృష్ణ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ చెప్పిన విశేషాలు. ► మంచి కంటెంట్, కొత్త కథలను చెప్పడమే మా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే పవర్ఫుల్ కంటెంట్ ఉన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చేశాం. ఈ సినిమా చేయడానికి ముందే నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను సంప్రదించి, ఆయన పూర్తి వివరాలు తెలుసుకున్నాం. టైగర్ నాగేశ్వరరావు దొంగగా మార డానికి దారి తీసిన కారణాలు, పరిస్థితులు ఏమై ఉంటాయి? ఆయన దొంగగా మారిన తర్వాత ఏం చేశారు? అనే అంశాలు ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. ► రవితేజగారు హార్డ్‌వర్క్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లన్నీ ఆయనే చేశారు. ఓ రోజు ఆయన చేతికి గాయమైంది. లొకేషన్లో ఐదారు వందలమంది ఉన్నారు. ్ర΄÷డక్షన్ కాస్ట్ వృథా కాకూడదని, ఆయనకు ఇబ్బందిగా ఉన్నా షూటింగ్లో ΄ాల్గొన్నారు. ఇక అనుపమ్ ఖేర్‌గారు నా లక్కీ చార్మ్ అనే చె΄్పాలి. ఫలానా ΄ాత్ర చేయాలని అనుపమ్గారిని కోరితే వెంటనే ఓకే అంటారు. నాపై ఆయనకు ఉన్న నమ్మకం అలాంటిది. హేమలతా లవణంగా రేణూ దేశాయ్ బాగా నటించారు. రేణూదేశాయ్ 2.ఓ చూస్తారు. ప్రత్యేక శ్రద్ధతో జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించాడు. అవినాష్ కొల్లా అద్భుతంగా ఆర్ట్ డైరెక్షన్ చేశాడు. దర్శకుడిగానే కాదు.. నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకుని పని చేశారు వంశీ. కథకు ఏది అవసరమైతే అది నేను వందశాతం ఇస్తాను. నిర్మాణంలో రాజీపడను. నా కెరీర్లో ఓ మంచి గుర్తుగా నిలిచి΄ోతుంది ‘టైగర్ నాగేశ్వరరావు’. ► పండగ అంటే రెండు, మూడు సినిమాలు రావడం సహజం. మా సినిమా కంటెంట్‌పై నమ్మకం ఉంది. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం కూడా ఉంది. నార్త్‌లోనూ మంచి ΄ాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ► తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతగా నేను అవుట్‌సైడర్‌ని. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వచ్చిన మూడేళ్ళలో నిర్మాతగా జాతీయ అవార్డు (‘కశ్మీరీ ఫైల్స్’ చిత్రం) అందుకోవడం మా సంస్థకు గౌరవాన్ని తెచ్చింది. అవార్డు అందుకుంటున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. మా బ్యానర్లో త్వరలో ఓ క్రేజీ బయోపిక్ ప్రకటిస్తా. -
Tiger Nageswara Rao: రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
టైగర్ నాగేశ్వరరావు షూటింగ్లో ప్రమాదం.. రవితేజ మోకాలికి తీవ్ర గాయం..
టైగర్ నాగేశ్వరరావు.. స్టూవర్ట్పురంలోనే కాదు దేశంలోనే పేరు మోసిన గజదొంగ.. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్‌గా పని చేసిన ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. చిత్రీకరణ సమయంలో రవితేజ గాయపడ్డాడని పేర్కొన్నాడు. ట్రైన్ దోపిడీ సీన్లో రైలు మీది నుంచి లోపలకు దూకే షాట్లో రవితేజ అదుపుతప్పి కిందపడ్డారని తెలిపాడు. ఆ సమయంలో మోకాలికి బాగా దెబ్బ తగలడంతో ఆస్పత్రికి తరలించగా 12 కుట్లు వేసినట్లు పేర్కొన్నాడు. ఆ షాట్లో దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులున్నారని, కావున షూటింగ్‌ను ఎక్కువ రోజులు వాయిదా వేస్తే నిర్మాత నష్టపోతాడని అర్థం చేసుకున్న హీరో రెండు రోజుల్లోనే మళ్లీ షూటింగ్‌కు రెడీ అయిపోయాడని వివరించాడు. విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా తను పట్టించుకోలేదని, సినిమాపై ఆయనకున్న అంకితభావానికి ఇది నిదర్శనమని చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్.. రవితేజ ఎంతైనా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఆ వెర్రిపుష్పాన్ని టాస్కులో మడతపెట్టేయాల్సింది.. ఒక్క టాస్క్ పడనీ, చెప్తా..! -
అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ రైడ్స్
-
ప్రముఖ నిర్మాత కార్యాలయంలో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో ఆదాయపన్నుశాఖ సోదాలు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం నుంచే ఐటీ బృందం అభిషేక్ కార్యాలయంలో సోదాలు జరుపుతోంది. కాగా ఈ బ్యానర్లో మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 20న విడుదల కానుంది. సినిమా రిలీజ్‌కు కొద్ది రోజుల గడువు మాత్రమే ఉన్న తరుణంలో అభిషేక్ కార్యాలయంలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. కాగా అభిషేక్ అగర్వాల్ గతేడాది బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించాడు. ద కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, ధమాకా చిత్రాలన్నీ ఈయన బ్యానర్ నుంచి వచ్చినవే! -
మిషన్ సిద్ధం
తేజేశ్వర్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మిషన్ సి 1000’. ప్రగ్య నయన్ హీరోయిన్. టి. విరాట్, సుహాసిని నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను నిర్మాత అభిషేక్ అగర్వాల్ రిలీజ్ చేశారు. తేజేశ్వర్ మాట్లాడుతూ– ‘‘తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. శ్రీధర్ ఆత్రేయ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో మొత్తం మూడు పాటలున్నాయి. ముఖ్యంగా శ్రీరాముడిపై చిత్రీకరించిన పాట ఈ మూవీలో హైలెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘త్వరలో సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. -
జాతీయ అవార్డ్స్ కోసం లాబీయింగ్.. స్పందించిన నిర్మాత
69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’కు రెండు అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ కూడా తెలుగు చిత్రసీమకు చెందినవారే కావడం విశేషం. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా గుర్తించి అందుకు గాను జాతీయ అవార్డును ప్రకటించారు. అంతేకాకుండా ఇందులో తన నటనతో మెప్పించిన పల్లవి జోషికి ఉత్తమ సహాయనటి విభాగంలో అవార్డు దక్కింది. ఈ అంశంపై తాజాగ నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్పందించారు. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాకు రెండు జాతీయ అవార్డ్స్ రావడం చాలా సంతోషంగా ఉందని అభిషేక్ తెలిపారు. ఈ సినిమా ప్రారంభం నుంచి తమకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని ఆయన తెలిపారు. సినిమాను చూసిన కొందరు యాంటీ ముస్లిం అంటూ కామెంట్లు చేశారు.. ఈ విధంగా ఎలా కామెంట్ చేశారో ఇప్పటికీ అర్థం కాలేదని ఆయన అన్నారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా యాంటీ టెర్రరిస్ట్ కథాంశంతో తెరకెక్కిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా డైరెక్టర్ వివేక్ అమెరికాలో ఉన్నారని, ఈ అవార్డుతో ఆయన మరింత సంతోషంగా ఉన్నారని తెలిపారు. (ఇదీ చదవండి: అవమానాలు భరించి వెండితెరపై సత్తా చాటిన అల్లు అర్జున్) ప్రస్తుతం తెలుగు సినిమా అనేది రాష్ట్రాన్ని దాటి ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని చెప్పారు. కొందరు రాజకీయాల్లో వస్తున్నానంటూ తన గురించి ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని తను ఎప్పటికీ రాజకీయాలకు దూరం అని చెప్పాడు. అంతేకాకుండా అవార్డ్స్ కోసం లాబీయంగ్ చేశారంటూ కొందరు చెబుతున్నారని ఈ అవార్డ్స్ కోసం ఎలాంటి లాబీయింగ్ చెయ్యలేదని అసలు అలాంటి విషయాలు తనకు తెలీయదని అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. '69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో మా ‘ది కశ్మీర్ ఫైల్స్’కు రెండు అవార్డులు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ది కశ్మీర్ ఫైల్స్ ఇది ప్రజల సినిమా. ప్రజలు ఎంతో గొప్పగా ఆదరించారు. ఈరోజున దేశ ప్రజలే ఈ అవార్డు గెలుచుకున్నారు. దేశ ప్రజలకు, కశ్మీర్ పండిట్లందరికీ ఈ పురస్కారాల్ని అంకితమిస్తున్నాం. అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డ్ పొందడం చాలా అనందంగా ఉంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆరు జాతీయ అవార్డులు రావడం, ఉప్పెన, కొండపొలం పాటకి చంద్రబోస్‌కు అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే కార్తికేయ 2 తర్వాత ప్రస్తుతం నిర్మిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం. పాన్ ఇండియా ఆడియన్స్ అలరించే కంటెంట్ టైగర్ నాగేశ్వరరావులో ఉంది. అక్టోబర్ 20న విడుదల చేస్తున్నాం. దానికి కూడా జాతీయ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం కావాలి.'' అని అన్నారు. వాస్తవిక అంశాల చుట్టూ ది కాశ్మీర్ ఫైల్స్ ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం 2022లో విడుదలై భారీ కలెక్షన్స్‌తో పాటు పలు వివాదాలను కూడా క్రియేట్ చేసింది. దీనిని వివేక్ అగ్నిహోత్రి రచించి, అతనే దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీరీ హిందువుల వలసలను వర్ణిస్తుంది. వాస్తవిక అంశాలనే కథాంశంగా దీనిని నిర్మించారు. కశ్మీర్ ఫైల్స్ కోసం మొత్తం షూటింగ్ జరిగిపింది నెలరోజులే. కానీ కథ కోసం రెండేళ్లపాటు దర్శకుడు పరిశోధన చేశాడు. ఈ సినిమా కోసం కశ్మీర్ రాష్ట్రం దాటి వెళ్లిపోయిన ఏడువందల మంది కశ్మీరీ పండిట్లను ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి నటించారు. అగ్నిహోత్రి రూపొందించిన ఫైల్స్ త్రయంలో ఇది రెండవ చిత్రం, దీనికి ముందు ది తాష్కెంట్ ఫైల్స్, తరువాత ది ఢిల్లీ ఫైల్స్ ఉన్నాయి. -
ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మూవీకి సంబంధించిన పదివేల టికెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ సంచలన ప్రకటన చేశారు. (ఇది చదవండి: 'ఆదిపురుష్' సినిమాపై వివాదం.. స్పందించిన చిత్రబృందం!) 'శ్రీరాముని ప్రతి అధ్యాయం గురించి తెలుసుకోవాలి. ఆయన అడుగు జాడల్లో మన నడవాలి. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు పది వేల టికెట్లు ఉచితంగా అందిస్తాం. టికెట్ల కోసం గూగుల్ ఫాం నింపితే చాలు. టికెట్స్ నేరుగా పంపిస్తాం. ' అని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. (ఇది చదవండి: ప్రముఖ నటుడి కుమార్తెపై ట్రోలింగ్.. గట్టిగానే ఇచ్చి పడేసింది!) #Adipurush: 10,000+ tickets would be given to the Government schools, Orphanages & Old Age Homes across Telangana for free by TKF & Karthikeya2 Producer Abhishek Agarwal! Fill the Google form with your details to avail the tickets.https://t.co/1cGGJZ5xcf pic.twitter.com/SWWomcahZ9 — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) June 7, 2023 10,000+ tickets would be given to the Government schools, Orphanages & Old Age Homes across Telangana for free by TKF & Karthikeya2 Producer Abhishek Agarwal! Fill the Google form with your details to avail the tickets. https://t.co/qUQdLJiPi4#Prabhas #Adipurush pic.twitter.com/xpyf2aVHLS — Prabhas RULES (@PrabhasRules) June 7, 2023 -
మెగా ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న రామ్ చరణ్
-
The India House: స్వాతంత్య్రానికి పూర్వం..
‘ది ఇండియా హౌస్’ లోకి నిఖిల్ ఎంట్రీ ఇస్తున్నారు. నిఖిల్ హీరోగా అనుపమ్ ఖేర్ ఓ లీడ్ రోల్లో నటించనున్న తాజా చిత్రం ‘ది ఇండియా హౌస్’. ‘జై మాతా ది’ అనేది ఉపశీర్షిక. వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రామ్‌చరణ్, విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా ‘ది ఇండియా హౌస్’ సినిమా ప్రకటన వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు రామ్‌చరణ్, అభిషేక్ అగర్వాల్. ఈ సినిమాలో శివ పాత్రలో నిఖిల్, సయామీ కృష్ణ వర్మగా అనుపమ్ ఖేర్ కనిపిస్తారు. ‘‘లండన్ లో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. On the occasion of the 140th birth anniversary of our great freedom fighter Veer Savarkar Garu we are proud to announce our pan India film - THE INDIA HOUSEheadlined by Nikhil Siddhartha, Anupam Kher ji & director Ram Vamsi Krishna! Jai Hind!@actor_Nikhil @AnupamPKher… pic.twitter.com/YYOTOjmgkV— Ram Charan (@AlwaysRamCharan) May 28, 2023 -
‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ మరో సంచలన మూవీ, టైటిల్, ఫస్ట్‌లుక్ అవుట్
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన హిందీ చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. కశ్మీర్ పండిట్ల ఊచకోత నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ. 340 కోట్లు వసూళు చేసి రికార్డు సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నీహోత్రి దర్శకత్వం వహించగా.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీతో ఒక్కసారిగా సంచలనంగా మారిన ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. చదవండి: తన స్థానంలోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్ మరో యథార్థ సంఘటనతో ‘ది కశ్మీర్ ఫైల్స్’ టీం రెడీ అయింది. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దీనికి సంబంధించిన ప్రకటనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ట్విటర్ వేదికగా రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు ‘ది వ్యాక్సిన్ వార్’ అని టైటిల్‌ను ఖారారు చేసి ఈ సినిమా దాదాపు 11 భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించాడు. దీంతో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ANNOUNCEMENT: Presenting ‘THE VACCINE WAR’ - an incredible true story of a war that you didn’t know India fought. And won with its science, courage & great Indian values. It will release on Independence Day, 2023. In 11 languages. Please bless us.#TheVaccineWar pic.twitter.com/T4MGQwKBMg — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) November 10, 2022 -
కిషన్‌రెడ్డి స్వగ్రామాన్ని దత్తత తీసుకున్న కార్తికేయ 2 నిర్మాత అభిషేక్
సాక్షి, హైదరాబాద్: పల్లెల అభివృద్ధికి కృషి చేయడం నిజమైన ధర్మం, దేశభక్తి అని కశ్మీర్ ఫైల్స్ చిత్రం దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి పేర్కొన్నారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2’వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వగ్రామం కావడం విశేషం. ఆదివారం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఏర్పాటు చేసిన తన చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివస్‌లో భాగంగా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తిమ్మాపూర్ విలేజ్ మైల్ స్టోన్ ఆవిష్కరణ సభకు బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, యూపీ మంత్రి మంత్రి నందగోపాల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, కావ్యరెడ్డి, నటి పల్లవి జోషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. అభిషేక్ అగర్వాల్ తన తండ్రి తేజ్ నారాయణ్ పుట్టిన రోజున గ్రామాన్ని దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మాట్లాడుతూ గ్రామ విద్యార్థులు వసతులను సరిగ్గా వినియోగించుకుని భవిష్యత్‌లో స్ఫూర్తినిచ్చే గొప్ప వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. యూపీ మంత్రి నందగోపాల్ మాట్లాడుతూ.. తిమ్మాపూర్ ఆదర్శ గ్రామంగా మారేలా సేవా కార్యక్రమాలు ముందుకు సాగాలని కోరారు. తన అత్తగారి గ్రామమైన తిమ్మాపూర్‌ను దత్తత తీసుకోవడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యరెడ్డి తెలిపారు. చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివస్‌లో భాగంగా తిమ్మాపూర్ గ్రామ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను వితరణ చేశారు. కార్యక్రమాన్ని చేపట్టిన అభిషేక్ అగర్వాల్‌ను ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు శ్రీశ్రీ రవిశంకర్ వర్చువల్‌గా అభినందించారు. -
తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్
-
గ్రామాన్ని దత్తత తీసుకున్న ‘ది కాశ్మీర్ ఫైల్స్’ నిర్మాత
ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 చిత్రాల దర్శకుడు అభిషేక్ అగర్వాల్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నాడు. కోవిడ్ సమయంలో చాలా మంది పేదలకు సహాయం చేసిన ఆయన.. తాజాగా మరో అడుగు ముందుకేశాడు.గత రెండు బ్లాక్బస్టర్లతో మంచి లాభాలను ఆర్జించిన ఈ యువ నిర్మాత ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు. ఈ గ్రామం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన్మస్థలం కావడం గమనార్హం. అభిషేక్ అగర్వాల్- మంత్రి కిషన్ రెడ్డి మధ్య మంచి అనుబంధం ఉంది. వివిధ ఈవెంట్లు , ఫంక్షన్లలో చాలాసార్లు వీరు కలిసి కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. అభిషేక్ అగర్వాల్, అతని కుటుంబం చంద్రకళ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు. తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు, దివంగత అమ్మమ్మ శ్రీమతి చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. -
‘కార్తికేయ 2’ హిట్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు: నిఖిల్
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన చిత్రం కార్తికేయ 2. భారీ అంచనాల మధ్య ఈ శనివారం(ఆగస్ట్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకుంది. దీంతో విడుదలైన రోజు సాయంత్రమే చిత్రబృందం థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ.. తమ సినిమాని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టడం సంతోషంగా ఉందన్నారు. (చదవండి: ‘ కార్తికేయ2 ’ మూవీ రివ్యూ) ‘యూఎస్‌లో కార్తికేయ2కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికీ కొంచెం టెన్షన్‌గా ఫీలయ్యాను. తెలుగు ప్రేక్షకులు మా సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడ్డాను. కానీ మీడియా షో అవ్వగానే నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అన్ని చోట్ల హౌస్‌ఫుల్ అవుతున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. నా సినిమా హిట్ అవ్వాలని చాలామంది కోరుకున్నారు. రేపు, ఎల్లుండి కూడా బుకింగ్స్ బాగున్నాయి. ఇది ఇలానే కొనసాగుతుందని అనుకుంటున్నాను. చందు మంచి పాయింట్‌ని తీసుకొని సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా కోసం కష్టపడిన టెక్నీషియన్స్ అందరికి థ్యాంక్స్’అని అన్నాడు. నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ, కార్తికేయ-2 విజయం నారాయణ దాస్ నారంగ్ గారికి అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విడుదలైన ప్రతిచోట్ల, ఓవర్సీస్లోనూ మంచి ఆదరణ పొందుతోందని తెలిపారు. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ.. దర్శకుడు చందు మొండేటి కథ చెప్పిన దానికంటే అద్భుతంగా ఈ సినిమాను తీశారు. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. సినిమాకి అని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెబుతున్నారు. కార్తికేయ 2 సాంకేతిక నిపుణలకు కృతజ్ఞతలు’ అన్నారు. దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. రెండు పాండమిక్స్ తరువాత ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా సక్సెస్ తో ఆ కష్టం అంతా మర్చిపోయాను. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. -
టైగర్ నాగేశ్వరరావు బయోపిక్: రవితేజ సినిమాలో అనుపమ్
ప్రముఖ హిందీ నటుడు అనుపమ్ ఖేర్ ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రంలో కీలక పాత్ర అంగీకరించారు. రవితేజ టైటిల్ రోల్లో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ‘ది కశ్మీరీ ఫైల్స్’లో అనుపమ్ చేసిన పుష్కర్ నాథ్ పండిట్ పాత్ర సినిమాకి హైలైట్‌గా నిలిచింది. మళ్లీ అభిషేక్ నిర్మాణంలో మరో సినిమా చేయనుండటం పట్ల అనుపమ్ ఆనందం వ్యక్తం చేశారు. స్టువర్ట్పురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా 1970 నేపథ్యంలో రూపొందుతోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’లో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదే కాదు.. నిఖిల్ ‘కార్తికేయ 2’లోనూ అనుపమ్ కీలక పాత్ర చేస్తున్నారు. -
నైట్ షూట్లో నాగేశ్వరరావు
దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు రవితేజ. ఈ మెళకువలన్నీ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా కోసమే. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నాగేశ్వరరావు పాత్రను రవితేజ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకున్నారు. అలాగే సంభాషణలు పలికే తీరు కూడా వినూత్నంగా ఉంటుంది. రవితేజ నటిస్తున్న ఈ తొలి పాన్ ఇండియా చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నైట్ షూట్ జరుగుతోంది. ఈ సెట్లో జరుగుతున్న సందడి తాలూకు వీడియోను రవితేజ షేర్ చేశారు. నాగేశ్వరరావు రాత్రిపూట చేసే దొంగతనానికి సంబంధించిన సీన్స్‌ని చిత్రీకరిస్తున్నారని సమాచారం. రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్ నిర్మాత. -
రెండు సినిమాలు అనౌన్స్ చేసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్
ఈ ఏడాది మార్చిలో రిలీజైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, తేజ్ నారాయణ్ అగర్వాల్, పల్లవి జోషి ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం వివేక్ అగ్నహోత్రి దర్శకత్వంలోనే రెండు సినిమాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం (మార్చి 11) అభిషేక్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాలను ప్రకటించారు. ‘నిజాయితీతో కూడిన రెండు కొత్త కథలతో సినిమాలు నిర్మించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాలను తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి, పల్లవి జోషి నిర్మిస్తారు. ‘‘ఈ సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. -
నిఖిల్ 'కార్తికేయ 2'గా వచ్చేది అప్పుడే..
Nikhil Karthikeya 2 Movie Release Date Announced: టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. హ్యాపీ డేస్ సినిమాతో వెండితెరకు పరిచయమైన నిఖిల్ ప్రస్తుతం ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నాడు. 2014లో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ' చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ 'కార్తికేయ 2' రానున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ 'కార్తికేయ 2' మూవీ ప్రొడ్యూసర్లలో ఒకరు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోమవారం (ఏప్రిల్ 11) ఈ సినిమా విడుదల తేదిని రివీల్ చేశారు. 'కార్తికేయ 2' జూలై 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. శ్రీకృష్ణుడు నివసించిన ద్వారక, దాపర యుగానికి సంబంధించిన కథతో ఈ సినిమా వస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. చదవండి: 'నాలుగు సినిమాలకు సైన్ చేశాను.. ఇప్పుడేమో ఇలా అయ్యింది' The date is locked to enter the mystical world of Lord Sri Krishna with #Karthikeya2. Bringing you a GRAND BIG SCREEN EXPERIENCE on July 22nd.@actor_Nikhil @anupamahere @chandoomondeti @AbhishekOfficl @kaalabhairava7 @AnupamPKher @vishwaprasadtg @vivekkuchibotla @MayankOfficl pic.twitter.com/Qge561F3Hb — Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl) April 11, 2022 చదవండి: అనుపమ అల్లరిని బయటపెట్టిన నిఖిల్, షూటింగ్ టైంలో అలా.. -
The Kashmir Files: అందుకే పబ్లిసిటీ చేయలేదు.. నిర్మాత అభిషేక్ అగర్వాల్
‘సినిమా అనేది కమర్షియల్. కానీ ఐదు లక్షల మంది కశ్మీర్ పండిట్ల బాధలు, సమస్యలను 32 ఏళ్ల తర్వాత ‘ది కశ్మీర్ ఫైల్స్’మూవీతో బయటకు తెచ్చాం. ఈ చిత్రం యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇలాంటి సంఘటనలు జరిగాయా! అంటూ ఇవి చూస్తుంటే మాకే సిగ్గేస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంత మంచి సినిమాను నిర్మించినందుకు గర్వంగా ఉంది. కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు పాదాభివందనాలు చేస్తున్నాను’అన్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. 1980-90లలో కశ్మీర్లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ.. పెను సంచలనంగా మారింది. విడుదలైన అన్నిచోట్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్ లో తన సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను తెలియజేశారు. ఆ విశేషాలు. ► ముందుగా ఈ సినిమాను ఆదరిస్తున్న యావత్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రతి హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ► సినిమా విడుదలకు ఐదురోజుల ముందు ఒక మహిళ ఢిల్లీ నుంచి 20 వేల రూపాయలతో టికెట్ పెట్టుకుని నన్ను వెతుక్కుంటూ మరీ హైదరాబాద్‌కు వచ్చింది. వచ్చీ రాగానే తెగ ఏడ్చేసింది. నాకు ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రావడంలేదు. 32 ఏళ్ళ నుంచి మా పండిట్ ల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. నా కుటుంబం ఆ టైంలో ఎంతో సఫర్ అయింది అంటూ ఆమె జ్ఞాపకాలు తెలియజేసింది. అదే రోజు రాత్రి కశ్మీర్ పండిట్ ల తో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశాం. రెండు వేల మంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సార్ అని చెప్పారు. ►ఈ సినిమా చేసేటప్పుడు ఆర్టికల్ 370 గురించి రీసెర్ఛ్ చేశాం.. మూడు నెలలపాటు అమెరికా, కెనడ, దక్షిణాఫ్రికా మొదలైన ప్రదేశాలు తిరిగి అక్కడున్నవారి నుంచీ ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ► ఇది ప్రజల సినిమా. ఇతర సినిమాలు అదే టైంలో విడుదలైనా వారి ఇష్టం మేరకు ఆయా సినిమాలు చూస్తారు. మాది చిన్న సినిమా. అందుకే పెద్దగా పబ్లిసిటీ కూడా ఇవ్వలేదు. చిన్న సినిమా కాబట్టి ఎవరూ సపోర్ట్ చేయరని తెలుసు. కానీ సినిమా విడుదలయ్యాక అన్ని చోట్లనుంచి, ముఖ్యంగా తెలుగు చలన చిత్రరంగంలో ఎంతోమంది అభినందలు కురిపించారు. కశ్మీర్ పండితులకు ఈ సినిమా అంకితం చేస్తున్నాం. ► ప్రధాని నరేంద్రమోదీని కలవడం అనేది యాదృశ్చికంగా జరిగింది. ఒకరోజు ఆయన ఆఫీసునుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళి కలిశాం. ఆయనతో గడిపిన క్షణాలు మర్చిపోలేను. ► ఈ సినిమా తర్వాత పర్యావసనాలు ఏమైనా వుంటే ఛాలెంజ్ గా తీసుకున్నాం. సినిమా తీసేటప్పుడు కొంత ఫేస్ చేశాను. విడుదలకుముందు కొంత ఫేస్ చేశాను. ఇలాంటి సమస్యలు వస్తాయనే ముందుగాను ప్రిపేర్ అయ్యాను. ► నిజాయితీగా ఈ సినిమాను తెరకెక్కించాం. అందుకే ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదు. నేను ఏదైనా తప్పుగా చూపిస్తే ప్రజలే సపోర్ట్ చేయరు. ► త్వరలో దేశంలో అన్ని భాషల్లో డబ్ చేసే ఆలోచన వుంది. తెలుగులోకూడా డబ్ చేయబోతున్నాం. ► మా సినిమాకు అస్సాం, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్నాటకతోసహా మొత్తం 9 రాష్ట్రాలలో టాక్స్ మినహాయింపు వచ్చింది. ►ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కశ్మీర్ పండిట్ గా నటించారు. ఆయన పాత్రలో లీనమై పోయారు. ఆయనేకాదు చాలమంది నటీనటులు ఫీల్ అయి చేశారు. రాత్రి పూటా ఆ పాత్రలో మమేకం అయి నిద్ర సరిగ్గా పట్టేదికాదు. ► షూటింగ్ జరుగుతుండగా అనుపమ్ ఖేర్ ను అక్కడి హిందువులు డిన్నర్‌కు ఆహ్వానించేవారు. 90 ఏళ్ళ వృద్ధురాలు కూడా తను ఇంటిదగ్గర వండి భోజనం తీసుకువచ్చేది. ఇలా ఎంతోమంది హిందువులును కలిసి వారితో షేర్ చేసుకున్న సంగతులు నిర్మాతగా నాకు సంతృప్తినిచ్చాయి. ►ఈ సినిమాను అందరూ పర్సనల్ గా తీసుకుని నటించారు. దర్శకుడు పూర్తి క్లారిటీతో సినిమా తీశాడు. ►కొత్త సినిమాలు: రవితేజ తో నా డ్రీమ్ ప్రాజెక్ట్.. టైగర్ నాగేశ్వర రావు చేస్తున్నా. ఆ తర్వాత అబ్దుల్ కలాం బయోపిక్ చేయబోతున్నాం. అదేవిధంగా దర్శకుడు వివేక్‌తో ఢిల్లీ ఫైల్స్ అనే సినిమా ఆలోచనలో వుంది. -
ప్రధాని మోదీ మెచ్చిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'.. సినిమాలో ఏముంది ?
PM Narendra Modi Appreciates The Kashmir Files Movie Special Story: బాలీవుడ్ దిగ్గజ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషిలు కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ సినిమాకు ప్రముఖ బీటౌన్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. ఆయన ఇదివరకూ 'ది తాష్కెంట్ ఫైల్స్' అనే సినిమాతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించడంలో వివేక్ అగ్నిహోత్రి అస్సలు వెనుకాడరు. అలా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించిందే 'ది కశ్మీర్ ఫైల్స్'. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు హరియానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా తమవంతు సాయంగా పన్ను రాయితీని ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. మరీ ఇంతలా ఆకట్టుకుంటున్నా 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాలో ఏముంది ? ఈ మూవీ కథేంటీ ? అనే సందేహం రాకుండా ఉండదు. ఆ సందేహం వచ్చిన ప్రేక్షకుల కోసమే 'సాక్షి' స్పెషల్ స్టోరీ. కశ్మీర్ పండిట్లపై సాముహిక హత్యాకాండ.. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా కథ 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండకు అద్దం పడుతుంది. కశ్మీర్ లోయలోని ఓ వర్గంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణ మారణ కాండకు పాల్పడ్డారు. కశ్మీరీ మహిళలను వివస్త్రలుగా చేసి, సాముహిక మానభంగానికి ఒడిగట్టారు. ఆ లోయలో ఉండాలంటే మతం మారాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. అడ్డుకున్న వారిని అడ్డుతొలగించుకుంటారు. వారి ఆస్తులను దోచుకున్నారు. ఎదురు తిరిగినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. తుపాకులు, కత్తులతో దారుణంగా దాడి చేశారు. పాకిస్తాన్ జిహాదీ మూకతో చేతులు కలిపి ఆకృత్యాలకు పాల్పడటం వారిని కలచివేసింది. ఈ దారుణమైన ఉదంతానికి పర్యవసానంగా సుమారు 5 లక్షల మంది కశ్మీరీ పండిట్లు స్వదేశంలోనే శరణార్థులుగా మారారు. దీంతో వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. ఢిల్లీ పురవీధుల ఫుట్పాత్స్పై ఏళ్ల తరబడి జీవితాన్ని గడిపారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. బాధ్యతాయుత పౌరుడిగా తీశాను.. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేందుకు, సినిమా రూపంలో తెరకెక్కిచ్చేందుకు ఎంతో గుండె ధైర్యం ఉండాలి. వాస్తవ గాథలను చిత్రీకరిస్తున్నామని చెప్పి అనేకమంది దర్శకనిర్మాతలు వసూళ్ల కోసం కక్కుర్తితో రాజీ పడి రూపొందిస్తుంటారు. కానీ ఎలాంటి రాజీ లేకుండా తెరకెక్కించారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ‘‘కశ్మీర్లో 1990వ దశకంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే విషయాలను ‘కశ్మీర్ ఫైల్స్’లో చూపించాం. కశ్మీర్లో జరిగిన అసలు సిసలైన వాస్తవాలు బయటకు రాలేదు. అందుకే బాధ్యతాయుత పౌరుడిగా నేను ఈ సినిమా తీశాను.. నాలుగేళ్లపాటు చాలా కష్టనష్టాలు అనుభవించాను. మా చిత్రం చూసి నిజాలు తెలుసుకోండి.’’ అని హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. ‘‘గడిచిన 30 ఏళ్లల్లో ‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి కథను ఎవరూ తీయలేదు’’ అని నిర్మాత అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. సినిమా చూసి కంటతడి పెట్టిన మహిళ.. అయితే మన దేశంలోని కశ్మీర్ ప్రాంతంలో జరిగిన ఈ అత్యంత భయానకమైన ఘటనను వెండితెరపై ఆవిష్కరించడం అంత సులువుకాదు. దర్శకనిర్మాతలకు ఈ సినిమా రూపొందించడం నల్లేరుపై నడకల జరగలేదు. 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ఈ చిత్రాన్ని ఆపేయమని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఈ మూవీని అడ్డుకోవడానికి కోర్టులో వ్యాజ్యాలు సైతం వేశారు. ఇలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి 'ది కశ్మీర్ ఫైల్స్'ను ఉన్నది ఉన్నట్లుగా నటీనటుల సహకారంతో వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో ప్రతీ సన్నివేశం, నటీనటుల భావోద్వేగపు యాక్టింగ్ ప్రేక్షకులను కదిలించేలా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సినిమా చూసిన అనేక మంది ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయి కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెటర్ సురేష్ రైనా తన ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక మహిళ వివేక్ పాదాలు తాకడం, సినిమా గురించి తన భావాన్ని వ్యక్తపరుస్తూ బిగ్గరగా ఏడవడం మనం చూడొచ్చు. అనంతరం డైరెక్టర్ వివేక్, నటుడు దర్శన్ కుమార్ ఆ మహిళను ఓదార్చారు. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి డైరెక్టర్, దర్శన్ కుమార్ సైతం కంటతడి పెట్టుకున్నారు. ప్రేక్షకుల నీరాజానలు అందుకుంటున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదలు కాగా మన దేశంలో 561 థియేటర్లలో, ఓవర్సీస్లో 113 స్క్రీన్స్‌లలో ప్రదర్శించబడుతోంది. Presenting #TheKashmirFiles It’s your film now. If the film touches your heart, I’d request you to raise your voice for the #RightToJustice and heal the victims of Kashmir Genocide.@vivekagnihotri @AnupamPKher @AdityaRajKaul pic.twitter.com/Gnwg0wlPKU — Suresh Raina🇮🇳 (@ImRaina) March 11, 2022 -
ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించిన సినిమా ఇదే..
Prime Minister Narendra Modi Appriciates The Kashmir Files Movie Team: సామాజిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించే దర్శకులలో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఇదివరకు ఆయన తెరకెక్కించిన 'ది తాష్కెంట్ ఫైల్స్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా 90వ దశకంలో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ సినిమాలో బాలీవుడ్ పాపులర్ నటులైన అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలకపాత్రల్లో నటించారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టగా.. విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఇటీవలే హర్యానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఈ సినిమాకు పన్ను మినహాయింపును కూడా ప్రకటించాయి. చదవండి: డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ అయితే తాజాగా 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రబృందం శనివారం (మార్చి 12) ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆ సినిమాను, మూవీ యూనిట్‌ను అభినందించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేస్తూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఆయ ప్రశంసించడం, దాని గొప్పతనం గురించి చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రత్యేకం. మేము ఆ చిత్రాన్ని నిర్మించడంలో ఎప్పుడూ గర్వపడలేదు. ధన్యవాదాలు మోదీజీ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ప్రేక్షకులతో పంచుకున్నారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. I am so glad for you @AbhishekOfficl you have shown the courage to produce the most challenging truth of Bharat. #TheKashmirFiles screenings in USA proved the changing mood of the world in the leadership of @narendramodi https://t.co/uraoaYR9L9 — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 12, 2022