
ఈ ఏడాది మార్చిలో రిలీజైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, తేజ్ నారాయణ్ అగర్వాల్, పల్లవి జోషి ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం వివేక్ అగ్నహోత్రి దర్శకత్వంలోనే రెండు సినిమాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం (మార్చి 11) అభిషేక్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాలను ప్రకటించారు.
‘నిజాయితీతో కూడిన రెండు కొత్త కథలతో సినిమాలు నిర్మించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాలను తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి, పల్లవి జోషి నిర్మిస్తారు. ‘‘ఈ సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment