Director Vivek Ranjan Agnihotri Announces The Kashmir Files Sequel; Check Streaming OTT Platform - Sakshi
Sakshi News home page

The Kashmir Files: సినిమా అయిపోయింది.. ఇప్పుడు వెబ్ సిరీస్!

Published Wed, Jul 19 2023 7:36 PM

The Kashmir Files Web Series Zee5 Vivek Agnihotri - Sakshi

The Kashmir Files Web Series: బాలీవుడ్‌కి గతేడాది అస్సలు కలిసి రాలేదు. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరి సినిమాలు ఫ్లాఫ్ అయ్యాయి. అయితే 2022లోనే ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అందుకున్న చిత్రం 'ద కశ్మీర్ ఫైల్స్'. ఈ మూవీకి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దానితో పాటే లెక్కకు మించి వివాదాలకు ఈ చిత్రం కారణమైంది. ఇప్పుడు మరోసారి కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యేందుకు ఆ దర్శకుడు రెడీ అయిపోయాడు. 

(ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్)

అప్పుడు సినిమా ఇప్పుడు సిరీస్
దాదాపు రెండేళ్లపాటు రీసెర్చ్ చేసిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. కశ్మీర్ నుంచి వెళ్లిపోయిన 700 మంది కశ్మీరి పండితులని ఇంటర్వ్యూ చేశాడు. వాళ్లు చెప్పిన కొన్ని పాయింట్స్ ఆధారంగా, 1990ల్లో జమ‍్ము-కశ్మీర్ లో ఉగ్రవాదం వల్ల ప్రాణాలు కోల్పోయిన పండితుల కథతో 'ద కశ్మీర్ ఫైల్స్' సినిమా తీశాడు. ఆ మూవీలో చెప్పలేకపోయిన మిగిలిన అంశాలతో ఇప్పుడు ఏకంగా వెబ్ సిరీస్ తీసేశారు. 'ద కశ్మీర్ ఫైల్స్: అన్ రిపోర్టెడ్' పేరుతో రాబోతున్న ఈ సిరీస్ త్వరలో జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

దర్శకుడి ట్వీట్
'కశ్మీరీ పండితుల మారణ హోమం జరిగిందనే వాస్తవాన్ని అంగీకరించలేని వాళ్లు, భారత్‌కు శత్రువులు 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు నేను కశ్మీర్ హిందువుల మారణ హోమానికి సంబంధించిన చేదు నిజాన్ని వెబ్ సిరీస్‌గా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఎమోషన్స్‌తో తీసిన ఈ సిరీస్ చూడటానికి రెడీగా ఉండండి. కనిపిస్తున్న వాస్తవాన్ని అంగీకరించలేని వాళ్లే దీన్ని విమర్శిస్తారు' అని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేశాడు. ఓ టీజర్‌ని కూడా పోస్ట్ చేశాడు.

(ఇదీ చదవండి: సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. తండ్రినే మించిపోయేలా!)

Advertisement
 
Advertisement
 
Advertisement