ITA Awards 2022: The Kashmir Files Bags Golden Film Of Indian Cinema Title - Sakshi
Sakshi News home page

The Kashmir Files: ఈ అవార్డ్ వారందరికీ అంకితం.. వివేక్ అగ్నిహోత్రి

Published Mon, Dec 12 2022 6:07 PM

The Kashmir Files bags Golden Film of Indian cinema title at ITA Awards 2022 - Sakshi

ఎలాంటి అంచనాలు లేకుండా  సంచలన విజయం సాధించిన హిందీ చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. కశ్మీర్‌ పండిట్ల ఊచకోత నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్లు వసూళ్లతో రికార్డు సృష్టించింది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నీహోత్రి దర్శకత్వం వహించగా.. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. 

ఇండియన్ టెలివిజన్ అకాడమీ-2022 అవార్డుకు ఎంపికైంది. ఈ చిత్రం గోల్డెన్ ఫిల్మ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా గుర్తింపు పొందింది. తాజాగా ఈ అవార్డును చిత్ర దర్శకుడు వివేక్ ‍అగ్నిహోత్రి అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ఈ అవార్డు ఉగ్రవాద బాధితులందరికీ అంకితమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement