ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహం నేరం కాదని ఆయన ట్వీట్ చేశారు. ఇది వారి హక్కు అంటూ తన మద్దతు ప్రకటించారు. ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇలాంటివి సాధారణమైన విషయమని అన్నారు. ఈ సందర్భంగా స్వలింగ వివాహంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
వివేక్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'స్వలింగ వివాహం అనేది 'అర్బన్ ఎలిటిస్ట్' అన్న భావన కరెక్ట్ కాదు. ఇది మానవ అవసరం. చిన్న పట్టణాలు, గ్రామాలలో ఎప్పుడూ ప్రయాణించని కొంతమంది వ్యక్తులే దీన్ని ప్రశ్నిస్తున్నారు. మొదట స్వలింగ వివాహం అనేది ఒక కాన్సెప్ట్ కాదు. అది ఒక అవసరం మాత్రమే. అలాగే ఇది ఒక హక్కు కూడా. భారతదేశం వంటి ప్రగతిశీల దేశంలో స్వలింగ వివాహం సాధారణమైన విషయమే. ఎలాంటి నేరం కాదు.' అంటూ పోస్ట్ చేశారు.
కాగా.. స్వలింగ వివాహం అనేది పట్టణ ఉన్నత వర్గాల భావన అని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది. ఇది దేశంలోని సామాజిక తత్వానికి దూరంగా ఉందని తెలిపింది. స్వలింగ వివాహాన్ని ప్రోత్సహించడం కొత్త సమస్యలు సృష్టిస్తుందని కేంద్రం పేర్కొంది. దీన్ని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించి ది కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించారు.
(ఇది చదవండి: షూటింగ్‌లో ప్రమాదం.. ది కశ్మీర్ ఫైల్స్ నటికి తీవ్రగాయాలు)
NO. Same sex marriage is not an ‘urban elitist’ concept. It’s a human need. Maybe some sarkari elites drafted it who have never travelled in small towns & villages. Or Mumbai locals.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 18, 2023
First, same sex marriage is not a concept. It’s a need. It’s a right.
And in a progressive,… https://t.co/M4S3o5InXI
Comments
Please login to add a commentAdd a comment