Indian Television Academy
-
ది కశ్మీర్ ఫైల్స్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డ్.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్
ఎలాంటి అంచనాలు లేకుండా సంచలన విజయం సాధించిన హిందీ చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. కశ్మీర్ పండిట్ల ఊచకోత నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్లు వసూళ్లతో రికార్డు సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నీహోత్రి దర్శకత్వం వహించగా.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఇండియన్ టెలివిజన్ అకాడమీ-2022 అవార్డుకు ఎంపికైంది. ఈ చిత్రం గోల్డెన్ ఫిల్మ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా గుర్తింపు పొందింది. తాజాగా ఈ అవార్డును చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ అవార్డు ఉగ్రవాద బాధితులందరికీ అంకితమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. This award for #TheKashmirFiles being honoured as the Golden Film of Indian cinema is dedicated to all the victims of religious terrorism. @TheITA_Official #KashmirHinduGenocide pic.twitter.com/Uc6RpREPbm — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) December 12, 2022 -
ఆక్టోబర్ 29న ముంబయిలో ఐటీఏ పురస్కారాల ప్రదానం
ఈ ఏడాది13వ ఇండియన్ టెలివిజన్ అకాడమీ (ఐటీఏ) పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని వచ్చే నెల 29న ముంబయిలో ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తామని ఆ ఐటీఏ కన్వీనర్ శశిరాజన్ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. సినిమా, సంగీతం, టాక్ షో,వార్తలు, కరెంట్ ఎఫైర్స్, దర్శకులు, వ్యాఖ్యాతలు, టెక్నిషియన్లు తదితరులను జ్యూరీ కమిటీ పురస్కారాలకు ఎంపిక చేసిందని చెప్పారు. అందులోభాగంగా18 టెక్నికల్ అవార్డులు, ఆరు పాపులర్ అవార్డులను పబ్లిక్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేసినట్లు వివరించారు. ఐటీఏ అవార్డుల కోసం 45 కేటగిరిలకు 1850 నామినేషన్లు వచ్చాయని చెప్పారు. ఐటీఏ కమిటీ జ్యూరీకి సిమి గరేవాల్ అధ్యక్షత వహించగా, రాకేశ్ బేడి, మిర్ మునీర్, జావేద్ సయ్యద్, ఉమేష్ గుప్తా,మాయా రావు, భరతి ప్రదాన్, అనిల్ సెహగ్ల్ సభ్యులుగా వ్యవహారించారు. నవంబర్ 3వ తేదీన ఐటీఏ అవార్డుల కార్యక్రమం స్టార్ ప్లస్‌లో ప్రసారం అవుతోందని శశిరాజన్ చెప్పారు.