Vivek Agnihotri Tweet on Wedding Shoots in Now a Days Goes Viral - Sakshi
Sakshi News home page

Vivek Agnihotri: వాటి కోసమే పెళ్లి అనే ట్యాగ్‌: పరిణీతి ఎంగేజ్‌మెంట్‌పై వివేక్ ట్వీట్ వైరల్

Published Sun, May 14 2023 1:48 PM | Last Updated on Sun, May 14 2023 6:48 PM

Vivek Agnihotri Tweet On Wedding Shoots In Now a Days Goes viral - Sakshi

బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కించిన 'ది కశ్మీర్ ఫైల్స్' సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కశ్మీర్‌లో హిందూ పండితులపై జరిగిన దాడులను కథాంశంగా సినిమాను రూపొందించారు. అయితే ప్రస్తుతం ఆయన 'ది వ్యాక్సిన్ వార్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

(ఇది చదవండి: పెళ్లికి ముందే అమ్మతనం కోసం ఆరాటపడ్డ హీరోయిన్స్‌ వీళ్లే)

తాజాగా వివేక్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ రోజుల్లో వెడ్డింగ్స్ జరగడంపై ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. కేవలం పెళ్లి ఫొటోలు తీసుకోవడం కోసమే పెళ్లి చేసుకుంటున్నారని వివేక్ అగ్నిహోత్రి వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. మే 13న దిల్లీలో జరిగిన పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం జరగడంతో ఆయన ట్వీట్‌పై చర్చ నడుస్తోంది. 

(ఇది చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్‌)

వివేక్ తన ట్వీట్‌లో రాస్తూ.. ' ఈ రోజుల్లో కేవలం ఫోటోలు, వీడియోల కోసమే పెళ్లి  చేసుకుంటున్నాపరు. 'డెస్టినేషన్ వెడ్డింగ్' ట్యాగ్‌ని పొందడానికి పెళ్లి చేసుకుంటున్నారని నాతో ఓ వెడ్డింగ్ ప్లానర్ చెప్పారు. నేను ఓ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ఉన్నా. ఆ వివాహానికి ఫోటోగ్రాఫర్ ఆలస్యంగా వస్తున్నాడని ఎవరో చెప్పారు. దీంతో వధువు స్పృహ తప్పి పడిపోయింది.' అంటూ పోస్ట్ చేశారు. వివేక్ చేసిన ట్వీట్‌పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement