engage ment
-
శోభిత- నాగచైతన్య ఎంగేజ్మెంట్.. కాబోయే జంట వయస్సు తేడా ఎంతంటే?
టాలీవుడ్ హీరో, యువసామ్రాట్ అక్కినేని నాగతచైతన్య మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఇవాళ ఆయన హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో కొద్దిమంది సన్నిహితుల సమంక్షంలో వీరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. త్వరలోనే ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ విషయాన్ని హీరో నాగార్జున అధికారికంగా ట్విటర్లో పంచుకున్నారు.అయితే ప్రస్తుతం వీరిద్దరి వయసు గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఈ జంట మధ్య ఏజ్ గ్యాప్ ఎంతనే విషయంపై నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అయితే శోభిత ధూలిపాళ్ల 31 మే 1992లో జన్మించారు. ఏపీలోని తెనాలిలో ఆమె తల్లిదండ్రుల స్వస్థలం కాగా.. ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లు. మరోవైపు హీరో నాగచైతన్య నవంబర్ 23, 1986లో హైదరాబాద్‌లో పుట్టారు. ప్రస్తుతం చైతూ వయస్సు 37 ఏళ్లు కాగా.. వీరిద్దరి మధ్య కేవలం 5 ఏళ్ల తేడా మాత్రేమే ఉంది. కాగా.. నాగచైతన్య 2009లో వాసు వర్మ దర్శకత్వం వహించిన జోష్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అలాగే శోభిత ధూళిపాళ్ల రామన్ రాఘవ్ 2.0 అనే చిత్రం ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అంతేకాకుండా గతేడాది సూపర్ హిట్‌గా నిలిచిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోనూ మెరిసింది.రూమర్స్ నిజం చేశారు!కాగా.. గత రెండేళ్ల నుంచి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు నెట్టింట రూమర్స్ తెగ వైరలయ్యాయి. గతేడాది లండన్‌లో ఓ రెస్టారెంట్లో కనిపించడంతో రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా ఈ ఏడాది జూన్‌లో వీరిద్దరు విదేశాల్లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. తాజాగా ఇవాళ వాటిని నిజం చేస్తూ ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది మే 31న శోభిత పుట్టినరోజును జరుపుకోవడానికి వీరిద్దరు యూరప్‌లో ఉన్నట్లు తెలిసింది. అయితే డేటింగ్‌పై శోభిత, నాగ చైతన్య ఎక్కడా కూడా స్పందించలేదు. -
జూన్ 9న వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్, వాళ్లకు మాత్రమే ఆహ్వానం..!
-
కేవలం దాని కోసమే పెళ్లి చేసుకుంటున్నారు: వివేక్ సంచలన కామెంట్స్
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన డైరెక్షన్లో తెరకెక్కించిన 'ది కశ్మీర్ ఫైల్స్' సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కశ్మీర్లో హిందూ పండితులపై జరిగిన దాడులను కథాంశంగా సినిమాను రూపొందించారు. అయితే ప్రస్తుతం ఆయన 'ది వ్యాక్సిన్ వార్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: పెళ్లికి ముందే అమ్మతనం కోసం ఆరాటపడ్డ హీరోయిన్స్ వీళ్లే) తాజాగా వివేక్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ రోజుల్లో వెడ్డింగ్స్ జరగడంపై ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. కేవలం పెళ్లి ఫొటోలు తీసుకోవడం కోసమే పెళ్లి చేసుకుంటున్నారని వివేక్ అగ్నిహోత్రి వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. మే 13న దిల్లీలో జరిగిన పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం జరగడంతో ఆయన ట్వీట్‌పై చర్చ నడుస్తోంది. (ఇది చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్) వివేక్ తన ట్వీట్లో రాస్తూ.. ' ఈ రోజుల్లో కేవలం ఫోటోలు, వీడియోల కోసమే పెళ్లి చేసుకుంటున్నాపరు. 'డెస్టినేషన్ వెడ్డింగ్' ట్యాగ్‌ని పొందడానికి పెళ్లి చేసుకుంటున్నారని నాతో ఓ వెడ్డింగ్ ప్లానర్ చెప్పారు. నేను ఓ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ఉన్నా. ఆ వివాహానికి ఫోటోగ్రాఫర్ ఆలస్యంగా వస్తున్నాడని ఎవరో చెప్పారు. దీంతో వధువు స్పృహ తప్పి పడిపోయింది.' అంటూ పోస్ట్ చేశారు. వివేక్ చేసిన ట్వీట్‌పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. “People are getting married just to get wedding photos, videos and to get ‘destination wedding’ tag for show off”. - a wedding planner told me. It’s true I was in a destination wedding and someone said that the wedding photographer is going to be late and the bride fainted. — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 13, 2023 -
ప్రేయసి మేహాతో అక్షర్ పటేల్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్
Axar Patel celebrated his birthday very special: టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడు కానున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు మేహాతో గురువారం నిశ్చితార్థం చేసుకున్నాడు. కాగా తన 28వ పుట్టిన రోజున అక్షర్ ఎంగేజ్మెంట్ చేసుకోవడం విశేషం. అక్షర్ ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫొటోల్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. "ఈ రోజు మా కొత్త జీవితానికి ఆరంభం, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తునే ఉంటాను" అని క్యాప్షన్ జోడించాడు. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్- మేహాత నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరికీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా తన విషెస్ తెలిపాడు. అక్షర్ స్నేహితులు, బంధువులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక అక్షర్ పటేల్ టీమిండియా తరుపున అద్భుతంగా రాణిస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ భారత్ కైవసం చేసుకోవడంలో అక్షర్ కీలక పాత్ర పోషించాడు. కాగా గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు అక్షర్ పటేల్ దూరమయ్యాడు. చదవండి: యూసుఫ్ పఠాన్ తుపాన్ ఇన్నింగ్స్ .. కేవలం 40 బంతుల్లో.. View this post on Instagram A post shared by Akshar Patel (@akshar.patel) -
పది రోజుల్లో వివాహ నిశ్చితార్థం.. యువ వైద్యుడి మృతి
సాక్షి, హైదరాబాద్: స్నేహితుడి నిశ్చితార్థానికి అతని సొంతూరుకు వెళ్దామని ఆనందంతో ఉన్న మిత్రులు.. ఆ స్నేహితుడి మృతదేహాన్నే తీసుకువెళ్లాల్సి రావడం కలలో కూడా అనుకోలేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. 29 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండాయని భోరున విలపిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో యువ వైద్యుడు పూర్ణచంద్ర బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. ► ఏపీలోని గుంటూరు జిల్లా నిజాంపట్నంకు చెందిన తునుగుంట్ల పూర్ణచంద్ర గుప్తా (29) చినకాకాని ఎన్ఆర్ఐ కాలేజీలో ఎంబీబీఎస్, గాంధీ మెడికల్ కాలేజీ జనరల్ సర్జరీ విభాగంలో ఎండీ ఎంఎస్ చదువుకున్నారు. ► గాంధీలోనే సీనియర్ రెసిడెంట్ (ఎస్ఆర్)గా విధులు నిర్వర్తించి ఈ ఏడాది జూలైలో పూర్తి చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్య ప్రవేశ పరీక్షల ప్రిపరేషన్ కోసం స్నేహితులతో కలిసి పద్మారావునగర్‌లో ఉంటున్నారు. వారం రోజుల క్రితం ఆయనకు గుండెలో స్వల్పంగా నొప్పి రావడంతో గాంధీలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. నివేదికలన్నీ నార్మల్‌గానే వచ్చాయి. ► బుధవారం ఉదయం 5 గంటలకు మరోసారి ఛాతిలో నొప్పి రావడంతో ఎసిడిటీ అనుకుని గాంధీ ఆస్పత్రికి వచ్చి ఇంజక్షన్ తీసుకున్నారు. పద్మారావునగర్‌లోని గదికి వెళ్లవద్దని, అత్యవసర విభాగ భవనం పైనున్న పీజీ హాస్టల్లో ఉండాలని సహచర వైద్యుల సూచన మేరకు మెట్ల మార్గంలో వెళ్తున్న క్రమంలో తీవ్రస్థాయిలో హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వైద్యులు అతడిని ఐసీయూలో అడ్మిట్ చేసి తీ వ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. పది రోజుల్లో నిశ్చితార్థం.. పూర్ణచంద్ర గుప్తాకు మరో పది రోజుల్లో వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. గతంలోనే ఆయన తల్లి చనిపోయింది. వెన్నెముక ఆపరేషన్ చేయించుకుని బెడ్‌కే పరిమితమైన తండ్రి బాగోగుల్ని సోదరుడు చూస్తున్నాడు. పూర్ణచంద్ర కోరిక మేరకు నిశ్చితార్థానికి వైద్య మిత్రులంతా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే మృత్యువు కబళించడంతో అంత్యక్రియలకు స్నేహితుని మృతదేహాన్ని తీసుకుని ఆయన సొంతూరుకు వెళ్తున్నామని భోరుమన్నారు. పూర్ణచంద్ర గుప్తా మృతదేహానికి గాంధీ ప్రిన్సిపాల్ ప్రకాశరావు, సూపరింటెండెంట్ రాజారావు, వైద్యులు నివాళులర్పించారు. -
నాకీ పెళ్లొద్దు
క్లాసిక్ కామెడీ కథ ‘‘శివశంకరంగారుట సార్! గుంటూర్నుంచి ఎస్.టి.డి.లో మాట్లాడుతున్నారు’’ అంది టెలిఫోన్ ఆపరేటర్. ‘‘హలో - ఆ - నేనే’’ అన్నాను. ‘‘ఓ అర్జంటు పని బావగారూ, మా రెండో అబ్బాయి విశ్వనాథం వైజాగ్‌లోనే ఉన్నాడు.అదే - బ్యాంక్‌లో ఆఫీసర్‌గా రిక్రూటై పదిహేను రోజుల కిందట చేరేడు. రేపు సాయంకాలం నాలుగింటికి ఒక పెళ్లిచూపుల కార్యక్రమం ఉంది. మీ ఊళ్లోనే రంగనాథంగారని గాంధీనగర్ మూడోవీధిలో ఎర్రమేడలో ఉన్నారుట.’’ ‘‘ఒస్తున్నారా, నువ్వూ మీ ఆవిడా? వెల్కమ్!’’ అన్నాను. ‘‘అదే చెబుతూంట, మేం ఈ రాత్రికో రేపు ఉదయానికో వద్దాం అని ప్రోగ్రాం వేసుకున్నాం. సడెన్‌గా నాకు హైద్రాబాదులో పని తగిలింది. మా ఆవిడ ఒక్కతీ వెళ్లలేనంటోంది.’’ ‘‘రంగనాథంగారింటికెళ్లి మరో డేటు ఫిక్స్ చేయించనా?’’ ‘‘కాదు కాదు, ఆ అమ్మాయి ఎల్లుండి వాళ్లన్నయ్యతో కలిసి ఢిల్లీ వెళ్లాలిట. అంచేత ఈ తతంగం నువ్వూ మీ ఆవిడా నడిపించెయ్యాలి.’’ ‘‘చాలా పెద్ద బాధ్యతే పెడుతున్నావు. ఇలాంటివి స్వయంగానే చేసుకోవాలి శివా.’’ ‘‘ఇందులో మన ప్రమేయం అసలేముంది? పిల్లాపిల్లాడూ ఒకర్నొకరు చూసుకుని ఓకే అంటే పెళ్లి చేసేయడమే. ఆ అమ్మాయిని నేనూ మీ సిస్టరూ చూడ్డం అయిపోయింది. అంచేత నువ్వు కాదనకు. మావాడికి ఫోన్ చేసి నిన్ను కాంటాక్ట్ చెయ్యమని చెబుతున్నాను.’’ మర్నాడు సాయంకాలం నాలుగ్గంటలకి నేనూ మా ఆవిడా శివశంకరం కొడుకు విశ్వనాథం ఆ రంగనాథం గారింటికి వెళ్లాం. ఇరవై నాలుగేళ్లు విశ్వనాథానికి. ఉద్యోగంలో చేరి పదిహేనురోజులే అయింది. ఇంకో ఏడాదైనా ఆగొచ్చు కదా అని నాకూ మా ఆవిడకీ అనిపించింది. ప్రభుత్వం వారు ఇరవై ఒక్కేళ్లు వెళ్లకుండా మొగపిల్లాడికి పెళ్లి చెయ్యొద్దంటున్నారే గాని పాతికేసేళ్లు వెళ్తున్నా మధ్యతరగతి అమ్మాయిలకే పెళ్లిళ్లు ఎక్కడోగాని కుదరడం లేదు కదా! ఆఖరికి ‘కళ్యాణం ఒచ్చినా కక్కొచ్చినా ఆగవు’ అని మా ఆవిడ కాంప్రమైజ్ అయిపోయింది. ‘‘కళ్యాణం సంగతి ఎలా వున్నా కక్కు రాకపోతే అదే పదివేలు’’ అన్నాను. వెళ్లగానే మంచినీళ్లిచ్చేరు. మూడు నిమిషాల్లో ‘టీ’ ఇచ్చేరు. మరో రెండు నిమిషాల్లో ‘ముఖ్యపాత్రల’ పరిచయం అయింది. రంగనాథంగారబ్బాయి ఢిల్లీలో పనిచేస్తున్నాడు. అతనొక ఫొటోల ఆల్బం తెచ్చేడు. అందులో రంగనాథంగారు, వాళ్లావిడ, రంగనాథంగారి అన్నదమ్ముల కుటుంబాలు, ఎంతమంది ఫొటోలు ఎన్నివున్నా అది ప్రత్యేకంగా పెళ్లికూతురు (పద్మలత) ఫొటోల ఆల్బం అని చెప్పొచ్చు. ఆ పిల్ల రంగనాథంగారు మద్రాసులో పనిచేస్తూ వుండినప్పుడు పుట్టిందట. పొత్తిళ్లలో చిన్నపాపాయి, తల్లీ; కాన్పు చేసిన డాక్టరమ్మ - అదొక ఫొటో ఉంది. ఇహ అక్కడి నుంచీ గొప్ప ‘ఈస్తటిక్ సెన్స్’తో ‘మెటిక్కులస్ ప్లానింగ్’తో స్టూడియోల్లోనూ బయటా తీయించిన ఫొటోలు, సింగిల్సు నుంచీ గ్రూప్స్ దాకా సుమారు నాలుగు డజన్లు ఉన్నాయి. రంగనాథంగారికి రక్షణశాఖలో సివిలియన్ ఉద్యోగం. అంచేత ఆ ఫొటోలన్నిటికీ డిఫెన్సు బ్యాక్గ్రౌండు సమకూరింది. మద్రాసు, బొంబాయి, కొచ్చిన్, గోవా మొదలైన నగరాల దృశ్యాలు బ్యాక్ డ్రాప్‌గా పద్మలత తీయించుకున్న (పద్మలతకి తీసిన) ఫొటోల సహాయంతో నేనూ మా ఆవిడా ఒక అరగంటపాటు కుర్చీలోంచి కదలకుండా విహార యాత్రలు నిర్వహించేం. అప్పుడు ప్రవేశించింది, రంగం మీదికి అసలు పాత్ర. ‘‘ఎంత అందంగా వుందో! మన రాజుకి చేసుకుంటేనో?’’ అని అదేదో టీవీయాడ్లో లాగా మా ఆవిడ నోరు జారుతుందేమో అని భయం వేసింది. ‘‘హలో ఎవ్విరిబడి’’ అని చిరునవ్వుతో అందర్నీ ఒకేసారి పలకరించి విశ్వనాథానికి ఎదురుగా కూచుంది. ‘‘అయామ్ పద్మలత’’ అని మరోమాటు అని అందరి వేపూ చూసింది. దాంతో తన పేరు, ‘‘పేరు పేరునా వరసగా’’ అందరికీ చెప్పినట్టు భావించుకున్నాం. ‘‘ఏం చదువుతున్నావమ్మా?’’ అని మా ఆవిడ ప్రశ్నించింది. ‘‘బి.కామ్. ‘చేస్తున్నాను’. రాహుల్‌గాంధీ నేనూ కాలేజ్‌మేట్స్’’ ఇంగ్లిష్‌లో చెప్పింది. ‘‘చేస్తున్నాను - అందికదా అని అదేదో డాక్టరేటు అనుకోకు. ఎటొచ్చీ ఆ చదువు ఢిల్లీలో చదువుతోందిట. రాజీవ్‌గాంధీ కొడుకు చదువుతున్న కాలేజీలోనేట’’ అని మా ఆవిడకి బోధపరిచేను. ‘‘మీ పేరెంట్సా? (తల్లిదండ్రులా?)’’ అని పద్మలత డైరక్టుగా విశ్వనాథాన్ని అడిగింది. ‘‘నో. ఆయన గోపాలంగారని, మా నాన్నగారి స్నేహితుడు. వాళ్లు ఈ వూళ్లోనే ఉంటారు.’’ ‘‘దట్ డజన్ట్ మేక్ ఎనీ డిఫరెన్స్ (అందువల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదు)’’ అంది అమ్మాయి చిరునవ్వులు చిందిస్తూ. ‘‘అబ్బాయి ఈ వూళ్లోనే బ్యాంక్‌లో ఆఫీసర్‌గా ఉంటున్నాడమ్మా’’ అంది రంగనాథంగారి భార్య కూతురితో. ‘‘తెలుసులే మమ్మీ’’ అని విశ్వనాథంతో, ‘‘మీకు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అవుతుందా? ఐ లైక్ డెల్హీ. నైస్ సిటీ అండ్ ఎబండెంట్ ఆపర్చునిటీస్. (నాకు ఢిల్లీ అంటే ఇష్టం. అది చాలా సుందరమైన నగరము, మరియు అక్కడ అవకాశములు పుష్కలముగా యుండును)’’ అంది. ‘‘ఆంధ్రా రీజియన్‌కి ఎలాట్ చేసేరు గనక వీలుండదనుకుంటాను. బి.కాం. అయిపోయాక ఏం చేస్తారు?’’ అన్నాడు విశ్వనాథం. ‘‘సి.ఏ. చేస్తాననుకుంటాను; ఇన్కమ్టాక్స్లో స్పెషలైజ్ చేస్తాను’’ అని, టీపాయి మీద ఉన్న వార్తాపత్రిక తీసింది పద్మలత. ‘‘మై గుడ్నెస్! మెరడోనా ఏక్షన్ ఫొటో వచ్చిందే, ఇందులో? హౌ ఛార్మింగ్!’’ అంది; స్పోర్ట్స్ పేజీ చూసి అంత మొహం చేసుకుని. ‘‘ఎవరండీ, ఏక్షన్ బాగా చేసేడంటోంది?’’ అని మా ఆవిడ నాతో గుసగుసలాడింది. పిచ్చిమొహం; మెరడోనా అంటే తెలీదు! ‘‘డర్టీకంట్రీ; మన ఇండియా ఇలాంటి ఫుట్‌బాల్ ప్లేయర్‌ని ఒక్కణ్ని కూడా ప్రొడ్యూస్ చెయ్యలేకపోయింది.’’ ప్లేట్లలో ‘‘లైటుగా’’ టిఫిను వచ్చింది. కాసేపు సంభాషణ వాయిదా పడింది. ‘‘కాని, క్రికెట్లో మనవాళ్లు కొందరు గొప్పవాళ్లే ఉన్నారు కదా!’’ అని వొదిలేసిన సంభాషణని మళ్లా పునరుద్ధరించేడు విశ్వనాథం. ‘‘ఫ్రాంక్లీ - (నిజానికి) గవాస్కర్, కపిల్‌దేవ్ తప్ప మనకి ఎవరున్నారు? ఈవెన్ అజారుద్దీన్, వెంగ్‌సర్కార్ అండ్ శ్రీకాంత్ ఆర్ సూడో మాస్టర్స్. ఇంక టెన్నిస్ సంగతైతే చెప్పనే అక్కర్లేదు. లెస్టాక్డ్ ఈజ్ బెటర్ (ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది)’’. ‘‘మనం ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో రూపుదిద్దుకుంటున్నాం అనుకుంటాను’’ అని చెప్పేడు విశ్వనాథం; తప్పు తనదేనని ఒప్పేసుకుంటున్న ధోరణిలో. పద్మలత మాయాశశిరేఖలా నవ్వింది. ‘‘ఆ లెక్కని ఒలింపిక్స్‌లో గాని ఏషియాడ్‌లో గాని మరో వరల్డ్ ఈవెంట్లో గాని ఇండియాకి గుర్తింపు రావడం మనం చూడం. గిన్నిస్‌బుక్‌లో మనకి స్థానమే లేదు.’’ ‘‘మీరు క్రీడారంగం వార్తలతో మంచి పరిచయం కలిగి ఉన్నారు. చాలా సంతోషం. సినిమా రంగంలో కూడా ఇంతటి పరిజ్ఞానం కలిగివున్నారా?’’ అన్నాడు విశ్వనాథం. ‘‘వైనాట్? ‘మైనే ప్యార్ కియా’ ఇంకా ఈ ఏరియాకి రాలేదు. మేం నాలుగు నెలల కిందట చూసేశాం. అసలు సినీ మాగజైన్సే ఏవీ దొరకవు ఇక్కడ. అంచేత ఇక్కడికొస్తే ఎప్పుడు ఢిల్లీ వెళ్లిపోతానా అనిపిస్తుంది. బట్ ఫర్ డాడీ అండ్ మమ్మీ ఐ షన్ దిస్ ప్లేస్. (అమ్మా, నాన్న ఇక్కడుండకపోతే ఈ వూరంటే నాకు పరమ అసహ్యం)’’ ‘‘అమ్మాయిని చూస్తుంటే ముచ్చటేస్తుంది చెల్లెమ్మగారూ’’ అంది మా ఆవిడ రంగనాథంగారి భార్యతో. ‘‘ఇంతలేసి జ్ఞానాలున్నవాళ్లు వంట చేసినా, ఆఖరికి కాఫీ పెట్టినా సరే; అనుభవించే కుర్రాడిదే అదృష్టం. ఏమంటారు?’’ మా ఆవిడ అంత తెలివిగా అసలు ప్రశ్న అడగగలదని నేను ఊహించలేదు. ‘‘టు హెల్వితిట్! (వంటా, నా మొహమూనూ!)’’ అని పద్మలత లేచింది. ‘‘బై! ఐ గాట్ ఎ లాట్ టు రీడ్ (నేనింకా ఎంతో చదవాలి)’’ అని వెళ్లింది. కొంచెంసేపు కూర్చుని మేం కూడా లేచేం. అడ్రసులూ టెలిఫోన్ నెంబర్లూ మరోసారి రూఢీ చేసుకుని బయలుదేరేం. అక్కడితో ‘‘పెళ్లిచూపులు’’ అయిపోయినట్టే. విశ్వనాథం మాతోబాటుగా ఆటోలో మా ఇంటిదాకా వచ్చేడు. ‘‘మీరైనా చెప్పండి సా, మా నాన్నగారికి; మరీ ఇంత గొప్ప సంబంధం చూడొద్దని! నాకేమిటో భయంగా ఉంది’’ అన్నాడు. - భమిడిపాటి రామగోపాలం