
Axar Patel celebrated his birthday very special: టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడు కానున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు మేహాతో గురువారం నిశ్చితార్థం చేసుకున్నాడు. కాగా తన 28వ పుట్టిన రోజున అక్షర్ ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం విశేషం. అక్షర్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఫొటోల్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. "ఈ రోజు మా కొత్త జీవితానికి ఆరంభం, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తునే ఉంటాను" అని క్యాప్షన్ జోడించాడు. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్- మేహాత నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరికీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా తన విషెస్ తెలిపాడు. అక్షర్ స్నేహితులు, బంధువులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక అక్షర్ పటేల్ టీమిండియా తరుపున అద్భుతంగా రాణిస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ భారత్ కైవసం చేసుకోవడంలో అక్షర్ కీలక పాత్ర పోషించాడు. కాగా గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు అక్షర్ పటేల్ దూరమయ్యాడు.
చదవండి: యూసుఫ్ పఠాన్ తుపాన్ ఇన్నింగ్స్ .. కేవలం 40 బంతుల్లో..
Comments
Please login to add a commentAdd a comment