న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడో టెస్ట్‌లో టీమిండియా కీలక మార్పు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. ముంబైలోని వాంఖడే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున అదనపు స్పిన్నర్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇలా చేస్తే స్పెషలిస్ట్ పేసర్‌గా బుమ్రా ఒక్కడికే అవకాశం దక్కుతుంది. అదనపు స్పిన్నర్ కోటాలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి రావచ్చు. అక్షర్‌కు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నందున్న మేనేజ్‌మెంట్ ఇతనివైపే మొగ్గు చూపుతుంది. ఒకవేళ అక్షర్ తుది జట్టులోకి వస్తే ఆకాశ్‌దీప్‌పై వేటు పడుతుంది.
ఆకాశ్‌దీప్ రెండో టెస్ట్ మొత్తంలో కేవలం ఆరు ఓవర్లు మాత్రమే వేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అయితే అతను బంతిని కూడా పట్టుకోలేదు. వాంఖడే ట్రాక్ ఇంచుమించు పూణే పిచ్ మాదిరే ఉండే అవకాశం ఉన్నందున టీమిండియా తప్పక నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది.
ఆకాశ్‌దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ పేరును సైతం పరిశీలించే అవకాశాలు లేకపోలేదు. అయితే కుల్దీప్‌కు గజ్జల్లో గాయమైందని ప్రచారం జరుగుతుంది. ఈ కారణంగానే అతన్ని ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఎంపిక చేయలేదని తెలుస్తుంది.
కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ జయభేరి మోగించింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ముడో టెస్ట్ ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది.
కివీస్‌తో మూడో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment