టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అక్షర్ తన ప్రియురాలైన మేహా పటేల్‌ను ఈ నెలలోనే వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడు న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నట్లు సమాచారం. కాగా గత కొంత కాలంగా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు.
గతేడాది అక్షర్ పుట్టినరోజు (జనవరి 20) సందర్భంగా వీరిద్దరి నిశ్చితార్ధం జరిగింది. అనంతరం తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఇద్దరి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక మేహా పటేల్ వృత్తిపరంగా ఒక న్యూట్రిషనిస్ట్.
మరోవైపు భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. తన ప్రేయసి అతియా శెట్టిని రాహుల్ జనవరి 23న వివాహం ఆడనున్నాడు. ఈ క్రమంలో రాహుల్ కూడా న్యూజిలాండ్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల బాలుడు.. ఏకంగా 508 పరుగులు బాదిన యష్
Comments
Please login to add a commentAdd a comment