టాలీవుడ్ హీరో, యువసామ్రాట్ అక్కినేని నాగతచైతన్య మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఇవాళ ఆయన హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో కొద్దిమంది సన్నిహితుల సమంక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగింది. త్వరలోనే ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ విషయాన్ని హీరో నాగార్జున అధికారికంగా ట్విటర్‌లో పంచుకున్నారు.
అయితే ప్రస్తుతం వీరిద్దరి వయసు గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఈ జంట మధ్య ఏజ్ గ్యాప్ ఎంతనే విషయంపై నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అయితే శోభిత ధూలిపాళ్ల 31 మే 1992లో జన్మించారు. ఏపీలోని తెనాలిలో ఆమె తల్లిదండ్రుల స్వస్థలం కాగా.. ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లు. మరోవైపు హీరో నాగచైతన్య నవంబర్ 23, 1986లో హైదరాబాద్‌లో పుట్టారు. ప్రస్తుతం చైతూ వయస్సు 37 ఏళ్లు కాగా.. వీరిద్దరి మధ్య కేవలం 5 ఏళ్ల తేడా మాత్రేమే ఉంది.
కాగా.. నాగచైతన్య 2009లో వాసు వర్మ దర్శకత్వం వహించిన జోష్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అలాగే శోభిత ధూళిపాళ్ల రామన్ రాఘవ్ 2.0 అనే చిత్రం ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అంతేకాకుండా గతేడాది సూపర్ హిట్‌గా నిలిచిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోనూ మెరిసింది.
రూమర్స్ నిజం చేశారు!
కాగా.. గత రెండేళ్ల నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు నెట్టింట రూమర్స్ తెగ వైరలయ్యాయి. గతేడాది లండన్‌లో ఓ రెస్టారెంట్‌లో కనిపించడంతో రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా ఈ ఏడాది జూన్‌లో వీరిద్దరు విదేశాల్లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. తాజాగా ఇవాళ వాటిని నిజం చేస్తూ ఏకంగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది మే 31న శోభిత పుట్టినరోజును జరుపుకోవడానికి వీరిద్దరు యూరప్‌లో ఉన్నట్లు తెలిసింది. అయితే డేటింగ్‌పై శోభిత, నాగ చైతన్య ఎక్కడా కూడా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment