Is Naga Chaitanya Dating With Shobita Dhulipala, Pic Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Naga Chaitanya-Shobita Dhulipala : మళ్లీ వార్తల్లో నిలిచిన నాగ చైతన్య.. ఆ హీరోయిన్‌తో ఫోటో లీక్‌

Published Fri, Nov 25 2022 1:00 PM | Last Updated on Fri, Nov 25 2022 1:35 PM

Is Naga Chaitanya Dating Shobita Dhulipala Pic Goes Viral - Sakshi

అక్కినేని యువ సామ్రాట్‌ నాగచైతన్య గతేడాది సమంతతో విడిపోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న చై-సామ్‌లు అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. వీళ్లు ఎందుకు విడిపోయారన్నదానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక సామ్‌తో విడిపోయినప్పటి నుంచి నాగచైతన్య పర్సనల్‌ లైఫ్‌పై అనేక రూమర్స్‌ తెరపైకి వస్తున్నాయి. మేజర్‌ బ్యూటీ శోభితా ధూళిపాళ్లతో చై డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

దీనిపై అటు నాగ చైతన్య ఇటు శోభిత ఇద్దరు కూడా స్పందించలేదు. తాజాగా శోభితతో కలసున్న నాగచైతన్య ఫోటో ఒకటి నెట్టింట లీక్‌ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య సంథింగ్‌ సంథింగ్‌ అనడానికి ఈ ఫోటోనే కారణమంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో 'లాల్ సింగ్ చడ్డా' మూవీ ప్రమోషన్స్‌లో 'శోభిత ధూళిపాళ్ల పేరు వినగానే ఏం గుర్తొస్తుంది?'అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా నాగ చైతన్య చిన్న స్మైల్ ఇచ్చి సమాధానం దాటవేశారు.

అలాగే ప్రెజెంట్ మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అని అడగ్గా హ్యాపీ స్టేటస్ అంటూ బదులిచ్చారు. ఇంతకీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న చై- శోభిత ఫోటోలో ఎంతవరకు నిజముంది? ఇది ఇద్దరూ కలిసిన దిగిన ఫోటోనా? లేక ఎడిటింగ్‌ ఫోటోనా అన్నది తేలాల్సి ఉంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement