Naga Chaitanya Says She Likes That Quality in Samantha - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: సమంతపై మరోసారి తన ఇష్టాన్ని బయటపెట్టిన నాగచైతన్య

Published Mon, May 8 2023 7:46 PM | Last Updated on Mon, May 8 2023 8:08 PM

Naga Chaitanya Says She Likes That Quality In Samantha - Sakshi

సమంత, నాగచైతన్య విడిపోయి రెండేళ్లు అయినా ఇంకా వీరి డివోర్స్‌ ఇష్యూ హాట్‌టాపిక్‌గానే ఉంది. ఇద్దరూ తమ సినిమాల పరంగా బిజీ అవుతుంటే, సోషల్‌ మీడియాలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక విధంగా వీరి విడాకుల వ్యవహారం తెరపైకి వస్తుంటుంది. తాజాగా కస్టడీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాగచైతన్యకు మళ్లీ ఇలాంటి ప్రశ్నే ఎదురైంది.

అయితే ఎప్పుడూ పర్సనల్‌ విషయాలపై మాట్లాడని చై తొలిసారిగా విడాకుల గురించి ఓపెన్‌అప్‌ అవడంతో మరోసారి చై-సామ్‌ల డివోర్స్‌ హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే తాము విడిపోయి రెండేళ్లు అయినా ఇంకా జనాలు అదే పట్టుకొని సాగదీయడం మంచిది కాదంటూ చై మరోసారి తన విడాకుల గురించి మాట్లాడారు.

ఇక సమంతలో తనకు కష్టపడే వ్యక్తిత్వం బాగా నచ్చుతుందంటూ చై పేర్కొన్నాడు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ రీసెంట్‌ ఇంటర్వ్యూలో.. మీతో కలిసి నటించిన హీరోయిన్స్‌లో మీకు నచ్చే ‍క్వాలిటీ ఏంటని చైను ప్రశ్నించగా.. పూజా హెగ్డేలో స్టైల్‌ అని, సమంతలో హార్డ్‌ వర్కింగ్‌ అని, ఇక కస్టడీ బ్యూటీ కృతిశెట్టిలో ఇన్నోసెన్స్‌ నచ్చుతుంది అంటూ చై తెలిపాడు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement