![Samanta Dhulipala Reveals Naga Chaitanya Shobitha Love Story](/styles/webp/s3/article_images/2024/08/11/Samanta-Dhulipala.jpg.webp?itok=Ro7guwpg)
హీరో నాగచైతన్యతో హీరోయిన్ శోభిత నిశ్చితార్థం జరిగి ఇప్పటికే రెండు రోజులు అయిపోయింది. కానీ ఇప్పటికే ఏదో విషయమై మాట్లాడుకుంటూనే ఉన్నారు. అసలు వీళ్లు ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నారనేది రివీల్ కాలేదు. కానీ తాజాగా శోభిత చెల్లి సమంత తన ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్‌తో క్లారిటీ వచ్చేసింది.
(ఇదీ చదవండి: తెలుగు స్టార్ షట్లర్ శ్రీకాంత్‌తో ఆర్జీవీ మేనకోడలు నిశ్చితార్థం)
హీరోయిన్ సమంతని 2017లోనే నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ నాలుగేళ్లకే వీళ్ల బంధం ముక్కలైంది. 2021 అక్టోబరు 2న పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో చై-సామ్ అభిమానులు చాలా బాధపడ్డారు. దీని తర్వాత చైతూ-సమంత ఎవరికీ వాళ్లు సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయారు.
కానీ గత కొన్నాళ్లుగా శోభిత-చైతూ రిలేషన్ గురించి రూమర్స్ వచ్చాయి. తాజాగా నిశ్చితార్థం చేసుకోవడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. అయితే వీళ్ల మధ్య ప్రేమ 2022లోనే మొదలైందని శోభిత చెల్లి సమంత బయటపెట్టింది. చైతూ-శోభిత ఎంగేజ్‌మెంట్ ఫొటోలు పోస్ట్ చేసి ఈ విషయాన్ని బయటపెట్టింది. 2022లోనే సమంత ధూళిపాళ్ల పోస్ట్ చేసిన ఓ ఫొటోకు చైతూ లైక్ కూడా కొట్టాడు. కాకపోతే ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ సరిగ్గా గమనించి ఉంటే.. శోభితతో ప్రేమ వ్యవహారం బయటపడేదేమో?
(ఇదీ చదవండి: ‘మా’కు మంచు విష్ణు రూ. 10 లక్షల విరాళం!)
Comments
Please login to add a commentAdd a comment