స్టార్ షట్లర్ శ్రీకాంత్‌తో ఆర్జీవీ మేనకోడలు నిశ్చితార్థం | Costume Designer Shravya Varma Engagement With Kidambi Srikanth | Sakshi
Sakshi News home page

Sharvya Varma: షట్లర్‌తో ప్రేమలో టాలీవుడ్ లేడీ ప్రొడ్యూసర్

Aug 11 2024 7:37 AM | Updated on Aug 11 2024 11:17 AM

Costume Designer Shravya Varma Engagement With Kidambi Srikanth

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మేనకోడలు, టాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ కమ్ నిర్మాత శ్రావ్య వర్మ నిశ్చితార్థం చేసుకుంది. ప్రపంచ నం.1 బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ ఈమెతో త్వరలో ఏడడుగులు వేయబోతున్నాడు. తాజాగా శనివారం రాత్రి ఈ విషయాన్ని వీళ్లిద్దరూ బయటపెట్టారు. ఈ క్రమంలోనే సినీ, క్రీడా ప్రముఖులు వీళ్లకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: ఐశ్వర్యరాయ్‌తో విడాకుల రూమర్స్.. వైరల్‌గా డీప్ ఫేక్ వీడియో!)

బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా శ్రీకాంత్ తెలుగు వాళ్లందరికీ తెలుసు. ఇక శ్రావ్య వర్మ విషయానికొస్తే.. దేవదాసు, చిలసౌ, మ్యాస్ట్రో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. అలానే కీర్తి సురేశ్ లీడ్ రోల్ చేసిన 'గుడ్ లక్ సఖి' అనే సినిమాకు సహ నిర్మాతగానూ వ్యవహరించింది.

మరీ ముఖ్యంగా 'లక్ష‍్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాకు దర్శకత్వం వహించిన రాంగోపాల్ వర్మ.. తన మేనకోడలు అని చెప్పి శ్రావ్య వర్మని  పరిచయం చేశాడు. ఈ చిత్రానికి ఈమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసినట్లు అప్పట్లో వెల్లడించాడు. శ్రావ్య ఇన్ స్టా ప్రొఫైల్ చూస్తే ఆమె ఎవరెవరికి కాస్ట్యూమ్ డిజైన్ చేసిందనేది మీకు తెలుస్తోంది. ఏదేమైనా నిశ్చితార్థం చేసుకుని శుభవార్త చెప్పిన కొత్త జంట.. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంది.

(ఇదీ చదవండి: చైతూ- శోభిత ఎంగేజ్‌మెంట్‌.. వాలైంటెన్స్‌ డే వీడియో వైరల్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement