Srikanth kidambi
-
ఆర్జీవీ మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లి వేడుకలు.. సందడి చేసిన యాంకర్ సుమ కనకాల!
-
స్టార్ షట్లర్ శ్రీకాంత్‌తో ఆర్జీవీ మేనకోడలు నిశ్చితార్థం
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మేనకోడలు, టాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ కమ్ నిర్మాత శ్రావ్య వర్మ నిశ్చితార్థం చేసుకుంది. ప్రపంచ నం.1 బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ ఈమెతో త్వరలో ఏడడుగులు వేయబోతున్నాడు. తాజాగా శనివారం రాత్రి ఈ విషయాన్ని వీళ్లిద్దరూ బయటపెట్టారు. ఈ క్రమంలోనే సినీ, క్రీడా ప్రముఖులు వీళ్లకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఐశ్వర్యరాయ్‌తో విడాకుల రూమర్స్.. వైరల్‌గా డీప్ ఫేక్ వీడియో!)బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా శ్రీకాంత్ తెలుగు వాళ్లందరికీ తెలుసు. ఇక శ్రావ్య వర్మ విషయానికొస్తే.. దేవదాసు, చిలసౌ, మ్యాస్ట్రో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. అలానే కీర్తి సురేశ్ లీడ్ రోల్ చేసిన 'గుడ్ లక్ సఖి' అనే సినిమాకు సహ నిర్మాతగానూ వ్యవహరించింది.మరీ ముఖ్యంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాకు దర్శకత్వం వహించిన రాంగోపాల్ వర్మ.. తన మేనకోడలు అని చెప్పి శ్రావ్య వర్మని పరిచయం చేశాడు. ఈ చిత్రానికి ఈమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసినట్లు అప్పట్లో వెల్లడించాడు. శ్రావ్య ఇన్ స్టా ప్రొఫైల్ చూస్తే ఆమె ఎవరెవరికి కాస్ట్యూమ్ డిజైన్ చేసిందనేది మీకు తెలుస్తోంది. ఏదేమైనా నిశ్చితార్థం చేసుకుని శుభవార్త చెప్పిన కొత్త జంట.. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంది.(ఇదీ చదవండి: చైతూ- శోభిత ఎంగేజ్మెంట్.. వాలైంటెన్స్ డే వీడియో వైరల్!) View this post on Instagram A post shared by Srikanth Kidambi (@srikanth_kidambi) -
కిడాంబి శ్రీకాంత్, షేక్ జాఫ్రిన్‌లను అభినందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్, డెఫిలింపియన్ టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్ కలిశారు. కాగా ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన థామస్ కప్‌ను భారత్ సాధించడంలో కిడాంబి శ్రీకాంత్ కీలక పాత్ర పోషించాడు. బధిరుల ఒలంపిక్ క్రీడల్లో కర్నూలుకు చెందిన టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్ కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను వెలుగెత్తి చాటుతున్న వారివురిని సీఎం జగన్ అభినందించారు. జాఫ్రిన్ అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. చదవండి: (CM Jagan: సీఎం వైఎస్ జగన్‌తో 'ఏటీసీ టైర్స్' ప్రతినిధుల భేటీ) -
ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్ ప్రశంసలు సంతోషాన్నిచ్చాయి: కిదాంబి శ్రీకాంత్
-
ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానం
-
నేటి నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
-
సింధు వర్సెస్ సైనా
గువాహటి: బ్యాడ్మింటన్ అభిమానులను అలరించడానికి ప్రొ బ్యాడ్మింటన్ లీగ్ సీజన్–3 సిద్ధమైంది. నేటి నుంచి 23 రోజుల పాటు గువాహటి, లక్నో, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఈ పోటీలు జరుగుతాయి. స్థానిక కరమ్‌బీర్ నబీన్ చంద్ర బర్డోలాయ్ ఏసీ ఇండోర్ స్టేడియంలో జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై స్మాషర్స్ జట్టు అవధ్ వారియర్స్‌తో తలపడనుంది. మహిళల సింగిల్స్ విభాగంలో భాగంగా చెన్నై తరఫున పీవీ సింధు, అవధ్ తరఫున సైనా నెహ్వాల్‌లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నారు. ఇటీవలే జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో సింధును ఓడించి సైనా జోరు కనబరిచింది. అయినప్పటికీ ముఖాముఖిలో 2–1తో సింధుదే పైచేయిగా ఉంది. సీజన్–2లో ఆరు జట్లతో జరిగిన పీబీఎల్‌లో ఈసారి మరో రెండు జట్లు జతయ్యాయి. కొత్తగా అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్, నార్త్ ఈస్ట్రన్ వారియర్స్ జట్లు లీగ్‌లో చేరాయి. వీటితో పాటు ఢిల్లీ ఏసర్స్ జట్టు పేరు మార్చుకొని ఢిల్లీ డాషర్స్ పేరుతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. పీబీఎల్‌లో తొలిసారిగా మహిళల నం.1 క్రీడాకారిణి తైజు యింగ్ (తైవాన్) అరంగేట్ర జట్టు అహ్మదాబాద్ స్మాషర్స్ తరఫున బరిలోకి దిగనుంది. పురుషుల విభాగంలోనూ వరల్డ్ నం.1 విక్టర్ అక్సెల్సన్ బెంగళూరు బ్లాస్టర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈసారి 10 మంది ఒలింపియన్లు లీగ్‌లో పాల్గొననుండటం విశేషం. టోర్నీ ఫార్మాట్ ప్రకారం ఇరు జట్ల మధ్య రెండు పురుషుల సింగిల్స్, ఒక మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్ విభాగాల్లో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో మ్యాచ్ మూడు గేమ్‌ల పాటు జరుగుతుంది. ప్రతీ గేమ్‌కు గరిష్టంగా 15 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. గత సీజన్లో 11 పాయింట్లతో గేమ్‌ను నిర్వహించారు. లీగ్ దశ ముగిశాక పాయింట్లపరంగా టాప్–4 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. టోర్నీలో కీలకమైన సెమీస్ మ్యాచ్‌లతో పాటు, ఫైనల్ పోరుకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ.6 కోట్లు. ట్రోఫీతో 8 జట్ల మార్క్యూ ఆటగాళ్లు -
ఇక కోచ్‌లకు శిక్షణ ఇవ్వాలి
ముంబై: అంతర్జాతీయస్థాయిలో కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ విజయాలతో భారత్‌లో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరిగింది. ఈ సమయంలోనే దేశంలో ఉన్న బ్యాడ్మింటన్ కోచ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు విదేశాల నుంచి అగ్రశ్రేణి కోచ్‌లను రప్పించే విషయాన్ని ఆలోచించాలని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకొనె అభిప్రాయపడ్డారు. ‘దేశంలో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరుగుతోంది. దీనికి సరిపడా నాణ్యమైన కోచ్‌ల అవసరం చాలా ఉంది. దీనిపై ‘బాయ్’, ‘సాయ్’ ప్రత్యేక దృష్టిపెట్టాలి. మన దగ్గర చాలా గొప్ప కోచ్‌లున్నారు. కానీ దురదృష్టవశాత్తూ వారి ప్రమాణాలను పెంచుకునే అవకాశాల్లేవు’ అని పడుకొనె అన్నారు. -
కిడాంబి శ్రీకాంత్‌కు ఘన స్వాగతం
సాక్షి, హైదరాబాద్: వరుసగా రెండు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించి హైదరాబాద్ చేరుకున్నస్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఘనస్వాగతం లభించింది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న శ్రీకాంత్‌కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ వరుసగా రెండు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలుచుకోవబం సంతోషంగా ఉందన్నారు. తన విజయాల వెనుక కోచ్ పుల్లెల గోపిచంద్ కృషి ఎంతో ఉందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని టోర్నీలు గెలవడానికి ప్రయత్నిస్తానన్నారు. ఈ ఏడాది ఇండోనేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. -
సెమీస్‌లో సింధు, శ్రీకాంత్
సయ్యద్ మోడి బ్యాడ్మింటన్ టోర్నీ లక్నో: అంచనాలను నిలబెట్టుకుంటూ భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మరో తెలుగు ఆటగాడు భమిడిపాడి సాయిప్రణీత్ కూడా సెమీస్‌కు చేరుకున్నాడు. పురుషుల విభాగంలో నలుగురు భారత ఆటగాళ్లే సెమీస్‌లో తలపడనుండటం విశేషం. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మూడో సీడ్ శ్రీకాంత్ 21–12, 21–17 స్కోరుతో ఏడో సీడ్ జుల్ఫాద్‌లీ జుల్కిఫ్లీ (మలేసియా)ను చిత్తు చేశాడు. మరో క్వార్టర్స్‌లో తొమ్మిదో సీడ్ సాయిప్రణీత్ 21–19, 12–21, 21–10తో భారత ఆటగాడు సౌరభ వర్మపై గెలుపొందాడు. సెమీస్‌లో శ్రీకాంత్‌తో సాయిప్రణీత్ తలపడతాడు. మరో ఇద్దరు భారత షట్లర్లు క్వార్టర్స్‌లో సంచలన విజయాలు సాధించారు. ఎనిమిదో సీడ్, జాతీయ చాంపియన్ సమీర్ వర్మ 21–15, 21–13తో రెండో సీడ్ క్రిస్టియాన్ విటింగస్ (డెన్మార్క్)ను చిత్తుగా ఓడించాడు. మరో మ్యాచ్‌లో ముంబై ఆటగాడు, అండర్–19 మాజీ జాతీయ చాంపియన్ హర్షీల్ దానీ కూడా 21–16, 17–21, 21–11తో పన్నెండో సీడ్ ఎమిల్ హోస్ట్ (డెన్మార్క్)ను ఓడించి సమీర్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. మహిళల విభాగంలో టాప్ సీడ్ పీవీ సింధు 21–15, 21–11తో భారత్‌కే చెందిన క్వాలిఫయర్ వైదేహీ చౌదరిపై ఘన విజయం సాధించింది. రితూపర్ణదాస్ (భారత్)ను 21–17, 13–21, 23–21తో చిత్తు చేసిన నాలుగో సీడ్ ఫిత్రియాని (ఇండోనేసియా)ను సింధు సెమీస్‌లో ఎదుర్కొంటుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో బీట్రిజ్ కొరాల్స్ (స్పెయిన్ )ను 21–9, 21–11తో ఓడించి గ్రెగొరియా మరిస్కా (ఇండోనేసియా)... శ్రీకృష్ణ ప్రియ (భారత్)ను 21–17, 21–15తో ఓడించి హనా రమదీని (ఇండోనేసియా) కూడా సెమీస్‌లోకి అడుగు పెట్టారు. సెమీఫైనల్లో సిక్కి రెడ్డి హైదరాబాద్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో సెమీస్‌కు చేరుకుంది. మహిళల డబుల్స్‌లో సిక్కి–అశ్విని పొన్నప్ప జోడి 21–14, 21–18తో మలేసియా జంట మీ కువాన్ చౌ–లీ మెంగ్ యీన్ ను ఓడించింది. మిక్స్డ్ క్వార్టర్స్‌లో సిక్కి–ప్రణవ్ చోప్రా 21–16, 21–19తో యోగేంద్ర కృష్ణన్ –ప్రజక్తా సావంత్‌ను ఓడించగా, మరో క్వార్టర్స్‌లో యోంగ్ కై టెరీ–వీ హాన్ టాన్ పై సుమీత్ రెడ్డి–అశ్విని 21–18, 23–21తో నెగ్గారు. -
‘ఖేల్ రత్న’ లాంఛనమే
-
‘ఖేల్ రత్న’ లాంఛనమే
సానియాకు అత్యున్నత క్రీడా పురస్కారం ♦ శ్రీకాంత్, అనూప్‌లకు ‘అర్జున’ ♦ రోహిత్ సహా మరో 15 మందికి కూడా... ♦ క్రీడాశాఖకు ప్రతిపాదించిన అవార్డుల కమిటీ న్యూఢిల్లీ : దేశం గర్వించదగ్గ విజయాలు సాధించిన టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర’ పురస్కారానికి ఎంపికైంది. బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ కిడాంబి శ్రీకాంత్, రోలర్ స్కేటింగ్ ప్లేయర్ అనూప్ కుమార్ యామా ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డులను దక్కించుకున్నారు. ఈ మేరకు పురస్కారాల కమిటీ వీళ్ల పేర్లను కేంద్ర క్రీడాశాఖకు సిఫారసు చేసింది. ఇక క్రీడాశాఖ అధికారికంగా ప్రకటించడం లాంఛనమే కానుంది. జాబితాను ఆమోదించిన తర్వాత ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఆటగాళ్లకు ఈ అవార్డులను అందజేస్తారు. క్రికెటర్ రోహిత్ శర్మతో పాటు మరో 14 మందిని కూడా అర్జున అవార్డుకు ప్రతిపాదించారు. ఖేల్త్న్ర అవార్డు దక్కించుకోబోతున్న రెండో టెన్నిస్ ప్లేయర్ సానియా. అట్లాంటా ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన లియాండర్ పేస్... 1996లో ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. దీపికా పల్లికల్ (స్క్వాష్), వికాస్ గౌడ (డిస్కస్ త్రోయర్), టింటూ లూకా (ట్రాక్ అండ్ ఫీల్డ్), పి.వి.సింధు (బ్యాడ్మింటన్), సర్దార్ సింగ్ (హాకీ)ల నుంచి గట్టిపోటీ ఎదురైనా... కమిటీ మాత్రం సానియా వైపే మొగ్గు చూపింది. ప్రొఫెషనల్ సర్క్యూట్లో మూడు మిక్స్డ్ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్) గెలిచిన 28 ఏళ్ల సానియా 2014 ఆసియా గేమ్స్‌లోనూ స్వర్ణం, కాంస్య పతకాలను గెలుచుకుంది. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సానియాకు గతంలో అర్జున (2004), పద్మశ్రీ (2006) పురస్కారాలు కూడా లభించాయి. అర్జున అవార్డుకు ఎంపికైన మరో 14 మంది పూవమ్మ (అథ్లెటిక్స్), పీఆర్ శ్రీజేశ్ (హాకీ), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతు రాయ్ (షూటింగ్), సందీప్ కుమార్ (ఆర్చరీ), మన్దీప్ జాంగ్రా (బాక్సింగ్), బబిత, భజ్రంగ్ (రెజ్లింగ్), స్వరణ్ సింగ్ విర్క్ (రోయింగ్), సతీశ్ శివలింగం (వెయిట్‌లిఫ్టింగ్), సంతోయ్ దేవి (వుషు), శరత్ గైక్వాడ్ (ప్యారా సెయిలింగ్), మన్జీత్ చిల్లార్, అభిలాష మహాత్రే (కబడ్డీ). రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ కావడం పట్ల భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అమితానందం వ్యక్తం చేసింది. మార్టినా హింగిస్‌తో కలిసి రోజర్స్ కప్ ఆడేందుకు ప్రస్తుతం సానియా, టొరంటో (కెనడా)లో ఉంది. ట్విట్టర్ ద్వారా ఆమె తన సంతోషాన్ని పంచుకుంది. ‘వాహ్....టొరంటోలో శుభోదయం. భారత్‌నుంచి ఇప్పుడే అద్భుతమైన వార్త తెలిసింది. ఖేల్త్న్రతో గౌరవించబడటం సంతోషకరం. అందరికీ కృతజ్ఞతలు’ అని సానియా వ్యాఖ్యానించింది. ఆకాశంలో విహరిస్తున్నట్లు ఉంది ‘నా జీవితంలో అత్యంత ఆనందకర క్షణం. ఆకాశంలో విహరిస్తున్నట్లుంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రోజు స్కేటింగ్‌కు గుర్తింపు దక్కినట్లుగా భావించాను. ఇప్పుడు స్కేటర్‌కు అర్జున ఇచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించింది. ఎప్పుడో 1989లో నమన్ పారిఖ్‌కు ఈ అవార్డు వచ్చినట్లు విన్నాను. దాదాపు 26 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక స్కేటర్‌కు దక్కడం పట్ల నేను గర్వపడుతున్నా. గతంలో ఒకటి, రెండు సార్లు అవార్డును ఆశించి రాకపోవడంతో నిరాశ చెందాను. అయితే పట్టుదలతో మరిన్ని విజయాలు సాధించాను. నా కోచ్‌గా, మార్గదర్శిగా ఉన్న మా నాన్న వల్లే ఇది సాధ్యమైంది. ఆయనకు అవార్డు అంకితం’ -అనూప్ యామా (స్కేటర్) అవార్డును ఊహించా! ‘అర్జున అవార్డు ప్రకటన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. ఎన్ని టోర్నీలు గెలిచినా ప్రభుత్వ గుర్తింపు ప్రత్యేకత వేరు. నా తల్లిదండ్రులు, కోచ్‌లతో పాటు కెరీర్లో అండగా నిలిచినవారందరికీ ఈ అవార్డు అంకితం. గత ఏడాది కాలంగా నా ప్రదర్శన చాలా బాగుంది. ఈ సంవత్సం నాకేదో మంచి జరగబోతోందని ఊహించా. అది అర్జున రూపంలో వచ్చినట్లుంది. మరింత బాగా ఆడేందుకు ఈ అవార్డులు ప్రోత్సాహకంగా నిలుస్తాయి. ఇప్పటి వరకు నా కెరీర్ సాగుతున్న తీరు, సాధించిన ఘనతల పట్ల సంతృప్తిగా ఉన్నా. పెద్ద ఈవెంట్లలో మరింత నిలకడ ప్రదర్శించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకమే నా లక్ష్యం’ -‘సాక్షి’తో కిడాంబి శ్రీకాంత్ -
సింధు, శ్రీకాంత్ శుభారంభం
చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ తైపీ : స్థాయికి తగ్గట్టు రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో శుభారంభం చేశారు. అయితే ప్రపంచ 45వ ర్యాంకర్ గురుసాయిదత్‌కు క్వాలిఫయర్ చేతిలో అనూహ్య ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-19, 21-19తో లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)ను ఓడించింది. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు రెండు గేముల్లో పలుమార్లు వెనుకంజ వేసినా కీలకదశలో పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ శ్రీకాంత్ 21-17, 21-15తో జు వీ వాంగ్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. భారత్‌కే చెందిన సమీర్ వర్మ 20-22, 21-13, 21-13తో కువో పో చెంగ్ (చైనీస్ తైపీ)ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో గురుసాయిదత్ 21-23, 17-21తో క్వాలిఫయర్, ప్రపంచ 243వ ర్యాంకర్ షెసర్ హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. గురువారం జరిగే రెండో రౌండ్ పోటీల్లో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా)తో సమీర్ వర్మ; మౌలానా ముస్తఫా (ఇండోనేసియా)తో శ్రీకాంత్; ప్రపంచ ఐదో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడతారు.