
ముంబై: అంతర్జాతీయస్థాయిలో కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ విజయాలతో భారత్‌లో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరిగింది. ఈ సమయంలోనే దేశంలో ఉన్న బ్యాడ్మింటన్ కోచ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు విదేశాల నుంచి అగ్రశ్రేణి కోచ్‌లను రప్పించే విషయాన్ని ఆలోచించాలని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకొనె అభిప్రాయపడ్డారు. ‘దేశంలో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరుగుతోంది. దీనికి సరిపడా నాణ్యమైన కోచ్‌ల అవసరం చాలా ఉంది. దీనిపై ‘బాయ్’, ‘సాయ్’ ప్రత్యేక దృష్టిపెట్టాలి. మన దగ్గర చాలా గొప్ప కోచ్‌లున్నారు. కానీ దురదృష్టవశాత్తూ వారి ప్రమాణాలను పెంచుకునే అవకాశాల్లేవు’ అని పడుకొనె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment