
సాక్షి, హైదరాబాద్: వరుసగా రెండు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించి హైదరాబాద్ చేరుకున్నస్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఘనస్వాగతం లభించింది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న శ్రీకాంత్‌కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ వరుసగా రెండు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలుచుకోవబం సంతోషంగా ఉందన్నారు. తన విజయాల వెనుక కోచ్ పుల్లెల గోపిచంద్ కృషి ఎంతో ఉందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని టోర్నీలు గెలవడానికి ప్రయత్నిస్తానన్నారు. ఈ ఏడాది ఇండోనేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment