సింధు, శ్రీకాంత్ శుభారంభం
చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ
తైపీ : స్థాయికి తగ్గట్టు రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. అయితే ప్రపంచ 45వ ర్యాంకర్ గురుసాయిదత్‌కు క్వాలిఫయర్ చేతిలో అనూహ్య ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21-19, 21-19తో లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)ను ఓడించింది. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు రెండు గేముల్లో పలుమార్లు వెనుకంజ వేసినా కీలకదశలో పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ శ్రీకాంత్ 21-17, 21-15తో జు వీ వాంగ్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు.
భారత్‌కే చెందిన సమీర్ వర్మ 20-22, 21-13, 21-13తో కువో పో చెంగ్ (చైనీస్ తైపీ)ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో గురుసాయిదత్ 21-23, 17-21తో క్వాలిఫయర్, ప్రపంచ 243వ ర్యాంకర్ షెసర్ హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. గురువారం జరిగే రెండో రౌండ్ పోటీల్లో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా)తో సమీర్ వర్మ; మౌలానా ముస్తఫా (ఇండోనేసియా)తో శ్రీకాంత్; ప్రపంచ ఐదో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడతారు.