indian badminton star
-
Paris 2024 Olympics: పతాకధారిగా సింధు
న్యూఢిల్లీ: వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ పతకంపై గురి పెట్టిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు గొప్ప గౌరవం లభించింది. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సింధు నేతృత్వం వహించనుంది. విశ్వ క్రీడల్లో పతాకధారిగా వ్యవహరించనున్న సింధు భారత బృందాన్ని ముందుండి నడిపించనుంది. మరో ఫ్లాగ్ బేరర్‌గా తమిళనాడుకు చెందిన దిగ్గజ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ ఆచంట శరత్ కమల్ వ్యవహరిస్తాడు. ఐదోసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న 41 ఏళ్ల శరత్‌ను పతాకధారిగా గత మార్చి నెలలోనే భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. విశ్వ క్రీడా వేదికపై లింగ సమానత్వం ఉండాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2020 టోక్యో ఒలింపిక్స్ నుంచి ప్రారం¿ోత్సవ వేడుకల్లో ఆయా దేశాలు పురుష ఫ్లాగ్ బేరర్‌తోపాటు ఒక మహిళా ఫ్లాగ్ బేరర్‌కు కూడా అవకాశం ఇవ్వాలనే నిబంధనను అమల్లోకి తెచి్చంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి హాకీ ప్లేయర్ మన్‌ప్రీత్ సింగ్, మహిళా బాక్సర్ మేరీకోమ్ పతాకధారులుగా వ్యవహరించారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన ఏకైక భారత మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన 29 ఏళ్ల సింధు 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో ఫ్లాగ్ బేరర్‌గా గౌరవం పొందింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన సింధు, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. పారిస్ క్రీడల్లోనూ సింధు పతకం సాధిస్తే ఒలింపిక్స్ చరిత్రలో మూడు వ్యక్తిగత పతకాలు నెగ్గిన ఏకైక భారతీయ ప్లేయర్‌గా సింధు రికార్డు సృష్టిస్తుంది. సింధు కంటే ముందు రెజ్లర్ సుశీల్ కుమార్ మాత్రమే ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలుసాధించాడు. చెఫ్ డి మిషన్‌గా గగన్ నారంగ్ మరోవైపు పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి చెఫ్ డి మిషన్‌గా తెలంగాణ షూటర్ గగన్ నారంగ్ వ్యవహరిస్తాడు. ముందుగా మేరీకోమ్‌ను చెఫ్ డి మిషన్‌గా ప్రకటించినా వ్యక్తిగత కారణాలరీత్యా ఈ బాధ్యతలు తీసుకోలేనని ఆమె ప్రకటించింది. దాంతో గగన్ నారంగ్‌కు చెఫ్ డి మిషన్ బాధ్యతలు అప్పగిస్తున్నామని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపింది. చెఫ్ డి మిషన్ హోదాలో గగన్ ఒలింపిక్స్‌లో పాల్గొనే మొత్తం భారత క్రీడాకారుల వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. 41 ఏళ్ల గగన్ నారంగ్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించాడు. 4: భారత్ తరఫున ఒలింపిక్స్ క్రీడల్లో ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్న నాలుగో మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు గుర్తింపు పొందనుంది. గతంలో ఈ ఘనత షైనీ విల్సన్, అంజూ బాబీ జార్జి, మేరీకోమ్లకు మాత్రమే దక్కింది. అథ్లెట్ షైనీ విల్సన్ 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో... లాంగ్‌జంపర్ అంజూ బాబీ జార్జి 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో... బాక్సర్ మేరీకోమ్ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఫ్లాగ్ బేరర్స్‌గా ఉన్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న భారత స్టార్ షట్లర్.. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు అదుర్స్
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ ఎస్ ప్రణయ్ మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఇటీవలే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ర్యాంకింగ్స్‌లో టాప్ లేపిన (నంబర్ వన్ ర్యాంక్) ప్రణయ్.. తన గర్ల్‌ఫ్రెండ్ శ్వేతా గోమ్స్‌ని వివాహం చేసుకోబోతున్నట్లు ట్విటర్ వేదికగా అనౌన్స్ చేశాడు. ప్రణయ్ తన ట్వీట్లో ఫియాన్సీ శ్వేతా గోమ్స్‌తో దిగిన ప్రీ వెడ్డింగ్ ఫోటోలను షేర్ చేశాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. 30 ఏళ్ల ప్రణయ్ ఈ ఏడాది భీకర ఫామ్‌లో కొనసాగుతున్నాడు. మే నెలలో జరిగిన థామప్ కప్‌లో భారత్ స్వర్ణం సాధించడంలో ప్రణయ్ కీలకపాత్ర పోషించాడు. అలాగే ఇటీవలే జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్, జపాన్ ఓపెన్‌లోనూ ప్రణయ్ సత్తా చాటాడు. ప్రణయ్ హైదరాబాద్‌లోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుని రాటుదేలాడు. ప్రణయ్ స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. All that you are is all that I will ever need ♥️ #3daystogo pic.twitter.com/SegXJdv5ES — PRANNOY HS (@PRANNOYHSPRI) September 10, 2022 -
సైనా X ‘బాయ్’
హైదరాబాద్: ఒలింపిక్ కాంస్యం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత, కాంస్యాలు, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలతో పాటు సూపర్ సిరీస్ టోర్నీలలో లెక్క లేనన్ని విజయాలు... భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఘనత ఇది. అయితే ఇప్పుడు ఇదంతా గతం. 32 ఏళ్ల వయసులో ఫామ్ కోల్పోయి ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సైనా మునుపటి ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. అనామక, యువ షట్లర్ల చేతుల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. తాను ఆడిన గత ఆరు టోర్నీలలో ఆమె రెండో రౌండ్ దాటలేకపోయింది. కరోనా కాలాన్ని పక్కన పెడితే 2019నుంచి సైనా ఒకే ఒక్క టోర్నీలో సెమీఫైనల్ వరకు చేరగలిగింది. ఇలాంటి స్థితిలో రాబోయే పెద్ద ఈవెంట్లలో సైనాకు భారత బృందంలో చోటు దక్కడం కష్టంగా మారింది. తాజాగా ఆసియా, కామన్వెల్త్ క్రీడలతో పాటు ఉబెర్ కప్ సెలక్షన్ ట్రయల్స్‌కు కూడా సైనా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే ట్రయల్స్‌తో సంబంధం లేకుండా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నేరుగా ఎంపిక చేసిన ప్లేయర్లలో కూడా సైనా పేరు లేదు. దాంతో ఆమె ‘బాయ్’పై విమర్శలకు దిగిం ది. ఈ నేపథ్యంలో మున్ముందు రాబోయే టోర్నీల్లో సైనా ఎలా భాగం కాబోతుందనేది ఆసక్తికరం. ఏం జరిగిందంటే... ఆసియా, కామన్వెల్త్ క్రీడలు, థామస్– ఉబెర్ కప్ కోసం నేటినుంచి ఆరు రోజుల పాటు ఈ నెల 20 వరకు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ‘బాయ్’ ప్రకటించింది. ఇందులో 120 మంది షట్లర్లు పాల్గొనబోతున్నారు. ట్రయల్స్‌కు ఇబ్బంది రాకూడదని కొరియా మాస్టర్స్ టోర్నీకి కూడా భారత్‌నుంచి ఎవరూ పాల్గొనకుండా ‘బాయ్’ జాగ్రత్తలు తీసుకుంది. అయితే తాను దీనికి హాజరు కావడం లేదని సైనా ఇప్పటికే ‘బాయ్’కు వెల్లడించింది. మరో వైపు సెలక్షన్స్‌కు ఒక రోజు ముందే గురువారం పై ఈవెంట్లలో నేరుగా పాల్గొనే ఆటగాళ్ల జాబితాను ‘బాయ్’ వెల్లడించింది. వరల్డ్ టాప్–15 ర్యాంక్‌లో ఉండటం అర్హతగా పేర్కొంటూ సింధు, శ్రీకాంత్, లక్ష్య సేన్, డబుల్స్ జోడి సాత్విక్–చిరాగ్‌లను ఎంపిక చేసింది. టాప్–15లో లేకపోయినా ఇటీవలి చక్కటి ప్రదర్శనకు గుర్తింపునిస్తూ హెచ్ఎస్ ప్రణయ్‌కు కూడా అవకాశం కల్పించింది. అయితే ఫామ్‌లో లేకపోయినా, తన ఘనతలు, అనుభవం దృష్ట్యా తనకూ నేరుగా అవకాశం లభిస్తుందని సైనా ఆశించి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు. దీనిపై సైనా స్పందించింది. వరుస టోర్నీలతో అలసిపోవడం వల్లే తాను ట్రయల్స్‌కు రావడం లేదని... పరిస్థితి చూస్తుంటే ‘బాయ్’ ఉద్దేశపూర్వకంగానే తనను పక్కన పెట్టినట్లుగా ఉందని ఆమె విమర్శించింది. ట్విట్టర్లో తన వ్యాఖ్యలను ఆమె కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు కూడా ట్యాగ్ చేసింది. దీనిపై ‘బాయ్’ ఎలా స్పందిస్తుందో చూడాలి. ‘గత కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో నేను సాధించిన పతకాలను నిలబెట్టుకునే ఉద్దేశం నాకు లేదన్నట్లుగా కథనాలు వస్తున్నాయి. కానీ గత మూడు వారాలుగా వరుసగా యూరోపియన్ సర్క్యూట్లో టోర్నీలు ఆడటంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్ కూడా ఉండటంతోనే నేను ట్రయల్స్‌కు హాజరు కావడం లేదు. రెండు వారాల వ్యవధిలో ఒక సీనియర్ ప్లేయర్ ఇలా వరుసగా ఆడటం చాలా కష్టం. గాయాల ప్రమాదం కూడా ఉంటుంది. సెలక్షన్స్‌కు తక్కువ వ్యవధి ఉండటంపై నేను ‘బాయ్’ను అడిగినా వారు స్పందించలేదు. నన్ను కామన్వెల్త్, ఆసియా క్రీడలనుంచి తప్పించడం వారికీ సంతోషం కలిగిస్తున్నట్లుంది. ప్రస్తుతం నా ప్రపంచ ర్యాంక్ 23. ఇటీవల ఆల్ ఇంగ్లండ్‌లో యమ గూచిని దాదాపుగా ఓడించాను. ఇండియా ఓపెన్‌లో ఒక్క పరాజయంతో ‘బాయ్’ నన్ను తక్కువ చేసి చూపిస్తోంది’. –సైనా నెహ్వాల్ -
ఒలింపిక్స్ కోసమే సన్నాహాలు
భారత్‌లో క్రీడలు ఆగిపోయాయి. విదేశాలకు వెళ్లి టోర్నీలు ఆడాలంటే సవాలక్ష ఆంక్షలు. ఒలింపిక్స్‌లాంటి మెగా ఈవెంట్ కూడా జరుగుతుందా అనేది కూడా సందేహమే. ఇలాంటి స్థితిలో ఆటగాళ్లు నిరంతర సాధనను కొనసాగించడం అంత సులువు కాదు. దేని కోసం సన్నద్ధమవుతున్నామో తెలియని స్థితిలో ప్రేరణ పొందడం కష్టంగా ఉంటుంది. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు కూడా ఒకదశలో దాదాపు ఇదే స్థితిలో ఉంది. అయితే అన్నీ అనుకూలించి ఒలింపిక్స్ జరుగుతాయని తాను ఆశిస్తున్నానని... మధ్యలో ఇతర టోర్నీల్లో ఆడినా, ఆడకపోయినా ఇబ్బంది లేదంటున్న సింధు పలు అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడింది. విశేషాలు ఆమె మాటల్లోనే... రోజూవారీ ప్రాక్టీస్‌పై... ఎప్పటిలాగే నా రొటీన్లో మార్పులు లేకుండా ఉదయం, సాయంత్రం సాధన కొనసాగిస్తున్నాను. సుదీర్ఘ సమయంపాటు ప్రాక్టీస్ జరుగుతోంది. వారంలో రెండు రోజులు ట్రెయినింగ్‌కు కేటాయించి ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాను. అదృష్టవశాత్తూ గత కొంత కాలంగా ఫిట్‌నెస్‌కు సంబంధించి ఎలాంటి సమస్యలూ లేవు. వంద శాతం బాగుండటంతో ప్రాక్టీస్ సెషన్లు చాలా ఉత్సాహంగా సాగుతున్నాయి. కోచ్ పార్క్ పర్యవేక్షణపై... గత కొన్ని నెలలుగా నేను గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలోనే సాధన చేస్తున్నాను. భారత సింగిల్స్ కోచ్ పార్క్ పూర్తి సమయం కేటాయిస్తూ నా ప్రాక్టీస్‌ను పర్యవేక్షిస్తున్నారు. గత కొన్ని టోర్నీల్లో నేను మెరుగైన స్థితిలో ఉండి కూడా మ్యాచ్‌లు చేజార్చుకున్నాను. ఆ సమయంలో చేసిన తప్పులు, లోపాలను సరిదిద్దుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాను. ఇన్నేళ్ల అనుభవం తర్వాత కొత్తగా నేర్చుకునే అంశాలు ఉండవు కానీ సాధనలో ఎక్కడా వెనక్కి తగ్గకూడదనేది నా అభిప్రాయం. అందుకే కరోనా క్లిష్ట సమయంలో కూడా ఆటపైనే పూర్తి ఫోకస్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా. రాబోయే టోర్నీలపై... ప్రస్తుతం మా అందరిదీ ఇదే పెద్ద సమస్య. మే 25 నుంచి మలేసియా ఓపెన్‌లో ఆడాల్సి ఉంది. అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజులు క్వారంటైన్లో ఉండాలి అంటే ఈ నెల 10కే అక్కడ ఉండాలి. దీనిపైనే స్పష్టత రావడం లేదు. ఒకటి రెండు రోజుల్లో పాల్గొనేది లేనిదీ తెలిసిపోతుంది. ఆ తర్వాత సింగపూర్ ఓపెన్ ఉంది. అక్కడైతే 21 రోజుల క్వారంటైన్... అదీ మరీ కష్టం. అసలు 5–6 రోజులు సాధన చేయకుండా హోటల్ గదిలో ఉండిపోతే శరీరం బిగుసుకుపోతుంది. చురుకుదనం తగ్గిపోతుంది. 14 రోజుల తర్వాత ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా కోర్టులోకి వెళ్లి ఆడాలంటే చాలా కష్టం. ఈ సమస్యలన్నీ ఉండటంతో టోర్నీకి వెళ్లాలా లేదా అనేదానిపై సందేహాలున్నాయి. నేను ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాను కాబట్టి ఆ కోణంలో సమస్య లేదు కానీ ఎంత కాలం మ్యాచ్‌లు లేకుండా ఉండగలం. టోక్యో ఒలింపిక్స్ సన్నద్ధతపై... ఇప్పుడు నేను ఇంతగా కష్టపడుతోంది సరిగ్గా చెప్పాలంటే ఒలింపిక్స్ గురించే. ఇతర టోర్నీల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా పెద్ద సమస్య లేదు. జపాన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయోగానీ ఒలింపిక్స్ జరగాలని కోరుకుంటున్నా. జరుగుతాయని కూడా ఆశిస్తున్నా. నిజాయితీగా మాట్లాడితే ఒలింపిక్స్ ఉన్నాయనే నమ్మకంతోనే సాధన చేస్తున్నా. అదే నాకు ప్రేరణనిస్తుంది. ఎప్పుడు జరిగినా ఆడేందుకు మనం సిద్ధంగా ఉండాలి. సన్నాహాల్లో లోటు ఉండకూడదు. విశ్వ క్రీడలు జరిగితే మనకు మంచి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణంతో జరగకపోయినా ఏమీ చేయలేం. సాధన చేయడంతో వచ్చిన నష్టమేమీ లేదు. మన పనే అది కదా. యూరప్‌లో శిబిరం ఏర్పాటు చేస్తే... అది ఇప్పుడు అంత సులువు కాదు. భారత్ నుంచి వచ్చేవారిపై యూరప్‌లోని దాదాపు ప్రతీ దేశంలో ఆంక్షలు ఉన్నాయి. విమానాలు లేవు, ఎక్కడికి వెళ్లినా క్వారంటైన్లు, పరీక్షలు. ఆసియా దేశాల్లోనే మన పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే ఇక యూరప్‌లో చెప్పేదేముంది. నేను గత ఏడాది ఇంగ్లండ్‌కు వెళ్లి సాధన చేసినప్పుడు పరిస్థితులు మన దేశంలో ఇంత తీవ్రంగా లేవు. కాబట్టి ఉన్న చోటనే సరైన ప్రణాళికతో ప్రాక్టీస్ సాగించడం మేలు. ఒకరిద్దరి వ్యక్తిగత అభిప్రాయం వేరు. మొత్తం భారత జట్టు కోణంలో దీనిని చూడాలి. మళ్లీ 11 పాయింట్ల స్కోరింగ్‌పై... గతంలోనూ ఈ స్కోరింగ్ విధానం ఉంది. మళ్లీ అమలు చేస్తే పెద్ద తేడా ఏమీ రాదు. అయితే ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించేలా దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. కోలుకునేందుకు అవకాశం తక్కువ. మ్యాచ్‌లు వేగంగా సాగిపోతాయి. అమల్లోకి తెస్తే ఆడక తప్పదు కానీ నా దృష్టిలో మాత్రం 21 పాయింట్ల స్కోరింగే మంచిది. బ్యాడ్మింటన్ బయట బాధ్యతలపై... ప్రస్తుతం చాలా మందిలాగే నేను కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు మినహా మిగిలిన సమయం మొత్తం ఇంట్లోనే కుటుంబసభ్యులతో గడుపుతున్నాను. ఇంట్లోనే పెంపుడు కుక్కలతో సమయం సరదాగా గడిచిపోతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా నాకు హైదరాబాద్‌లోనే లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో పని చేసే అవకాశం కల్పించింది. సాధ్యమైనన్ని సార్లు ఆఫీస్‌కు వెళ్లి నా విధులు, బాధ్యతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. –సాక్షి, హైదరాబాద్ -
కరోనా బారిన కశ్యప్...
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత పారుపల్లి కశ్యప్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. కశ్యప్‌తోపాటు భారత ఇతర షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, ఆర్‌ఎంవీ గురుసాయిదత్, ప్రణవ్ చోప్రాలకు కూడా కోవిడ్–19 పాజిటివ్ వచ్చింది. ‘ఈ నలుగురు ప్రస్తుతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కొన్ని రోజుల క్రితం ఈ నలుగురిలో ఒకరికి కరోనా స్వల్ప లక్షణాలు కనిపించడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. కశ్యప్, గురుసాయిదత్, ప్రణవ్, ప్రణయ్‌లకు పాజిటివ్ రాగా... కశ్యప్ భార్య, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు నెగెటివ్ వచ్చింది. కొన్నిసార్లు తొలి పరీక్షలో ఫాల్స్ పాజిటివ్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. దాంతో కొన్ని రోజులు వేచి చూశాక మళ్లీ పరీక్షకు హాజరు కావాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. సోమవారం వీరందరూ మరోసారి కరోనా పరీక్ష చేయించుకుంటారు’ అని పుల్లెల గోపీచంద్ అకాడమీ వర్గాలు తెలిపాయి. నవంబర్ 25న వివాహం చేసుకున్న గురుసాయిదత్ ప్రాక్టీస్ నుంచి విరామం తీసుకోగా... మిగతా ఆటగాళ్లు గోపీచంద్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నారు. -
సాయిప్రణీత్ విరాళం రూ. 4 లక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనాపై పోరాటానికి మద్దతుగా భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి ఆటగాడు, హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ తనవంతుగా రూ. 4 లక్షలు విరాళం ఇచ్చాడు. గతేడాది ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన సాయిప్రణీత్... ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 3 లక్షలు... తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 1 లక్ష వితరణ చేశాడు. కరోనా కట్టడి కోసం ఇప్పటి వరకు బ్యాడ్మింటన్ క్రీడాంశం నుంచి చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ (రూ. 26 లక్షలు), పీవీ సింధు (రూ. 10 లక్షలు), శ్రీకృష్ణప్రియ (రూ. 5 లక్షలు), కశ్యప్ (రూ. 3 లక్షలు) విరాళాలు ఇచ్చారు. హాకీ ఇండియా (హెచ్ఐ) ఇప్పటికే పీఎం–కేర్స్ రిలీఫ్ ఫండ్ కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించగా... తాజా ఒడిశా సీఎం సహాయనిధికి రూ. 21 లక్షలు ఇచ్చింది. చెస్ క్రీడాకారుల దాతృత్వం కోవిడ్–19పై పోరాటానికి చెస్ క్రీడాకారులందరూ ఏకమయ్యారు. ఆన్లైన్ టోర్నీల్లో పాల్గొనడం, విరాళాల ద్వారా రూ. 3 లక్షలకు పైగా నిధుల్ని సమకూర్చారు. తమిళనాడుకు చెందిన చెస్ కోచ్ ఆర్బీ రమేశ్‌కు చెందిన చారిటబుల్ ట్రస్ట్ ‘చెస్ గురుకుల్’కు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రూ. 2 లక్షలు, కార్తికేయన్ మురళి రూ. 25,000 విరాళం ఇచ్చారు. -
చైనా చేతిలో భారత్ చిత్తు
నానింగ్ (చైనా): మలేసియాతో గెలవాల్సిన మ్యాచ్‌లో వ్యూహాత్మక తప్పిదం చేసి మూల్యం చెల్లించుకున్న భారత బ్యాడ్మింటన్ జట్టు... పదిసార్లు చాంపియన్ చైనాతో జరిగిన మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. ఫలితంగా ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సుదిర్మన్ కప్ నుంచి లీగ్ దశలోనే భారత్ ఇంటిదారి పట్టింది. గ్రూప్ ‘1డి’లో భాగంగా బుధవారం చైనాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 0–5తో ఓటమి చవిచూసింది. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే చైనాపై కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు నిరాశాజనక ప్రదర్శన కనబర్చారు. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 5–21, 11–21తో వాంగ్ యిల్యు–హువాంగ్ డాంగ్పింగ్ జోడీ చేతిలో ఓడింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ 17–21, 20–22తో చెన్ లాంగ్ చేతిలో ఓడిపోయాడు. ప్రాక్టీస్ సందర్భంగా గాయం కావడంతో చైనాతో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చిందని భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ట్విటర్లో పేర్కొన్నాడు. మలేసియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీకాంత్ బదులు సమీర్ వర్మను ఆడించిన సంగతి తెలిసిందే. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–18, 15–21, 17–21తో హావోడాంగ్ జు–హాన్ చెంగ్‌కాయ్ జంట చేతిలో పరాజయం పాలైంది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా 12–21, 17–21తో చెన్ యుఫె చేతిలో ఓడిపోయింది. ఐదో మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 12–21, 15–21తో చెన్ కింగ్‌చెన్–జియా యిఫాన్ జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
సైనాకు అరుదైన గౌరవం
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యురాలిగా సైనాను నియమించారు. ఈ మేరకు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ నుంచి సైనాకు సోమవారం రాత్రి అధికారిక నియామక పత్రం అందింది. గత ఆగస్టులో రియో ఒలింపిక్స్ సందర్భంగా అథ్లెట్స్ కమిషన్ ఎన్నికలు జరిగాయి. అమెరికా ఐస్ హాకీ క్రీడాకారిణి ఎంజెలో రుజియెరో అధ్యక్షురాలిగా ఉన్న ఈ ఐఓసీ అథ్లెట్స్ కమిషన్‌లో తొమ్మిది మంది ఉపాధ్యక్షులు, 10 మంది సభ్యులు ఉన్నారు. అథ్లెట్స్ కమిషన్ సమావేశం వచ్చేనెల 6న జరుగుతుంది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సైనా ఇటీవలే మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించింది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలో ఆమె మళ్లీ బరిలోకి దిగొచ్చు. -
‘హ్యాట్రిక్’కు అడుగు దూరంలో...
మకావు ఓపెన్ ఫైనల్లో సింధు వరుసగా మూడో ఏడాది ఈ ఘనత నేడు మితానితో అమీతుమీ మకావు: గత ఏడాది కాలంగా లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను సాధించేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో విజయం దూరంలో నిలిచింది. మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి అంతిమ సమరానికి అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్, ఐదో సీడ్ సింధు 21-8, 15-21, 21-16తో ప్రపంచ పదో ర్యాంకర్, రెండో సీడ్ అకానె యామగుచి (జపాన్)పై గెలిచింది. ఈ విజయంతో ముఖాముఖి రికార్డులో సింధు, యామగుచి 1-1తో సమమయ్యారు. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్, ఆరో సీడ్ మినత్సు మితాని (జపాన్)తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. ముఖాముఖి రికార్డులో సింధు 0-1తో వెనుకబడి ఉంది. వీరిద్దరూ ఇదే సంవత్సరం జపాన్ ఓపెన్‌లో ఏకైకసారి తలపడగా సింధు మూడు గేమ్‌ల పోరాటంలో ఓడిపోయింది. మకావు ఓపెన్‌లో సింధు ఫైనల్‌కు చేరుకోవడం వరుసగా ఇది మూడోసారి కావడం విశేషం. 2013, 2014లలో విజేతగా నిలిచిన ఈ తెలుగు తేజం ఈసారీ గెలిస్తే అరుదైన ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంటుంది. గత ఏడాది ఇదే మకావు ఓపెన్‌లో చివరిసారి అంతర్జాతీయ టైటిల్ సాధించిన సింధుకు ఆ తర్వాత ఇతర టోర్నీల్లో నిరాశ ఎదురైంది. గత నెలలో డెన్మార్క్ ఓపెన్‌లో సింధు ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ రన్నరప్‌గా సంతృప్తి పడింది. రెండుసార్లు ప్రపంచ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన యామగుచితో జరిగిన మ్యాచ్‌లో సింధుకు గట్టిపోటీనే లభించింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సింధు తొలి గేమ్‌ను సునాయాసంగానే సొంతం చేసుకున్నా... రెండో గేమ్‌లో తడబడి మూల్యం చెల్లించుకుంది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు పుంజుకొని 11-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత యామగుచి తేరుకున్నా సింధు సంయమనంతో ఆడి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేటి ఫైనల్స్ ఉదయం గం. 10.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
'సూపర్' సింధు
సెమీస్‌లో ప్రపంచ చాంపియన్‌పై అద్భుత విజయం తొలిసారి సూపర్ సిరీస్ టోర్నీ ఫైనల్లోకి నేడు ఒలింపిక్ చాంప్ లీ జురుయ్‌తో అమీతుమీ డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఒడెన్స్ (డెన్మార్క్): గాయాల కారణంగా ఈ సీజన్లో అంతంత మాత్రంగా రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు... పూర్తి ఫిట్నెస్ సంతరించుకున్నాక తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ హైదరాబాద్ అమ్మాయి అత్యద్భుత ఆటతీరుతో అదుర్స్ అనిపించింది. ప్రతి రౌండ్లో తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులను మట్టికరిపించి తన కెరీర్లో తొలిసారి ‘సూపర్ సిరీస్’ స్థాయి టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 21-15, 18-21, 21-17తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రెండో ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్)ను బోల్తా కొట్టించింది. గంటా 15 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సింధు కీలకదశలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో 14-16తో వెనుకబడిన దశలో సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గింది. ఆ తర్వాత మారిన్ రెండు పాయింట్లు సాధించినా, సింధు వెంటనే తేరుకొని మరో పాయింట్ సాధించి చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకుంది. ముఖాముఖి రికార్డులో మారిన్‌పై సింధుకిది రెండో విజయం. చివరిసారి 2011లో మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ టోర్నీలో మారిన్‌ను ఓడించిన సింధు నాలుగేళ్ల తర్వాత ఆమెపై మళ్లీ గెలిచింది. ఈ ఏడాది సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ ఫైనల్లో, గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మారిన్ చేతిలో సింధు ఓడింది. ఈసారి మాత్రం పక్కాగా సిద్ధమై అనుకున్న ఫలితాన్ని సాధించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21-18, 21-19తో ప్రపంచ మాజీ చాంపియన్, ఏడో ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా)పై సంచలన విజయం సాధించింది. 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో యిహాన్ వాంగ్‌ను ఓడించిన సింధు ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఆమె చేతిలో ఓటమి చవిచూసింది. నేడు (ఆదివారం) జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా)తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. ముఖాముఖి రికార్డులో సింధు, లీ జురుయ్ 2-2తో సమఉజ్జీగా ఉన్నారు. ఫైనల్ సాయంత్రం గం. 6.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
శ్రీకాంత్‌కు షాక్
ఒడెన్స్ (డెన్మార్క్): భారత బ్యాడ్మింటన్ స్టార్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌కు.. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో చుక్కెదురైంది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఐదోసీడ్ శ్రీకాంత్ 15-21, 17-21తో అన్‌సీడెడ్ టామి సుగియార్తో (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. కేవలం 39 నిమిషాలు మాత్రమే జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్‌సీడ్ సైనా 18-21, 13-21తో మితాని మినత్సు (జపాన్) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో సుమిత్ రెడ్డి-మను అత్రి 19-21, 22-20, 19-21 తో లీ షెంగ్ ము-చియా సిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడారు. -
సింధు, శ్రీకాంత్ శుభారంభం
చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ తైపీ : స్థాయికి తగ్గట్టు రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో శుభారంభం చేశారు. అయితే ప్రపంచ 45వ ర్యాంకర్ గురుసాయిదత్‌కు క్వాలిఫయర్ చేతిలో అనూహ్య ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-19, 21-19తో లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)ను ఓడించింది. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు రెండు గేముల్లో పలుమార్లు వెనుకంజ వేసినా కీలకదశలో పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ శ్రీకాంత్ 21-17, 21-15తో జు వీ వాంగ్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. భారత్‌కే చెందిన సమీర్ వర్మ 20-22, 21-13, 21-13తో కువో పో చెంగ్ (చైనీస్ తైపీ)ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో గురుసాయిదత్ 21-23, 17-21తో క్వాలిఫయర్, ప్రపంచ 243వ ర్యాంకర్ షెసర్ హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. గురువారం జరిగే రెండో రౌండ్ పోటీల్లో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా)తో సమీర్ వర్మ; మౌలానా ముస్తఫా (ఇండోనేసియా)తో శ్రీకాంత్; ప్రపంచ ఐదో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడతారు. -
ఫిజియో కోసం సైనాకు రూ. 9 లక్షలు
న్యూఢిల్లీ : ప్రత్యేక వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్‌ను నియమించుకునేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సైనాకు క్రీడా శాఖ రూ. 9 లక్షలను మంజూరు చేసింది. ఈ నెల నుంచి వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్ ముగిసే వరకు సైనా ఫిజియోథెరపిస్ట్ సేవలను వినియోగించుకోవచ్చు. ఫిజియోగా ఎవరిని నియమించుకోవాలనే అంశాన్ని సైనాకే వదిలేసినట్టు క్రీడా శాఖ తెలిపింది. ప్రస్తుతం సైనా బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. వచ్చే ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్ వరకు సైనా బెంగళూరులోనే శిక్షణ కొనసాగిస్తుంది. -
కశ్యప్... ఐదో‘సారీ’
♦ మళ్లీ సెమీస్‌లో ఓడిన భారత స్టార్ ♦ ఇండోనేసియా ఓపెన్ జకార్తా : అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నా... భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ పోరాటం ముగిసింది. తాజా ఫలితంతో 28 ఏళ్ల కశ్యప్ తన కెరీర్లో ఐదోసారి ఓ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో సెమీఫైనల్ దశను దాటలేకపోయాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్)తో 76 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ కశ్యప్ 21-12, 17-21, 19-21తో పోరాడి ఓడిపోయాడు. సెమీస్‌లో ఓడిన కశ్యప్‌కు 11,600 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 లక్షల 43 వేలు)తోపాటు 7,700 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో కశ్యప్ సింగపూర్ ఓపెన్ (2012), ఇండోనేసియా ఓపెన్, ఇండియా ఓపెన్ (2012), డెన్మార్క్ ఓపెన్ (2014)లలోనూ సెమీఫైనల్లో నిష్ర్కమించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో ర్యాంకర్ వాన్ సన్ హో (కొరియా)ను... క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్, టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించిన కశ్యప్ సెమీఫైనల్లోనూ మరో సంచలనం సృష్టించేలా కనిపించాడు. అయితే కీలకదశలో అనవసర తప్పిదాలు చేయడం, ప్రత్యర్థి మొమోటా కూడా అద్భుతంగా ఆడటంతో కశ్యప్‌కు ఓటమి తప్పలేదు. తొలి గేమ్‌లో సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచిన కశ్యప్ ఒకదశలో వరుసగా 8 పాయింట్లు నెగ్గి 17-8తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లోనూ కశ్యప్ నిలకడగా ఆడి 9-5తో ముందంజ వేశాడు. అయితే అప్పటికే కశ్యప్ ఆటతీరుపై అంచనాకు వచ్చిన మొమోటా నెమ్మదిగా గాడిలో పడ్డాడు. స్కోరును 17-17 వద్ద సమం చేశాడు. ఈ దశలో కశ్యప్ పొరపాట్లు చేయడంతో మొమోటా వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో కశ్యప్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. అటు మొమోటా కూడా వెనక్కు తగ్గలేదు. దాంతో ప్రతీ పాయింట్ ఫలితం సుదీర్ఘ ర్యాలీల ద్వారా వచ్చింది. ఒకదశలో కశ్యప్ కాస్తా పైచేయి సాధించి 19-16తో మూడు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించి విజయానికి చేరువగా వచ్చాడు. అయితే మొమోటా పట్టుదలతో పోరాడి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గడంతో చివరకు కశ్యప్ ఓటమితో సరిపెట్టుకున్నాడు. -
సైనా అలవోకగా...
♦ శ్రమించి నెగ్గిన శ్రీకాంత్ ♦ పోరాడి ఓడిన సింధు, కశ్యప్, గురుసాయిదత్ ♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ సిడ్నీ: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో తన టైటిల్ వేటను ప్రారంభించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సైనా 21-12, 21-10తో లిడియా యి యు (మలేసియా)పై అలవోకగా గెలిచింది. 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా పూర్తి ఆధిపత్యం చలాయించింది. తొలి గేమ్‌లో ఒకదశలో 3-5తో వెనుకబడ్డ ఈ హైదరాబాద్ అమ్మాయి ఆ తర్వాత వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 8-5తో ముందంజ వేసింది. అదే జోరులో ఈసారి వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించి 17-7తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో గేమ్ ఆరంభంలో వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 11-2తో దూసుకెళ్లిన సైనా అటునుంచి వెనుదిరిగి చూడలేదు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 9వ ర్యాంకర్ సున్ యు (చైనా)తో సైనా తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 3-1తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు మూడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన హైదరాబాద్ అమ్మాయి పీవీ సింధు తుదికంటా పోరాడినా విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ఎనిమిదో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)తో 72 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సింధు 21-18, 15-21, 23-25తో పోరాడి ఓడింది. చివరి గేమ్‌లో సింధు ఒక మ్యాచ్ పాయింట్‌ను చేజార్చుకోవడం గమనార్హం. ఓటమి అంచుల నుంచి... పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ కిడాంబి శ్రీకాంత్ నాలుగు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని విజయం సాధించగా... పారుపల్లి కశ్యప్ రెండు మ్యాచ్ పాయింట్లను వదులుకొని ఓడిపోయాడు. క్వాలిఫయర్ గురుసాయిదత్ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా)కు చెమటలు పట్టించి పరాజయం పాలయ్యాడు. ప్రపంచ 14వ ర్యాంకర్ హాన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్)తో 53 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 14-21, 21-8, 22-20తో గెలిచాడు. చివరి గేమ్‌లో శ్రీకాంత్ 16-20తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే పట్టుదలతో పోరాడిన శ్రీకాంత్ అనూహ్యంగా వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 22-20తో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ తియాన్ హువీ (చైనా)తో శ్రీకాంత్ ఆడతాడు. ప్రపంచ ఏడో ర్యాంకర్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా)తో 81 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ 26-24, 18-21, 20-22తో ఓడిపోయాడు. చివరి గేమ్‌లో కశ్యప్ 20-18తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ తన ప్రత్యర్థికి వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయి ఓటమి మూటగట్టుకున్నాడు. చెన్ లాంగ్‌తో 72 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో గురుసాయిదత్ 21-15, 9-21, 17-21తో ఓటమి చవిచూశాడు. మహిళల డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 21-13, 21-13తో సమంతా బార్నింగ్-ఇరిస్ తబెలింగ్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. -
'మకావు'లో సింధు కేక
మళ్లీ మన ‘రాకెట్’ మెరిసింది. రెండు వారాల క్రితం చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీలో సైనా నెహ్వాల్, శ్రీకాంత్ సాధించిన అపూర్వ విజయాలు మదిలో మెదులుతుండగానే... మరో తెలుగు తేజం పి.వి.సింధు తీపి కబురు అందించింది. మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి దిగ్విజయంగా తన టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఈ ఏడాదిని విజయంతో సగర్వంగా ముగించింది. టైటిల్ నిలబెట్టుకున్న తెలుగు తేజం ⇒ ఫైనల్లో అలవోక విజయం ⇒ కెరీర్లో మూడో గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ ⇒ రూ. 5 లక్షల 60 వేల ప్రైజ్‌మనీ సొంతం మకావు: నిలకడగా రాణిస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు నిరూపించింది. అపార ప్రతిభ సొంతమైనా... ఆటలో నిలకడలేమి కారణంగా ఈ హైదరాబాద్ అమ్మాయి ఈ సీజన్‌ను ఒక్క టైటిల్ కూడా నెగ్గకుండానే ముగిస్తుందా అనే అనుమానం కలిగింది. కానీ ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఈ సంవత్సరం చివరి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్ మకావు ఓపెన్‌లో 19 ఏళ్ల సింధు చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సింధు 21-12, 21-17తో కిమ్ హ్యో మిన్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సింధుకు 9 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 60 వేలు)తోపాటు 7 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 45 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో సింధు ఆద్యంతం అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. కళ్లు చెదిరే స్మాష్‌లు... నెట్ వద్ద అప్రమత్తత... ర్యాలీల్లో పైచేయి... ఇలా ప్రతి అంశంలో ఈ తెలుగు తేజం తన ఆధిపత్యాన్ని చాటుకొని కొరియా అమ్మాయికి ఏ దశలోనూ తేరుకునే అవకాశం ఇవ్వలేదు. సెమీఫైనల్లో ప్రపంచ 19వ ర్యాంకర్ యూ సున్ (చైనా)ను ఓడించిన కిమ్ హ్యో మిన్ ఫైనల్లో మాత్రం సింధు దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో విఫలమైంది. తొలి గేమ్ ఆరంభంలో సింధు 0-3తో వెనుకబడినా ఆ వెంటనే కోలుకొని స్కోరును 8-8 వద్ద సమం చేసింది. ఆ తర్వాత సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 13-8తో ఆధిక్యంలోకి వెళ్లింది. కిమ్ పుంజుకునేందుకు కృషి చేసినా సింధు అవకాశమివ్వకుండా ఈసారి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 19-9తో ముందంజ వేసింది. అదే జోరులో తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో సింధుకు కాస్త పోటీ ఎదురైంది. ఒకదశలో ఇద్దరి మధ్య తేడా ఒక పాయింట్ ఉంది. కానీ కీలకదశలో ఈ హైదరాబాద్ అమ్మాయి పైచేయి సాధించి మూడు పాయింట్లు నెగ్గి 20-16తో ఆధిక్యాన్ని సంపాదించి, అదే ఉత్సాహంలో మరో పాయింట్ కైవసం చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. సింధు కెరీర్లో ఇది మూడో గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్. గతేడాది ఆమె మలేసియా ఓపెన్, మకావు ఓపెన్ టైటిల్స్‌ను సాధించింది. ఈ ఏడాది సింధు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు గెలిచింది. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో, ఉబెర్ కప్‌లోనూ కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. ఇండియన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. స్విస్ ఓపెన్‌లో సెమీస్‌లో ఓడిన సింధు... డెన్మార్క్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, సింగపూర్ ఓపెన్లలో మాత్రం క్వార్టర్ ఫైనల్స్‌లో వెనుదిరిగింది. ఒకే అంతర్జాతీయ టోర్నీని వరుసగా రెండుసార్లు గెల్చుకున్న రెండో భారతీయ క్రీడాకారిణిగా సింధు నిలిచింది. గతంలో సైనా నెహ్వాల్ ఈ ఘనతను మూడుసార్లు సాధించింది. సంతోషంగా ఉంది విజయంతో 2014 సంవత్సరాన్ని ముగించడం సంతోషంగా ఉంది. వరుసగా రెండో ఏడాది మకావు గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్‌ను గెల్చుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. నా ప్రత్యర్థి ఫైనల్‌కు ముందు అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడించింది. కాబట్టి ఆమెను బలహీన ప్లేయర్‌గా చెప్పలేం. వరుస గేమ్‌లలో మ్యాచ్ ముగిసినా ఆమె గట్టి పోటీ ఇవ్వడంతో గెలుపు కోసం శ్రమించాల్సి వచ్చింది. నా ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాను. కెరీర్లో గుర్తుంచుకోదగ్గ విజయాలు ఈ ఏడాది నాకు లభించాయి. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచాను. కొన్ని పరాజయాలు ఉన్నా ఎలాంటి బాధ లేదు. గ్లాస్గోలో స్వర్ణంతో పాటు ఏషియాడ్‌లో వ్యక్తిగత పతకం గెలవాల్సింది. మరింత కష్టపడి వచ్చే సంవత్సరం ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తాను. - పీవీ సింధు -
వరల్డ్ బ్యాడ్మింటన్ : సింధూకు కాంస్య పతకం
-
కాంస్య ‘సింధూ’రం
►సెమీస్‌లో ఓడిన హైదరాబాద్ అమ్మాయి ►ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో కాంస్యం ► ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు కోపెన్‌హాగెన్: గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తాను సాధించిన కాంస్యం గాలివాటం కాదని భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు నిరూపించింది. వరుసగా రెండో ఏడాది ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో ఈ హైదరాబాద్ అమ్మాయి కాంస్యం సాధించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని లిఖించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 17-21, 15-21తో ప్రపంచ 10వ ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయినా... కాంస్య పతకం దక్కించుకుంది. ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్‌లో అద్వితీయ విజయాలు సాధించిన సింధు సెమీఫైనల్లో మాత్రం అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సింధు కనీసం 15 పాయింట్లను నెట్ వద్ద సమర్పించుకుంది. ఆమె కొట్టిన చాలా షాట్లు నెట్‌కు తగిలాయి. కొన్నిసార్లు కరోలినా చక్కటి ప్లేస్‌మెంట్స్‌తో పాయింట్లు రాబట్టింది. తొలి గేమ్‌లో ఒకదశలో 2-6తో వెనుకబడిన సింధు వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 8-6తో ముందంజ వేసింది. కానీ కీలకదశలో తప్పిదాలు చేసి తేరుకోలేకపోయింది. 10-15తో వెనుకబడిన సింధు స్కోరును సమం చేసేందుకు యత్నించినా సఫలం కాలేకపోయింది. తుదకు 21 నిమిషాల్లో తొలి గేమ్‌ను కోల్పోయింది. గత రెండు మ్యాచ్‌ల్లో తొలి గేమ్‌ను కోల్పోయి పుంజుకున్న సింధు ఈసారి మాత్రం దానిని పునరావృతం చేయలేకపోయింది. ఒకదశలో సింధు 11-9తో రెండు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ ఆ తర్వాత తడబాటుకు లోనైంది. సింధు ఒత్తిడిలో ఉందనే విషయాన్ని గ్రహించిన కరోలినా సమయస్ఫూర్తితో ఆడుతూ వరుసగా నాలుగు పాయింట్లు సంపాదించి 16-12తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు సంచలనం నమోదు చేసింది. ప్రపంచ రెండో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 19-21, 21-19, 21-15తో అద్భుత విజయం సాధించింది. కెరీర్లో షిజియాన్‌పై సింధుకిది నాలుగో విజయం కావడం విశేషం. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ సింధు క్వార్టర్ ఫైనల్లో షిజియాన్‌ను ఓడించింది. సైనాకు ఐదోసారి నిరాశ మరో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో సైనా 15-21, 15-21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ జురుయ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. సైనా తాను ఆడిన ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలోనూ క్వార్టర్ ఫైనల్ దశలోనే నిష్ర్కమించడం గమనార్హం. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు లభించిన నాలుగు పతకాలూ కాంస్యాలే కావడం గమనార్హం. 1983లో కోపెన్హాగెన్లోనే జరిగిన పోటీల్లో ప్రకాశ్ పదుకొనే పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు తొలి కాంస్యాన్ని అందించాడు. 2011లో లండన్‌లో జరిగిన పోటీల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప మహిళల డబుల్స్ విభాగంలో భారత్ ఖాతాలో రెండో కాంస్యాన్ని జతచేశారు. 2013లో చైనాలోని గ్వాంగ్జూలో జరిగిన పోటీల్లో... ఈ ఏడాది కోపెన్‌హాగెన్‌లో జరిగిన పోటీల్లో పి.వి.సింధు మహిళల సింగిల్స్‌లో భారత్‌కు రెండు కాంస్యాలు అందించింది. -
సైనా x సింధు!
పారిస్: అంతా అనుకున్నట్టు జరిగితే... అంతర్జాతీయస్థాయిలో తొలిసారి భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పి.వి.సింధు ముఖాముఖి పోరును చూసే అవకాశముంది. ఈనెల 22 నుంచి 27 వరకు పారిస్‌లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులిద్దరూ ఒకే పార్శ్వంలో ఉన్నారు. మంగళవారం విడుదల చేసిన ‘డ్రా’ ప్రకారం ఆరంభ విఘ్నాలను అధిగమిస్తే మహిళల సింగిల్స్‌లో సైనా, సింధులు క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడతారు. తొలి రౌండ్లో ఆరో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో ఆడనున్న సింధు ఈ మ్యాచ్‌లో గెలిస్తే రెండో రౌండ్లో కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్) లేదా క్రిస్టినా గావన్హోల్ట్ (చెక్ రిపబ్లిక్)లలో ఒకరితో పోటీపడుతుంది. మరోవైపు నాలుగో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సైనా తొలి రౌండ్లో నిచావోన్ జిందాపోన్ (థాయ్‌లాండ్)తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రెండో రౌండ్లో ఈ హైదరాబాద్ అమ్మాయికి యోన్ జూ బే (దక్షిణ కొరియా) ఎదురుకావొచ్చు. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గితే క్వార్టర్ ఫైనల్లో సింధు, సైనా పోటీపడతారు. గత ఆగస్టులో జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో సైనా, సింధు రెండుసార్లు పోటీపడగా... రెండు మ్యాచ్‌ల్లో సైనానే గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పారుపల్లి కశ్యప్‌కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. అతను తొలి రౌండ్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా)తో ఆడాల్సి ఉంది. గతంలో లీ చోంగ్ వీతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కశ్యప్ వరుస గేముల్లో ఓడిపోయాడు. కశ్యప్‌తోపాటు అజయ్ జయరామ్, గురుసాయిదత్ కూడా మెయిన్ ‘డ్రా’లో ఉన్నారు. తొలి రౌండ్లో సకాయ్ కజుమాసా (జపాన్)తో జయరామ్; చెన్ యుకెన్ (చైనా)తో గురుసాయిదత్ ఆడతారు.